
Facebook, Instagram, Whatsappలలో ఏదైనా విషయాన్ని అవతల వాళ్ళకి దృశ్యపరంగా చెప్పడానికి చాలామంది స్మైలీలు, స్టిక్కర్లు, యానిమేషన్ల వంటి వాటిని వాడతారు కదా!
అయితే ఇప్పటివరకు కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఇలాంటి యానిమేషన్లు సంబంధిత అప్లికేషన్లలో లభిస్తున్నాయి. తాజాగా ఫేస్బుక్ సంస్థ GIPHY సంస్థను కొనుగోలు చేయడంతో పరిస్థితి మారబోతోంది. GIPHY అనేక మందికి సుపరిచితమైన సంస్థ. ఇందులో భారీ మొత్తంలో వివిధ సందర్భాలకు తగినట్లు GIF యానిమేషన్ ఇమేజెస్ లభిస్తుంటాయి. ఈ సంస్థను ఫేస్బుక్ 400 మిలియన్ డాలర్లు చెల్లించి సొంతం చేసుకుంది.