ఎంత ఖరీదైన శక్తివంతమైన WiFi Routerని కొన్నా, ఆచితూచి మంచి brand రూటర్ కొన్నా WiFi సిగ్నల్ మాత్రం చాలా దారుణంగా వస్తోందని చాలామంది వాపోతుంటారు. Router సిగ్నల్ బలహీనంగా రావడానికి అనేక అంశాలు కారణం అవుతుంటాయి. అవేంటో తెలుసుకుని, వాటిని సరిచేసుకోవడం ద్వారా ఈరోజే router signal మెరుగ్గా వచ్చేలా జాగ్రత్త పడదాం.
Routerని ఎక్కడ అమర్చారు?
WiFi signal సరిగా రాకపోవడానికి మనం routerని ఏ ప్రదేశంలో అమర్చామన్నది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. Cable modemsకి పక్కనా, desktop computerలకు పక్కనా, లేదా బయటి నుండి internet connection ఏ రూమ్లో, ఏ విండో ద్వార ఇంట్లోకి వస్తుందో ఆ రూమ్‌లో ఓ మూలన routerని అమర్చుకుంటూ ఉంటారు. ఇలా చెయ్యడం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ Wifi signal మీద తీవ్ర ప్రభావం పడుతుంది.
మీకు ఇల్లంతా అన్ని roomsలో మెరుగ్గా WiFi signal రావాలంటే ఇంటి మధ్యలో తగిన ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ routerని అమర్చుకోవలసి ఉంటుంది. ఒకవేళ మీరు అన్ని రూమ్స్ వాడకపోతే కేవలం మీరు వాడుతున్న ఒకటి రెండు రూమ్స్‌ని దృష్టిలో ఉంచుకుని వాటి మధ్య wifi signal సక్రమంగా ప్రసరించేలా తగిన ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
అలాగే మందపాటి గోడలు, ఫర్నిచర్, ఇతర అవాంతరాలను దాటుకుని wifi signal రావాలంటే చాలా కష్టమవుతుంది. వీలైనంత వరకూ ఎక్కువ గోడలు అడ్డుకోకుండా ఉండేలా చూడండి. Routerని వీలైనంత ఎత్తయిన ప్రదేశంలో అమర్చండి.
Channelsని మార్చి చూడండి
సహజంగా router అనేది అనేక ఫ్రీక్వెన్సీల్లో పనిచేస్తుంది. అనేక channelsని ఇస్తుంది. డీఫాల్ట్‌గా మన రూటర్లో ఏదో ఒక channel ఎంచుకోబడి ఉంటుంది. ఉదా.కు.. Channel 11 or Channel 6 అనేవి ఎక్కువ వాడబడతాయి. అయితే మీరు ఓ apartment లో నివశిస్తూ మీ చుట్టుపక్కన ఎక్కువమంది జనాభా ఉంటే వారు ఉపయోగించే deviceలు కూడా అదే router channelని వాడుతూ ఉంటే మీ wifi signal drop అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఈ నేపధ్యంలో మీ computer లేదా laptopలో router configuration పేజీలోకి వెళ్లి ప్రస్తుతం వాడబడుతున్న ఛానెల్‌కి బదులుగా వేరే ఛానెల్‌ని ప్రయత్నించండి.
Router firmware upgrade చేయండి
ప్రతీ rounterలోనూ firmware అనే ఓ software లాంటిది flash చెయ్యబడి ఉంటుంది. ఇది మనకు router configuration పేజీలను, రూటర్‌లో మెమరీలో స్టోర్ చెయ్యవలసిన సెట్టింగులను స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. మీరు ప్రస్తుతం వాడుతున్న router మోడల్‌కి ఆ మోడల్‌ని తయారు చేసిన కంపెనీ వెబ్‌సైట్‌లో ఏదైనా తాజా update వచ్చిందేమో గమనించి దాన్ని download చేసుకుని upgrade చేసుకుంటే మీ router పనితీరు, wifi signal strength పెరిగే అవకాశముంది.
WiFi Extender వాడొచ్చు
పై జాగ్రత్తలు తీసుకున్నా ఎలాంటి ఫలితం లేకపోతే Wifi Extender ని వాడాల్సిందే. ఇవి గోడకు నేరుగా plug చేసుకోగలిగే డివైజ్‌ల రూపంలో లభిస్తుంటాయి. వీటిని మొదట routerకి కనెక్ట్ చేసి setup చేశాక వేరే రూమ్‌లో మీకు ఎక్కడైతే signal వీక్‌గా వస్తోందో ఆ ప్రదేశంలో వాడితే.. అది router నుండి సిగ్నల్‌ని సేకరించి దాన్ని తిరిగి strongగా broadcast చేస్తుంది.