iPhone 7 మరింత చవకగా కొనొచ్చు..

iphone-7

“అదేంటి Apple ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుంది కదా.. చవకగా కొనడం ఏంటి” అనుకుంటున్నారా? మీరు వింటున్నది నిజమే! Apple సంస్థ iPhone 6Sతో పోలిస్తే 100 డాలర్లు తక్కువ ధరకు iPhone 7 ధరని నిర్ణయించబోతోందని తెలుస్తోంది. iPhone 7లో కొత్తగా చెప్పుకోదగిన గొప్ప అంశాలు ఏమీ ఉండబోవట్లేదని రెండు రోజుల క్రితం ఈ లింకులో నేను రాసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఇవే కారణాల వల్ల iPhone 7 అమ్మకాలపై Apple చాలా భయాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో iPhone 7ని ఇంతకుముందు iPhone 6S మోడల్ కన్నా 100 డాలర్లు అంటే సుమారు రూ. 6,700 తక్కువ ధరకి అమ్మాలని నిర్ణయించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న Apple అభిమానులు అస్సలు ఏమాత్రం iPhone 7పై ఆసక్తి కనబరచడం లేదని Appleకి ఈపాటికే అర్థమైంది. ఇదే ఈ తాజా నిర్ణయం వెనుక ప్రధాన కారణం. Apple చరిత్రలో ఓ కొత్త modelకి ధర తగ్గించబోవడం ఇదే ప్రధమం.  ఏదో విధంగా అమ్మకాలను పెంచుకునేందుకు Apple వేస్తున్న ఎత్తుగడగా దీన్ని భావించవచ్చు.

Apple iPhone 7లో మునుపటి మోడళ్లలో మాదిరిగా 16 GB వెర్షన్ ఉండదు. 32 GB base model నుండే iPhone 7 లభించబోతోంది. సుమారు 649 డాలర్లకి అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 43 వేలకి iPhone 7 లభించే అవకాశముంది. ఈ ధరకి 32 GB మోడల్ అంటే Apple ఇంతకు ముందు ఆ 32 GB మోడళ్లకి పెట్టిన ధరతో పోలిస్తే చాలా చవక బేరమే. ఇకపోతే iPhone 7 Plusతో dual camera వంటి కొన్ని అదనపు సదుపాయాలు అదనపు ధరతో లభించబోతున్నాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

 

Computer Era
Logo
Enable registration in settings - general