Windows 10 Anniversary Updateలో Taskbarలో ఈ మార్పులు!

windows 10 anniversary update

Windows 10 అధికారికంగా విడుదలై రేపు జూలై 29కి ఏడాది కావస్తోంది. జూలై 29లోపు Windows 10ని Free Upgrade చేసుకోవలసిన అవసరాన్ని ఈ లింకులో 2 రోజుల క్రితం రాసిన విషయం గుర్తుండే ఉంటుంది. Windows 10 ఏడాది పూర్తయిన సందర్భంగా Microsoft సంస్థ Anniversary Update పేరిట ఓ కొత్త updateని విడుదల చెయ్యబోతోంది. ఇది మనకు తరచూ Windows Update ద్వారా లభించే చిన్నా చితకా update కాదు. అనేక new features, మార్పులతో ఇది త్వరలో లభించనుంది. ప్రస్తుతం ఇది insider programకి రిజిస్టర్ చేసుకున్న వారికి లభిస్తోంది.

Windows 10 Anniversary Updateలో భాగంగా Microsoft సంస్థ Windows 10 taskbarకి కొన్ని మార్పులు చేయబోతోంది. ఇప్పటి వరకూ taskbarపై రైట్ క్లిక్ చేస్తే Properties అనే ఆప్షన్ కన్పిస్తుంది కదా. Taskbarని లాక్ చెయ్యడం, Auto hide చెయ్యడం, taskbar లొకేషన్‌ని ఎక్కడ సెట్ చెయ్యాలి, taskbarపై మనకు కావలసిన ఇతర toolbarల ఎంపిక వంటివి అన్నీ దీనిలో లభిస్తాయి కదా.

Windows 10 Anniversary Updateలో taskbarపై రైట్ క్లిక్ చేసినప్పుడు  ఈ properties అనే ఆప్షన్ తొలగించబడుతోంది. ఇకపై ఈ configuration settings అన్నీ Settings appలోనే అంతర్భాగంగా పొందుపరచబడనున్నాయి. అందుకే taskbarపై రైట్ క్లిక్ చేసినప్పుడు Settings అనే కొత్త option ఇకపై కన్పిస్తుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

అలాగే taskbarకి Automatically hide the taskbar in tablet mode అనే కొత్త ఆప్షన్‌ని కూడా ఈ anniversary updateలో మైక్రోసాఫ్ట్ సంస్థ చేర్చింది. Computerని Tablet modeలో  వాడేటప్పుడు taskbarని పూర్తిగా తొలగించడం ద్వారా apps full  screenలో రన్ అయ్యే విధంగా ఇది వీలు కల్పిస్తుంది. Windows Storeలో లభించే Facebook, Mail, Outlook వంటి అన్ని apps, gamesని full screenలో మరింత ఆకర్షణీయంగా రన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ పనికొస్తుంది. అలాగే notification countని ప్రోగ్రామ్ iconపై చూపించే విధంగా badge notifications సదుపాయం కూడా ఈ కొత్త వెర్ష‌న్‌లో లభించబోతోంది.

Computer Era
Logo