టెక్నాలజీ ని విపరీతంగా వాడుతున్న ఈ రోజుల్లో Free WiFi, సర్వసాధారణం అయ్యిపోయింది. ఎక్కడ చూసినా మనకు Free WiFi సదుపాయం కల్పిస్తున్నారు. ముఖ్యంగా airports, shopping malls, restaurants, railway stationsలో ఈ మధ్య Free WiFi సదుపాయం అందుబాటులోకి వస్తోంది.
Free WiFi సేవలు ఉపయోగం అయినా దీనిలో వున్న లోపాలు వలన ముఖ్యంగా authentication లేకపోవటం వలన యూజర్స్ యొక్క మొత్తం సమాచారం హ్యాకర్స్ చేతి లో కి వెళ్ళిపోతుంది. వీటిలో చాలా పద్ధతులు వున్నాయి. ఐతే ఎక్కువుగా Man in the middle attack అనే పద్దతి ద్వారా సమాచారం దొంగలించబడుతుంది. ఈ పద్దతిలో bank, mail, facebook వంటి వివిధ సైట్ల username, passwordల వంటి అతి విలువైన లాగిన్ వివరాలు దొంగిలించబడుతున్నాయి .
Side Jacking అనే వేరొక పద్దతి ద్వారా హ్యాకర్లు తరచూ యూజర్ల యొక్క ముఖ్యమైన సమాచారాన్ని తస్కరిస్తూ ఉంటారు.
అదే విధంగా ఒకేలాంటి డూప్లికేట్ WiFiలను పెట్టి మరియు ఒకే నెట్‌వర్క్‌లో వున్న వాటిల్లో malware ని చొప్పించి హ్యాకర్స్ సమాచారాన్ని దొంగతనం చేస్తున్నారు.
Norton’s Cybersecurity Insights సమాచారం ప్రకారం 77% భారతీయులు హ్యాకర్స్ బారిన పడ్డారు. వారిలో 52% క్రెడిట్ కార్డు మోసాలకు గురిఅయ్యారు. Intel Security, India మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ మహాపాత్ర అభిప్రాయం ప్రకారం హ్యాకర్స్ ఎక్కువగా fitnees మరియు డైట్ కి సంబందించిన promotional linksని ఏర్పాటు చేసి వాటి ద్వారా సమాచారాన్ని సంగ్రహిస్తున్నారు. ఇటువంటి కంటెంట్‌ని బ్రౌజ్ చేసేటప్పుడు వీటికి సంబందించిన లింక్స్ సురక్షితం ఉన్నవా లేదా అనేది గమనించట్లేదు. ఇటువంటి లింక్స్ లో దాదాపు 77% వ్యక్తులు వారి ఈమెయిల్ అడ్రస్ ని, 72% వ్యక్తులు వారి పూర్తి వివరాలను, 53% వయస్సు మొదలగు వివరాలను ఎలాంటి సంకోచం లేకుండా ఇస్తున్నారట.
ఇటువంటి వాటి బారిన పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఉచిత వైఫై సేవలను ఉపయోగించేటప్పుడు banking, online shopping లాంటి క్రెడిట్ కార్డు మరియు బ్యాంక్ లాగిన్ సమాచారం వున్న వెబ్సైట్లను వాడకూడదు. ఫైల్ షేరింగ్ ఆప్షన్ ని disable చెయ్యటం ద్వారా మరియు ఉచిత వైఫై ని వాడుకున్న తర్వాత “Forget network / delete” ఆప్షన్ ని ఉపయోగించటం ద్వారా మనకు తెలియకుండా ఇటువంటి పబ్లిక్ వైఫై లకు కనెక్ట్ అవ్వకుండా ఉండి మన సమాచారాన్ని కాపాడుకోవచ్చు.
-మోహన్ దేవ్ తవ్వా