

Mobile recharge మొదలుకొని, అనేక రకాల బిల్లుల చెల్లింపులు, Amazon, Flipkart వంటి సైట్లలో ఏమైనా వస్తువులు కొనుగోలు చేయడానికి internet banking చాలామంది వాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు పేమెంట్ పేజీకి వెళ్లిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు కట్ అయి, వెనక్కి రీ డైరెక్షన్ జరిగే సమయంలో మర్చంట్ పేజ్‌కి రాక మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది.
ఎందుకిలా?
దీనికి ప్రధానంగా రెండు అంశాలు కారణమవుతాయి. మీ ఇంటర్నెట్ కనెక్షన్ సక్రమంగా లేనప్పుడు మధ్యలో కనెక్టివిటీ పోతే పేమెంట్ గేట్‌వే నుండి మర్చంట్ సైట్‌కి రావలసిన success code రాకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పోతుంది, కానీ మీ ఆర్డర్ మాత్రం కంప్లీట్ కాదు. అందుకే సాధ్యమైనంత వరకూ పేమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు సరైన మొబైల్ సిగ్నల్ ఉండేలా, వీలైతే మంచి స్పీడ్ గలిగిన broadband కనెక్షన్ ద్వారా పేమెంట్ చేసేలా జాగ్రత్త వహించండి.
మరికొన్ని సందర్భాలలో CCAvenue, BillDesk వంటి వివిధ పేమెంట్ గేట్‌వేలపై లోడ్ ఎక్కువ ఉండటం వలన, వాటిలో సాంకేతిక సమస్యలు ఉండటంవల్ల అకౌంట్లో డబ్బులు కట్ అయిన తర్వాత లావాదేవీ పూర్తి కాదు. అలాంటప్పుడు సంబంధిత పేమెంట్ గేట్‌వే mail IDని దాని అధికారిక వెబ్సైట్లో వెతికి పట్టుకొని, దాని కస్టమర్ కేర్ అధికారిక మెయిల్ ఐడీకి మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావా దేవి కి సంబంధించిన స్క్రీన్ షాట్, రిఫరెన్స్ నెంబర్ జమ చేసి మెయిల్ పెట్టండి. ఇలా చేయకపోయినా కూడా 24 గంటల లోపల మీ లావాదేవీ పూర్తి కావటం గానీ, లేదా మీ డబ్బులు వెనక్కి రావటం గానీ జరుగుతుంది. అందుకే ఈ లోపు మళ్లీ మళ్లీ పేమెంట్ చేయడం సరైన పద్ధతి కాదు.
సహజంగా ఒక ఆర్థిక పరమైన లావాదేవీ జరిగేటప్పుడు.. మీరు చెల్లించే డబ్బులు మీ అకౌంట్ నుండి డెబిట్ అయిన తర్వాత కచ్చితంగా మర్చంట్ కి చేరాల్సి ఉంటుంది. ఈ విషయంలో పేమెంట్ గేట్‌వే కీలక పాత్ర వహిస్తుంది. పేమెంట్ గేట్‌వే మరియు బ్యాంక్ ప్రతిరోజూ జరిగిన లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడైనా బ్యాలెన్స్ విషయంలో తప్పులు చోటుచేసుకున్నట్లు అయితే వాటిని మన ప్రమేయం లేకుండానే సరిచేస్తాయి. దీనికి నాలుగు రోజుల నుండి వారం రోజుల వరకు కొన్నిసార్లు సమయం పడుతుంది.