Reliance Jio మార్కెట్లకు ప్రవేశించినప్పటినుండి దానికి వ్యతిరేకంగా Airtel పలు సందర్భాల్లో వ్యవహరించడం, దానికి ప్రతిస్పందనగా అవకాశం దొరికినప్పుడల్లా Jio కూడా Airtel కదలికలను నిశితంగా గమనిస్తూ అవసరమైతే కోర్ట్ కేసు వేయడం చూస్తూనే ఉన్నాం.
ఆ క్రమంలో తాజాగా T20 live streaming గురించి Airtel ఇచ్చిన ప్రకటన వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. IPL క్రికెట్ మ్యాచుల కవరేజ్ live and free access అనే పదాన్ని ప్రస్తావిస్తూ Airtel సంస్థ ప్రకటన ఇస్తోంది. ఈ ప్రకటన వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా లేదని దాని అక్షరాలు పెద్దగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని గతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశించినప్పటికీ Airtel తగిన మార్పులు చేయకపోవడం గమనించి Reliance Jio సంస్థ మళ్లీ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది.
విచారణలో భాగంగా న్యాయమూర్తి యోగేశ్ ఖన్నా Airtel T20 live streaming గురించి ఇస్తున్న ప్రింట్, వీడియో ప్రకటనలు స్వయంగా పరిశీలించిన మీదట Airtel ఏప్రిల్ 13న జారీచేయబడిన గత కోర్ట్ ఆర్డర్‌లో పేర్కొన్న విధంగా మార్పులు చేయలేదని తక్షణం Live and free access అనే అక్షరాలను పెద్దవిగా చూపించాలని మరోసారి ఆదేశించారు.
వాస్తవానికి ఈ ఆఫర్ ద్వారా Airtel వినియోగదారులు కేవలం ఉచితంగా Hotstar సబ్స్క్రిప్షన్ పొందగలుగుతారు మాత్రమే. T20 మ్యాచ్‌లు చూడాలంటే వారు ఎంపిక చేసుకున్న ప్యాకేజీని బట్టి లభించే మొబైల్ డేటా ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి Airtel వినియోగదారులను Airtel తప్పుదారి పట్టిస్తోంది అన్నది Reliance Jio ఆరోపణ.