
Qualcomm రాజా సంస్థకు చెందిన తాజా అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌తో అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లతో Asus సంస్థ ఇటీవల భారతీయ మార్కెట్లో Zenfone 5Z అనే మోడల్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ ఫోన్ కి సంబంధించిన అమ్మకాలు ఈరోజు రాత్రి 12 గంటలకు ( అంటే జూలై 9) నుండి Flipkart వెబ్సైటు ద్వారా ప్రారంభం కాబోతున్నాయి. సామ్సంగ్ గెలాక్సీ S9 వంటి flagship phoneలలో నిక్షిప్తం చేయబడిన ప్రాసెసర్ ఈ ఫోన్లో పొందుపరచబడింది. ప్రధానంగా ఇది మూడు మోడళ్లుగా లభిస్తుంది. 6GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ 29,999 రూపాయలకి విక్రయించబడుతుండగా, 6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ 32,999 రూపాయలకీ, అలాగే 8GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మోడల్ 36,999 రూపాయలకీ విక్రయించబడుతుంది.
దీంతోపాటు ICICI Credit, Debit cardలను వాడే వినియోగదారులకు ఈ ఫోన్ కొనుగోలుపై 3,000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. కేవలం 499 రూపాయలకు Flipkart అందించే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవచ్చు కూడా. ఈ ఫోన్ కొనుగోలు చేసిన Reliance Jio వినియోగదారులు 198 మరియు 299 రూపాయల విలువైన ప్రీపెయిడ్ రీఛార్జి లపై 2,200 విలువైన cashbackని ఒక్కొకటి 50 రూపాయల విలువ కలిగిన 44 ఓచర్లుగా పొందవచ్చు. అంతేకాదు అదనంగా 100 GB వరకూ ఉచిత డేటాను పొందవచ్చు.