Corona Virus ఒక smartphone మీద ఎంతసేపు ఉంటుందంటే..!

How long Corona Virus survive on a Smartphone

Corona Virus ఉపరితలం ఆధారంగా వ్యాపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌ని ఎక్కువగా విస్తరింపజేస్తున్న అంశాల్లో smartphone లను కూడా ప్రధానంగా పేర్కొనవచ్చు.

చాలామంది smartphone వినియోగదారులకి తమ phone మీద Corona Virus ఎంత సమయం బ్రతికి ఉంటుంది అన్న విషయం స్పష్టత లేదు. వాస్తవానికి కరోనా వైరస్ మీద ఉండే ప్రొటీన్ పొర ధ్వసంమైపోతే అది అంతరించిపోతుంది. ఈ నేపధ్యంలో smartphoneలపై అది 96 గంటల వరకూ, అంటే నాలుగు రోజుల పాటు సజీవంగా ఉంటుంది. Smartphone ముందు భాగం గ్లాస్‌తో రూపొందించబడి ఉంటుంది కాబట్టి అంత సమయం పాటు అది ఉంటుంది.

ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపరితలంపై 72 గంటల పాటు, అంటే మూడు రోజుల పాటు అది బ్రతికే ఉంటుంది. ఒకవేళ మీరు వాడుతున్న smartphoneకి ప్లాస్టింగ్ కేసింగ్ ఉంటే, అదీ ఫోన్ వెనుక భాగంలోనే ప్లాస్టింగ్ కేసింగ్ ఉంటుంది కాబట్టి 72 గంటల వరకూ అది ఉండే అవకాశముంది.

పరిష్కారమేంటి?

Smartphone ద్వారా Corona Virus వ్యాపించకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు వీలైనంత వరకూ ఫోన్ చేతిలో పట్టుకోవడం కాకుండా జేబులో, పర్సులో పెట్టుకోవడం అవసరం. అలాగే ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తేనే ఫోన్ బయటకు తీయాలి. లేదంటే బయట పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేతిలోకి తీసుకోకపోవడం ఉత్తమం.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Smartphoneలు, వాలెట్లు, ఇతర వస్తువులపై ఉన్న వైరస్, బ్యాక్టీరియాని చంపేయడానికి UV boxలు Amazon,Flipkart వంటి వాటిలో లభిస్తుంటాయి. బయట నుండి వచ్చిన వెంటనే smartphone, wallet, బెల్ట్, కళ్లజోడు వంటి వస్తువులు అన్నీ దానిలో పెట్టి 5-15 నిముషాల పాటు (మీ UV బాక్స్‌లో ఉన్న ల్యాంప్ సామర్థ్యాన్ని బట్టి సమయం మారుతుంది) అలాగే ఉంచాలి. ఇక్కడ UV ల్యాంప్‌ని నేరుగా కళ్లతో చూడకూడదు. అలాగే అది ఆన్ అయినప్పుడు చేతులు దాని క్రింద పెట్టకూడదు అన్న విషయం గుర్తుంచుకోండి.

ఇకపోతే స్క్రీన్లపై ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లను తొలగించడానికి శానిటైజర్లు కాకుండా విడిగా క్లీనింగ్ లిక్విడ్‌లు లభిస్తాయి. వాటి సాయంతో ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. మీ smartphoneని మీ కుటుంబంలో ఒకరి నుండి మరొకరు మార్చి మార్చి వాడుకోవడం కూడా ప్రమాదకరం. దీనివల్ల Corona Virus వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

Computer Era
Logo
Enable registration in settings - general