ఫోన్‌తో Camera RAW‌ images షూట్ చేస్తే చాలా ఉపయోగాలు

camera

క్రమేపీ సెల్‌ఫోన్‌ కెమెరాలు మరింత శక్తివంతంగా తయారవుతున్నాయి. DSLR కెమెరాల్లో మాదిరిగా ISO, Aperture, shutter speed వంటి అన్ని రకాల సెట్టింగుల్ని మార్చుకోగలిగే విధంగా ఈ మధ్య కాలంలో వస్తున్న సెల్‌ఫోన్‌ కెమెరాలు వీలు కల్పిస్తున్నాయి. అదే విధంగా కొన్ని ఫోన్లు అయితే RAW ఇమేజ్‌లను షూట్‌ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి.

Camera RAW అంటే ఏమిటి?

ప్రతీ కెమెరాలోనూ ఇమేజ్‌ ప్రాసెసర్‌ అని ఒకటి
ఉంటుంది. కెమెరాలోని లెన్స్‌ కేవలం కాంతి కిరణాల్ని మాత్రమే కేప్చర్‌ చేస్తుంది. ఇలా లెన్స్‌ చేత కేప్చర్‌ చెయ్యబడిన కాంతిని ఈ ఇమేజ్‌ సెన్సార్‌ exposure, contrast, sharpness వంటి విలువల్ని తగిన విధంగా అడ్జెస్ట్‌ చేసి (దీన్నే ప్రాసెసింగ్‌ అంటారు) ఆ తర్వాత JPEG ఫార్మేట్‌లో ఓ ఇమేజ్‌గా సేవ్‌ చేస్తుంది. అదే RAW ఇమేజ్‌ విషయానికి వస్తే ఇమేజ్‌ ప్రాసెసర్‌చే ఇలాంటి ప్రాసెసింగ్‌ ఏదీ చెయ్యబడదు. కేవలం కెమెరా లెన్స్‌ ద్వారా కేప్చర్‌ చెయ్యబడిన కాంతి మాత్రమే ఓ ఫైల్‌ రూపంలో సేవ్‌ చెయ్యబడుతుంది. ఆ తర్వాత ఆ ఫైల్‌ని ూసశీపవ కూఱస్త్రష్ట్ర్‌తీశీశీఎ వంటి కంప్యూటర్‌ అప్లికేషన్లలోనో, మొబైల్‌ యాప్స్‌లోనే మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఫొటోపై పూర్తి నియంత్రణ సాధించడానికి ఇది పనికొస్తుంది.
RAW ఎందుకు?

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

మనం ప్రత్యేకంగా ప్రాసెస్‌ చెయ్యాల్సిన పనిలేకుండానే నేరుగా JPEG ఇమేజ్‌ రెడీ అవుతుంటే RAW ఇమేజ్‌గా సేవ్‌ చెయ్యడం ఎందుకు అని మీకు అన్పించవచ్చు. కెమెరాలోని ఇమేజ్‌ ప్రాసెసర్‌ ఫొటోని JPEG ఇమేజ్‌గా సేవ్‌ చేసేటప్పుడు దాని ఫైల్‌ సైజ్‌ని తగ్గించడం కోసం pixel dataని ఇమేజ్‌ నుండి తొలగిస్తుంది. దీనివల్ల ఇమేజ్‌లోని స్పష్టత కొంతవరకూ లోపిస్తుంది. ఇలా క్వాలిటీ నష్టం వాటి ల్లకుండా ఉండడం కోసం RAW ఫార్మేట్‌లో రికార్డ్‌ చేసుకుని తర్వాత మనం adjust‌ చేసుకోవడం మంచిది.

ఫోన్‌లో ఎలా?

Android ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని Camers 2.0 apiని వాడుకోగలిగేలా ఫోన్‌లో డీఫాల్ట్‌గా లభించే camera యాప్స్‌ ఉన్నప్పుడే వాటి ద్వారా RAW ఫొటోల్ని కేప్చర్‌ చెయ్యడం సాధ్యపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిలో Samsung Galaxy S6 Edge Plus, Samsung Galaxy S7, LG G5  వంటి తాజా శక్తివంతమైన ఫోన్లలో మాత్రమే RAW ఇమేజ్‌లను డీఫాల్ట్‌గా షూట్‌ చేసే సదుపాయం లభిస్తోంది. అయినప్పటికీ కొన్ని థర్డ్‌ పార్టీ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ని Google Play Store నుండి download చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా RAW ఇమేజ్‌లను నేరుగా ఫోన్‌లోని కెమెరా ద్వారానూ కేప్చర్‌ చేసుకోవచ్చు.

Computer Era
Logo
Enable registration in settings - general