
Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లు వాడేవారు కొత్తగా ఏదైనా అప్లికేషన్ లేదా గేమ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా Google Play Store మీద ఆధారపడుతుంటారు. అయితే దానికి ప్రత్యామ్నాయంగా తాజాగా మరో అప్లికేషన్ స్టోర్ కూడా అందుబాటులోకి వచ్చింది.
Huawei సంస్థ అందరికీ సుపరిచితమే. కొంత కాలం క్రితం అమెరికా ప్రభుత్వం ఈ సంస్థ తయారు చేసే ఉత్పత్తుల మీద నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ దరిమిలా గూగుల్ సంస్థ కూడా Huawei సంస్థ తయారు చేసే smartphoneలకి గూగుల్ ప్లే స్టోర్ తో సహా అన్ని రకాల సర్వీసులు అందించడం నిలిపివేసింది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై Huawei సంస్థ దృష్టి సారించింది.