Google Chrome వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ కచ్చితంగా మీకు నచ్చుతుంది!

Google Home Media Hub feature

ఇంటర్నెట్‌లో రకరకాల వెబ్సైట్లు బ్లౌజ్ చేయడం కోసం చాలామంది Google Chrome బ్రౌజర్ వాడుతూ ఉంటారు. గూగుల్ సంబంధించిన అన్ని రకాల సర్వీసులతో ఇది ఇంటిగ్రేట్ కావడం వలన Microsoft Edge, Opera, Firefox వంటి ఇతర బ్రౌజర్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి కంటే గూగుల్ క్రోమ్ ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు.

అంతా బానే ఉంది కానీ Google Chromeని ఉపయోగించేటప్పుడు ఒక ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒకేసారి మీరు పలు tabs ఓపెన్ చేసుకుని పని చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, అంతలో ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి, సడన్ గా మరో టాబ్‌లోకి వెళ్లినట్లయితే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యూట్యూబ్ వీడియో నుండి వస్తున్న ఆడియో ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

అలాంటప్పుడు ఆ వీడియో మ్యూట్ తీసుకోవడం కోసం, పైన కనిపించే అన్ని ట్యాబ్‌లలో యూట్యూబ్ వీడియో దేేంట్లో ఉందో వెతికి పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి. ఇలా మనం ఓపెన్ చేసిన టాబ్‌ల నుండి బ్యాక్ గ్రౌండ్ లో ఆడియో వినిపించేటప్పుడు, అది ఇరిటేట్ చేయకుండా సులభంగా డిజేబుల్ చేసుకోవటం కోసం కొత్తగా Media Hub అనే సదుపాయం కల్పించబడింది.

మీరు Google Chrome లేటెస్ట్ వెర్షన్ వాడుతున్నట్లయితే, ఇక మీదట మీరు ప్రస్తుతం ఓపెన్ చేసిన ఏదైనా టాబ్‌లో ఆడియో లేదా వీడియో ప్లే అవుతున్నట్లే, వెంటనే పై చిత్రంలో కనిపిస్తున్న విధంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కుడిచేతి చివర Media Hubకి సంబంధించిన ఐకాన్ అప్పటికప్పుడు ప్రత్యక్షమై, ప్రస్తుతం ప్లే అవుతున్న ఆడియో లేదా వీడియో ని పాజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అది ఎల్లప్పుడూ ఒకే ప్రదేశంలో ఉంటుంది కాబట్టి, ఓపెన్ చేయబడి ఉన్న భారీ మొత్తంలో టాబ్‌లలో ఇప్పటివరకు మనం కష్టపడుతున్న విధంగా వెతికి పట్టుకోవలసిన అవసరం లేదు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Computer Era
Logo
Enable registration in settings - general