• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

Uncategorized

Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ

by

Android phoneలలో శక్తివంతమైన పనితీరు కలిగిన flagship phoneలను తయారుచేయడంలో Samsung ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. అయితే ఆ సంస్థ flagship series phoneలు అయిన S series, Note series phoneలు ఇప్పుడు 70, 80 వేల రూపాయల వరకు ధర పలుకుతూ ఉండటంతో మధ్య స్థాయి budget కలిగి ఉన్న వినియోగదారుల కోసం Samsung కొత్తగా Galaxy S20 FE phoneను విడుదల చేసింది. ఇప్పటికే 40, 50 వేల ధరలో OnePlus, Xiaomi వంటి సంస్థలు ప్రాచుర్యం పొందడం గమనించిన Samsung ఈ ఒరవడికి శ్రీకారం చుట్టింది.

ధర..

8 GB RAM కలిగివుండే ఈ Samsung Galaxy S20FEలో 128 GB, 256 GB internal storage కలిగిన రెండు models లభిస్తున్నాయి. 128GB modelని 40,998 రూపాయలకి ఈ లింక్‌లో, 256GB modelని రూ. 44,998కి ఈ లింక్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇతర దేశాల్లో 5G model లభిస్తున్నప్పటికీ, మన దేశంలో ఇప్పటికీ 5G రాని కారణంగా కేవలం 4G model మాత్రమే లభిస్తోంది. 42,999 రూపాయలకు లభిస్తున్న OnePlus 8Tని లక్ష్యంగా పెట్టుకొని Samsung ఈ Galaxy S20FEని విడుదల చేసినట్లు అర్థమవుతోంది.

డిజైన్


Samsung Galaxy S20 FE, design పరంగా చూస్తే 6.5 అంగుళాల screen పరిమాణంతో Galaxy S20 మాదిరిగానే కనిపిస్తుంది. ఆకర్షణీయంగా కన్పించే metallic frame వాడబడినప్పటికీ phone వెనక భాగం మాత్రం matte plycarbonateతో రూపొందించబడింది. 128GB model మొత్తం ఐదు రంగుల్లో లభిస్తుంది. Phone వెనక భాగంలో అంచులు గుండ్రం గా ఉండటం వలన phone చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.

Galaxy S20 FEలో power, volume buttonలు ఎడమచేతి వైపున ఉంటాయి. Phone కింది భాగంలో USB Type-C port లభిస్తుంది. 3.5mm audio jack అందించబడదు. దానికి బదులు wireless earbuds ఉపయోగించాల్సి ఉంటుంది. Phone పైభాగంలో SIM card tray, memory card సదుపాయం లభిస్తాయి. 8.4mm మందంతో, 190 grams బరువును ఈ phone కలిగి ఉంటుంది. IP 68 rating ఉండటం వల్ల water, dust resistance లభిస్తాయి. అన్ని రకాలుగా Galaxy S20FE ఒక premium phone మాదిరిగానే అనిపిస్తుంది. Galaxy S20లో ఉపయోగించబడిన శక్తివంతమైన processor అయిన Exynos 990నే ఇందులో కూడా నిక్షిప్తం చేయబడింది. అదనపు storage కోసం 1TB వరకూ memory cardని అమర్చుకునే అవకాశం ఉంది. 4500 mAh capacity కలిగిన batteryతో పాటు wireless charging support కూడా దీంట్లో ఉంటుంది. ఈ phone వాస్తవానికి 25W fast charging support కలిగివున్నప్పటికీ, 15W adapter మాత్రమే phoneతో పాటు అందించబడుతుంది.

మిగతా 2వ పేజీలో..

Pages: Page 1 Page 2

Filed Under: Uncategorized Tagged With: phone review, product review, samsung galaxy S20FE, Samsung Galaxy S20FE detailed review

Amazonలో 900లకు పైగా కొత్త ప్రోడక్టులు రిలీజ్ కాబోతున్నాయి!

by

Amazon Great Indian Festival Sale

Amazon Great Indian Festival Sale ఈనెల 17వ తేదీ నుండి రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు ఈ సేల్ కొనసాగించబడుతుంది. దీనికి సంబంధించి అమెజాన్ పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

6.5 లక్షల మంది అమ్మకందారులు ఈ సేల్‌లో తమ వస్తువులను విక్రయిస్తున్నారు. అన్ని విభాగాల్లో కలిపి నాలుగు కోట్ల ఉత్పత్తుల వరకు ఇందులో లభిస్తాయి. అలాగే దేశవ్యాప్తంగా వంద నగరాల్లో 20 వేలకు పైగా స్థానిక షాపులు ఈ ప్రత్యేకమైన సేల్‌లో పాలు పంచుకుంటున్నాయి. కేవలం పెద్దపెద్ద వస్తువులు మాత్రమే కాకుండా పండుగ సమయంలో నిత్యావసర వస్తువులు కూడా వేగంగా ఇంటికి అందజేసే విధంగా దేశవ్యాప్తంగా ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

ఇదిలా ఉంటే మరోవైపు smartphones, televisions, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, kitchen appliances, యాక్సెసరీస్ వంటి అన్ని విభాగాల్లో కలిపి 900 పైగా కొత్త ఉత్పత్తులను Amazon Great Indian Festival Saleలో రిలీజ్ చేస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు Amazon India సైట్లో ఉన్న వస్తువుల గురించి వారి సొంత భాషలో తెలుసుకునే విధంగా స్థానిక భాషా సపోర్ట్ కూడా ఇటీవల తీసుకురాబడింది. ఈ పండుగ సీజన్లో నవరాత్రి, దుర్గా పూజ, దంతేరస్, రాబోతున్న పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల ఉత్పత్తులతో Amazon అలరించబోతోంది. వాటికి సంబంధించి ప్రత్యేకమైన సేల్ పేజీలు ఆయా సమయాల్లో దర్శనమిస్తాయి.

వినియోగదారులు ఆర్డర్ చేసిన ఉత్పత్తులను ఎప్పటికప్పుడు వేగంగా డెలివరీ చేయడం కోసం దేశవ్యాప్తంగా 200 వరకు డెలివరీ స్టేషన్స్, వేలాది మంది డెలివరీ పార్టనర్‌‌ని ఆ సంస్థ నియమించుకుంది. అక్టోబర్ 17 వ తేదీన మొదలయ్యే ఈ Amazon Great Indian Festival Saleని Amazon Prime సబ్స్క్రిప్షన్ కలిగి ఉన్న వినియోగదారులు ఒకరోజు ముందే, అంటే అక్టోబర్ 16 వ తేదీ నుండి వినియోగించుకోవచ్చు. “కంప్యూటర్ ఎరా” ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన deals గురించి మీకు సమాచారం అందిస్తుంది.

Filed Under: Uncategorized Tagged With: amazon discount sale, Amazon great indian festival sale discounts, amazon sale, smart tv, smartphones

పండగ షాపింగ్ సీజన్ వచ్చింది.. Amazon Prime, Flipkart Plus ద్వారా అనేక ప్రయోజనాలు!

by

Amazon Prime Flipkart Plus subscription

దసరా, దీపావళి పండుగ సీజన్ వచ్చింది.. Amazon, Flipkart వివిధ రకాల వస్తువులు మీద భారీగా డిస్కౌంట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే మామూలు వినియోగదారులతో పోలిస్తే Amazon Prime సబ్స్క్రిప్షన్ కలిగి ఉన్న వారికి, Flipkart Plus హోదా ఉన్నవారికి అదే విధంగా అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి.

అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యేకమైన సేల్ మొదలు కావటానికి ఒకరోజు ముందు నుండే ఈ subscriptions కలిగి ఉన్న వినియోగదారులు తమకు కావలసిన వస్తువులు సొంతం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇక్కడ Flipkart సేల్ అక్టోబర్ 16 వ తేదీన మొదలు అవుతుంటే, Flipkart Plus హోదా కలిగి ఉన్నవారు అక్టోబర్ 15 రాత్రి 8 గంటల నుండి ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. మరోవైపు Amazon Great Indian Festival sale అక్టోబర్ 17వ తేదీ మొదలవుతుంది. కానీ Amazon Prime సబ్స్క్రిప్షన్ కలిగి ఉన్న వారు ఒక రోజు ముందు, అంటే అక్టోబర్ 16వ తేదీ నుండి దీనిలో పాల్గొనవచ్చు.

Amazon Prime సబ్స్క్రిప్షన్ తీసుకోవడం చాలా సులభం. దీనికోసం https://amazon.in/prime అనే విభాగంలోకి వెళ్లి, నెలకి 199 రూపాయలు గాని, సంవత్సరానికి ₹999 గానీ చెల్లించడం ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 50% డిస్కౌంట్ తో కేవలం 329 రూపాయలు చెల్లించి మూడు నెలల సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని అప్లోడ్ చేయాలి.

అయితే Flipkart Plus మెంబర్ షిప్ తీసుకోవడం మాత్రం కొద్దిగా కష్టమైన పని. గత పన్నెండు నెలల కాలంలో Flipkart ద్వారా వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసి 200 super coins సొంతం చేసుకున్న వారికి మాత్రమే Flipkart Plus మెంబర్‌షిప్ లభిస్తుంది. ప్రతీ 100 రూపాయల విలువైన కొనుగోలుకి Flipkart Plus సభ్యులుగా ఉన్న వారికి 4 సూపర్ కాయిన్స్, ఇతరులకు రెండు సూపర్ కాయిన్స్ ఇవ్వబడతాయి. అయితే ప్రతీ ఆర్డర్ మీదా గరిష్టంగా 100 సూపర్ కాయిన్స్ మాత్రమే సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

Amazon Prime సబ్స్క్రిప్షన్ ద్వారా Amazon Prime Video, Prime Music కూడా ఉచితంగా లభిస్తాయి. అలాగే అర్హత కలిగిన ఉత్పత్తుల మీద ఎలాంటి డెలివరీ ఛార్జీలు వసూలు చేయబడవు. Flipkart Plus మెంబర్షిప్ కలిగినవారు వేగంగా డెలివరీ, సేల్ సమయంలో అందరికంటే ముందే ఆర్డర్ చేసే అవకాశం లభిస్తాయి.

Filed Under: Uncategorized Tagged With: amazon prime, Amazon Prime Flipkart Plus subscription, festival sale, smartphone sale

ఇక మీ DTHలో ఛానళ్లని మరింత సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు.. కొత్త యాప్!

by

DTH channel selection TRAI mobile app

Airtel, TataSky వంటి వివిధ DTH కనెక్షన్లు ఉపయోగించి వినియోగదారులు ఎప్పటికప్పుడు తమకు కావలసిన ఛానళ్లకు సబ్స్క్రిప్షన్ చేయాలన్నా, వద్దనుకున్న వాటిని తొలగించాలి అన్నా చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది.

