Broadband కనెక్షన్ ఉందా? ఈ 4 జాగ్రత్తలు తీసుకోండి!

4 precautions for broadband users

Work from Home, Online Classes మొదలైన తర్వాత చాలా మంచి మొబైల్ డేటా సరిపోక Broadband కనెక్షన్ తీసుకుంటున్నారు. మీకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

పోర్ట్ ఫార్వార్డింగ్

అధికశాతం broadband సర్వీసులు port forwarding సదుపాయాన్ని డిసేబుల్ చేస్తూ ఉంటాయి. దీంతో ఇంటర్ నెట్ లో కొన్ని కీలకమైన పనులు చేసుకోవడం కష్టమౌతుంది. అంతేకాదు, torrents వంటివి కూడా చాలామందికి పనిచేయవు. ఈ నేపథ్యంలో మీరు వాడుతున్న బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ లో port forwarding ఎనేబుల్ చేయబడి ఉందో లేదో ఛెక్ చేసుకోవటానికి https://www.canyouseeme.org/ అనే సైట్ పనికొస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, మీరు WiFi Router వాడుతుంటే దాన్ని port forwardingని రూటర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీరు ఎనేబుల్ చేసి, ఆ తర్వాత ఛెక్ చేయాలి.

స్పీడ్ మారుతోందా?

చాలామంది broadband యూజర్లు తమకు ISP చెప్పిన ఇంటర్నెట్ స్పీడ్ పూర్తిగా రావడం లేదని తరచూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. స్పీడ్ ఛెకింగ్ చేసే విధానం మొదట కరెక్ట్ గా ఉండాలి. WiFi రూటర్‌కి బ్రాడ్బ్యాండ్ కేబుల్ కనెక్ట్ చేసి, WiFi నుండి సిగ్నల్ పొంది mobile phoneలో Speed Test వంటి అప్లికేషన్ల ద్వారా టెస్ట్ చేస్తే సరైన ఫలితాలు లభించవు. దానికి బదులుగా ISP అందించే లాన్ కేబుల్‌ని నేరుగా పిసి లేదా laptopకి కనెక్ట్ చేసి.. speedtest.net సైట్ ఓపెన్ చేసి తగినంత స్పీడ్ వస్తుందో లేదో అక్కడ మాత్రమే చెక్ చేయాలి. రోజుకి రెండు మూడు సార్లు ఛెక్ చెయ్యడం ద్వారా వాళ్లు చెప్పినట్లు స్పీడ్ ఇస్తున్నారా లేదా తెలుస్తుంది. ఏదైనా సమస్య ఉంటే కంప్లైంట్ చేసే విషయంలో ఏమాత్రం ఆలోచించలేదు.

రిపోర్టులు కరెక్ట్‌గా ఉన్నాయా?

ఏరోజుకారోజు మీరు download, upload చేస్తున్న మొత్తం డేటా వాళ్ళు అందించే usage dashboardలో కరెక్ట్ గా చూపిస్తున్నారా లేదా పరిశీలించండి. కొన్ని అప్లికేషన్లు బ్యాక్గ్రౌండ్ డేటా సింక్ చెయ్యడం వల్ల కొంత ఎక్కువ డేటా వినియోగం ఉండొచ్చు. అలాగని మీకు తెలీకుండా మరీ ఎక్కువ డేటా వాడినట్లు ISP చూపిస్తుంటే కచ్చితంగా దృష్టిపెట్టాల్సిన విషయం.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Free Offers

ఈ మధ్యకాలంలో ACT Fibernet వంటి అనేక ISPలు, Zee5 subscription వంటివి ఒక నెల ఫ్రీ గా పంపొచ్చు అంటూ లింకులు పంపిస్తున్నాయి. పొరబాటున వాటిని సబ్స్క్రిప్షన్ చేస్తే, నెల రోజుల తర్వాత ఆటోమేటిక్ గా నెలకి 99 చెల్లించాలి. వాటిని నేరుగా డిజేబుల్ చేసుకోవటానికి ఆప్షన్ కూడా కనిపించదు. ప్రత్యేకంగా కస్టమర్ కేర్ కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయించాలి. కాబట్టి ఇలాంటి free offersకి దూరంగా ఉండండి.

Computer Era
Logo
Enable registration in settings - general