విండోస్ 10కి మారకపోతే ఇలా ఉంటుంది మీ పరిస్థితి!!

 

windows-10-upgrade

గత ఏడాది జూలై 29న విండోస్‌ 10 అధికారికంగా విడుదలైంది. Windows 7, Windows 8 వెర్షన్లకి భిన్నంగా ఈ Windows 10ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఉచితంగా విడుదల చేసింది. అంటే ఇప్పటికే Windows XP, Windows 7, 8 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల జెన్యూన్‌ వెర్షన్లని వాడుతున్న యూజర్లు ఒక్క పైసా అదనంగా చెల్లించాల్సిన పనిలేకుండానే Windows 10కి ఉచితంగా అప్‌గ్రేడ్‌ కావొచ్చన్నమాట. అయితే ఈ ఉచిత ఆఫర్‌ కేవలం ఓ ఏడాది మాత్రమే ఉంటుందని మొదట్లోనే మైక్రోసాఫ్ట్‌ సంస్థ స్పష్టంగా తెలియజేసింది. ఆ ప్రకారమే రేపు జూలై 29 వరకూ మాత్రమే ఈ ఉచిత అప్‌గ్రేడ్‌ లభిస్తుంది. అయితే చాలామంది విండోస్‌ 10 ఎలా ఉంటుందో అన్న భయాల వల్లా, ఇతరత్రా కారణాల వల్లా ఆ గడువు లోపు విండోస్‌ 10కి మారడానికి ఇప్పటికీ ఆసక్తి చూపించట్లేదు. ఈ నేపధ్యంలో ఇప్పటికీ మీరు పాత Windows వెర్షన్‌ని వాడుతుంటే మీకు ఎంతకాలం సపోర్ట్‌ లభిస్తుంది, ఇతర వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Windows 10కి మారిపోయి ఉంటే

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

మీరు ఇప్పటికే Windows 10కి మారిపోయి ఉంటే ఎలాంటి ఢోకా లేదు. మైక్రోసాఫ్ట్‌ తెలిపిన వివరాల ప్రకారం Windows 10 చిట్టచివరి వెర్షన్‌. Windows 10 యూజర్లకి ఎప్పటికప్పుడు కొత్త Updates ఆటోమేటిక్‌గా వస్తుంటాయి గానీ ఆ తర్వాత Windows 11 లాంటిది ఏదీ ఉండదు. సో Windows 10ని ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉండడం ద్వారా మీరు నిరంతరం updateగా ఉండొచ్చన్నమాట. రేపు ఆగస్ట్‌ 3న Windows 10 ఏనివర్శరీ వెర్షన్‌ కూడా విడుదల అవబోతోంది. ఇది అందరికీ ఉచితంగా లభిస్తుంది. ఇలా మీరు ఎప్పుడూ సెక్యూర్డ్‌గా ఉంటారు.

Windows 8.1 వాడుతుంటే

మీరు ఇప్పటికీ Windows 10 Free Upgrade వినియోగించుకోపోయినట్లయితే ఇప్పటికీ Windows 8.1నే వాడుతూ ఉన్నట్లయితే జనవరి 2018 వరకూ Windows 8.1కి అన్ని రకాల Updates వస్తుంటాయి. ఆ తర్వాతి నుండి జనవరి 2023 వరకూ కేవలం security updates మాత్రమే అందించబడతాయి. ఇప్పటికీ Windows 8.1 ఇన్‌స్టాల్‌ అయిన లాప్‌టాప్‌లు, బ్రాండెడ్‌ పిసిలు మార్కెట్లో లభిస్తున్నాయి కదా, అయితే ఈ ఏడాది అక్టోబర్‌ 31 తర్వాత Windows 8.1 ఆధారంగా పని చేసే కంప్యూటర్లు, లాప్‌టాప్‌లను ఏ కంపెనీ అమ్మకూడదు.

Windows 8 వాడుతున్నారా?

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/DiKzjROIUPX3u9KKPyaCbg అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

మీరు ఇప్పటికీ Windows 8 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వాడుతున్నట్లయితే అర్జెంటుగా Windows 8.1కైనా వెంటనే upgrade చెయ్యండి. ఈ ఏడాది ప్రారంభంలోనే Windows 8కి సపోర్ట్‌ నిలిపివేయబడింది. అంటే మీరు ఇప్పటికీ విండోస్‌ 8 వాడుతుంటే 2016 ప్రారంభం నుండే సెక్యూరిటీ అప్‌డేట్లు నిలిచిపోయాయి. వెంటనే కనీసం Windows 8.1కైనా అప్‌గ్రేడ్‌ అవండి. అది పూర్తిగా ఉచితంగా లభిస్తుంది.

Windows 7 వాడుతుంటే

Windows 7 వాడుతున్న వారికి ఇప్పటికే ప్రధానమైన సపోర్ట్‌ నిలిచిపోయింది. కేవలం సెక్యూరిటీ అప్‌డేట్స్‌ మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి. ఆ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ కూడా జనవరి 2020 వరకూ మాత్రమే లభిస్తాయి. విండోస్‌ 8.1 మాదిరిగానే అక్టోబర్‌ 2016 నుండి విండోస్‌ 7 ఆధారిత కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు మార్కెట్లో దొరకవు. ఇకపోతే విండోస్‌ XP పూర్తిగా సపోర్ట్‌ ఇప్పటికే నిలిచిపోయింది. Vistaకి ఏప్రిల్‌ 2017లో సపోర్ట్‌ నిలిచిపోతుంది.

Computer Era
Logo