ప్రత్యేకంగా ఒక ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా గానీ, లేదా సంబంధిత DTH సర్వీసుకు సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా గానీ, ఆ సర్వీసు యొక్క వెబ్సైట్లోకి లాగిన్ కావడం వల్ల గానీ యూజర్లు తమకు కావలసిన ఛానెళ్లని ఎంపిక చేసుకోవచ్చు, వద్దనుకుంటే తొలగించుకోవచ్చు. అయితే ఇంత కష్టపడాల్సిన పని లేకుండా దేశంలోని అన్ని DTH సర్వీసును వాడుతున్న అందరు వినియోగదారులకు ఉపయోగపడే విధంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కొత్త అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Android మరియు iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ అప్లికేషన్, వివిధ డిటిహెచ్ సర్వీసులు వాడుతున్న వినియోగదారులు చాలా సులభంగా తమకు కావలసిన ఛానళ్లకి సబ్స్క్రిప్షన్ చెల్లించటానికి, లేదా ఆల్రెడీ ఉన్న వాటిని తొలగించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. వినియోగదారులు DTH ఛానెళ్ల సబ్‌స్క్రిప్షన్లని సమర్థవంతంగా నిర్వహించుకోవడం ద్వారా ప్రతి నెలా వారికి అయ్యే ఖర్చు మరింత తగ్గించుకునే అవకాశం ఉంటుందని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాలలో, క్రికెట్, ఇతర స్పోర్ట్స్ కి సంబంధించిన టోర్నమెంట్ జరిగేటప్పుడు కొన్ని ఛానళ్లకు సబ్స్క్రైబ్ చేసి చాలామంది మర్చిపోతూ ఉంటారు.

అలాంటప్పుడు TRAI విడుదల చేసిన ఈ అప్లికేషన్ ఎల్లప్పుడూ ఫోన్ లో అందుబాటులో ఉంటే, ఇప్పటికి ఇప్పుడు మన ప్యాకేజ్ లో ఉన్న ఛానళ్ల వివరాలు చూడటంతోపాటు అనవసరమైన వాటిని తొలగించుకొని ప్రయోజనం పొందవచ్చు. కేవలం డిటిహెచ్ మాత్రమే కాకుండా కె దేశవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లను కూడా ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్కు సంబంధించిన డౌన్లోడ్ లింక్ ఇది.

Filed Under: Uncategorized Tagged With: android apps

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వైరస్ గురించి కొత్తగా విడుదల చేసిన Android, iOS యాప్ ఇక్కడ!

by

WHO COVID-19 Android application

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా అనేక అపోహలు కొనసాగుతున్న నేపథ్యంలో, తగిన జాగ్రత్తలు సూచించడంతో పాటు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్ Android, iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లని వాడే వారికి అందుబాటులోకి తీసుకువచ్చింది.

WHO COVID-19 అనే ఈ యాప్‌ని ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎప్పటికప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి తాజా సమాచారం నోటిఫికేషన్స్ రూపంలో చూపించబడుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇన్ఫెక్ట్ అయిన కేసుల సంఖ్య, చనిపోయిన వ్యక్తుల సంఖ్య లైవ్ అప్డేట్ అందిస్తుంది. ఈ వైరస్ గురించి పూర్తి స్థాయి సమాచారంతో ప్రశ్నలు మరియు సమాధానాలు కూడా దీంట్లో లభిస్తాయి.

వైరస్ గురించి అనేక మందికి ఉన్న అపోహలను తొలగించడం కోసం ఒక ప్రత్యేకమైన విభాగం అందించబడింది. ఉదాహరణకు కొంతమంది అల్ట్రావైలెట్ దీపాలు వైరస్‌ని చంపేస్తాయని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అనేక రకాల అపోహల గురించి వివరణ ఇవ్వబడింది. వైరస్ నుండి మనల్ని కాపాడుకోవడం కోసం మనకు మనం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అన్న విషయాలు కూడా దీంట్లో వివరంగా ప్రస్తావించబడి ఉన్నాయి.

వివిధ మీడియా సంస్థలకు తాజా సమాచారాన్ని అందిస్తూ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని కూడా ఈ అప్లికేషన్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిగి ఉంది. అప్లికేషన్ యూజర్ ఇంటర్ ఫేస్ కూడా చాలా సులభంగా ఉంది. ఏమాత్రం టెక్నికల్ నాలెడ్జ్ లేని వారైనా దీన్ని చాలా సులభంగా ఉపయోగించవచ్చు. అయితే సమాచారం మాత్రం ఇంగ్లీషులో మాత్రమే లభిస్తుంది. నిక్కచ్చి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ప్రయత్నించవలసిన అప్లికేషన్ ఇది.

Filed Under: Uncategorized Tagged With: android apps

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 14
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in