ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో భారీ సంఖ్యలో కంప్యూటర్లు ransomware బారిన పడ్డాయని కొద్దిసేపటి క్రితం “కంప్యూటర్ ఎరా”లో రాయడం జరిగింది కదా. ఈ నేపధ్యంలో ప్రముఖ internet service provider అయిన Act Fibernetకి చెందిన 200 కంప్యూటర్లు కూడా ఓ ransomware బారిన పడ్డాయని చాలా రహస్య సమాచారం “కంప్యూటర్ ఎరా”కి తెలిసింది. ఇప్పటి వరకూ ఈ సమాచారం ఇంకెవరికీ తెలియదు.
నిన్న (12 మే 2017)న Act Fibernet నెట్‌వర్క్‌లోని Active Directory ద్వారా దాదాపు 200 కంప్యూటర్లకి ఈ ransomware విస్తరించింది. ముఖ్యమైన డేటాని encrypt చేసి దాన్ని డీక్రిప్ట్ చెయ్యడానికి అమౌంట్ డిమాండ్ చేయడం జరిగింది. Act Fibernet వద్ద ఎలాంటి డేటా బ్యాకప్ కూడా లేనట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో నిన్న వైజాగ్‌లోని Act Fibernet ఆఫీస్, కాల్ సెంటర్ పూర్తిగా స్ధంబించిపోయాయి. అంతే కాదు.. బెంగుళూరు, చెన్నై నగరాలకు చెందిన Act Fibernet ఆఫీసులు కూడా ఈ ransomware మూలంగా తీవ్రంగా ప్రభావితం చెందాయి. ప్రస్తుతం దీనిపై అంతర్గత సెక్యూరిటీ టీమ్‌లు పనిచేస్తున్నాయి.