Internet మానవ హక్కు కాదు – భారత్ వ్యతిరేకత

Internet వినియోగాన్ని కూడా మానవ హక్కు‌గా పరిగణించేలా United Nations ప్రతిపాదనని భారత్ వ్యతిరేకించింది.  భారత్‌తో పాటు చైనా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలు ఈ ప్రతిపాదనని నిర్థంద్వంగా  వ్యతిరేకించాయి. ముఖ్యంగా ఆ ప్రతిపాదనలోని ఓ పేరాకి ఆయా దేశాలు నో చెప్పాయి. ఆ పేరాలోని సారాంశం ఇది..  “measures to intentionally prevent or disrupt access to or dissemination of information online.” అంటే ప్రజలు ఆన్‌లైన్ ద్వారా ఉద్దేశపూర్వకంగా సమాచారం పొందే అవకాశాన్ని అడ్డుకోవడం అంతర్జాతీయంగా మానవ హక్కులను హరించడం క్రిందికే వస్తుంది.

భారత్‌తో సహా చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇలా వ్యతిరేకత తెలపడం వెనుక ప్రధాన ఉద్దేశం ఇప్పటికే ఆయా దేశాలు అనేక కారణాలతో ప్రజలు internetని వినియోగించుకునే హక్కుని హరిస్తున్నాయి. United Nations ఈ తాజా ప్రతిపాద అభివృద్ధి చెందినా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్యా, పురుషులు, స్త్రీలకు మధ్యా digitalగా ఉన్న వ్యత్యాసాలను ఎత్తి చూపిస్తూ వాటిని సరిచెయ్యవలసిన బాధ్యతని గుర్తు చేసేలా ఉంది.

Indiaలో నెట్ పలుమార్లు పలు రకాలుగా ban చెయ్యబడింది. కేవలం సెప్టెంబర్ 2015 నుండి ఇప్పటి వరకూ కాలాన్నే ప్రమాణంగా తీసుకుంటే.. ఇప్పటి వరకూ 15 సార్లు పూర్తిగా గానీ పాక్షికంగా గానీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెట్ సర్వీసులు నిషేధించబడ్డాయి. భారతీయ శిక్షాస్మృతిలోని Section 144 ప్రకారం చట్టపరంగా mobile internetని బ్యాన్ చేసే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది.

 

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

 

Computer Era
Logo
Enable registration in settings - general