LG కొత్త ఫోన్ డిజైన్ ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఉంది..

LG smartphone new design concept

Smartphone తయారీ విధానంలో ఎప్పటికప్పుడు అనేక కొత్త పోకడలు కొనసాగుతూనే ఉంటాయి. ఫోన్ డిజైన్ పరంగా గత కొన్నేళ్లుగా మనం అనేక రకాల మార్పులు చూశాం. ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నా, LG సంస్థ మాత్రం తన ఇన్నోవేషన్ ఆపలేదు. కొత్తగా రాము తీసుకురాబోతున్న సంబంధించి ఆకర్షణీయమైన డిజైన్ అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఫోన్ వెనకభాగం తో కూడిన ఒక ఇమేజ్ విడుదల చేసింది. దాన్ని గనక నిశితంగా పరిశీలిస్తే ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఇతర ఫోన్ లకు భిన్నంగా ఇది కనిపిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఎడమచేతివైపు ఒకదాని కింద మరొకటి మూడు కెమెరాలు ఉంటాయి. వీటిలో ప్రైమరీ కెమెరా కొద్దిగా పెద్దగా ఉన్నప్పటికీ, మిగిలిన రెండు కెమెరాలు ఫోన్ వెనుక భాగంలో ఉండే గ్లాస్ లోపలే అంతర్భాగంగా అమర్చబడి ఉంటాయి. ఇలా రెండు కెమెరాలను గ్లాస్ లోపలే అమర్చటం వల్ల ఫోన్ వెనుక భాగంలో ఎక్కువ ఖాళీ స్థలం కనిపిస్తుంది.

దీంతోపాటు 3D Arc Design అనే ఒక ప్రత్యేకమైన డిజైనింగ్ కాన్సెప్ట్‌ని LG ప్రవేశపెడుతోంది. దీనిలో భాగంగా ఫోన్ ముందు మరియు వెనుక భాగాల్లో అంచులు వంపుగా డిజైన్ చేయబడ్డాయి. దీంతో ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు తగినంత గ్రిప్ లభిస్తుంది. అంతేకాదు చూడటానికి కూడా ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. LG అతి త్వరలో విడుదల చేయబోయే ఫ్లాగ్ షిప్ ఫోన్లో ఈ సరికొత్త డిజైనింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

దక్షిణ కొరియాకు చెందిన LG మరియు Samsung మొదటి నుండి ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీలో ఎప్పటికప్పుడు అనేక పరిశోధనలు చేస్తూ ఒక దానితో మరొకటి పోటాపోటీగా ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇండియా వంటి మార్కెట్లలో సాంసంగ్ తో పోలిస్తే LG పెద్దగా నిలదొక్కుకోలేక పోయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా సంస్థకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా ఏళ్లుగా ఈ రెండు సంస్థలు ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగ్గజాలుగా కొనసాగుతున్నాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo