BlackBerry phoneల అధికారిక వెబ్‌సైట్ హ్యాక్ అయింది!

blackberry phones

Android, iOS phoneలతో పాటు BlackBerry కూడా నిన్న మొన్నటి వరకూ ప్రముఖ smartphone platform. ఇప్పుడు కూడా ఈ బ్రాండ్ పేరుతో Android phoneలు వస్తున్న విషయం తెలిసిందే.

ఈ BlackBerry సంస్థకి చెందిన అఫీషియల్ website అయిన blackberrymobile.com హ్యాక్ అయింది. Magento webshop సా‌ఫ్ట్‌వేర్‌లోని ఓ సెక్యూరిటీ లోపాన్ని ఆసరాగా చేసుకుని ఓ హ్యాకర్ దీన్ని హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసిన తర్వాత CoinHive అనే cryptocurrency miner కోడ్‌ని ఆ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేశాడు ఆ హ్యాకర్.

అంటే ఇకపై ఆ BlackBerry వెబ్‌సైట్‌ని మన లాంటి వాళ్లు ఎవరైనా విజిట్ చేసిన వెంటనే మన phone, computerలోని ప్రాసెసర్ రన్ అవుతూ ఆ హ్యాకర్ కోసం క్రిప్టోకరెన్సీ మైనింగ్ జరుగుతుందన్న మాట. కేవలం Blackberry సైట్ ఒక్కదాన్నే కాదు.. ఆ హ్యాకర్ ఇదే విధంగా shopping script ఆధారంగా పనిచేసే అనేక ఇతర సైట్లనీ హ్యాక్ చేసి తన CoinHive కోడ్‌ని జొప్పించాడు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

CoinHive సంస్థ ఆ హ్యాకర్ అకౌంట్ మీద ఫిర్యాదులు రావడంతో అతని అకౌంట్‌ని సస్పెండ్ చేసిందనుకోండి. కానీ bitcoin mining కోసం ఇటీవల torrent సైట్లు ఇలా అడ్డదారులు తొక్కితే ఇప్పుడు హ్యాకర్లు ప్రముఖ సైట్లని టార్గెట్ చేయడం గమనార్హం.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general