
ఇంటి సెక్యూరిటీ కోసం చాలామంది CC Cameraలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వీటికి కనీసం కంట్రోల్ బాక్స్ తో కలిపి 30 నుంచి 50 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టాల్సిన లేకుండా తక్కువ ధరలో మరిన్ని మెరుగైన సదుపాయాలు కలిగి ఉన్నాయి Mi Home Security Camera 360ని చాలా మంది ఇప్పటికే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో దీని పనితీరు, ఇతర ఫీచర్స్ గురించి చూద్దాం. ఈ కెమెరా https://amzn.to/3lbO4cN లింక్‌లో లభిస్తోంది.
డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ
ఇది చూడటానికి ఒక బొమ్మ లాగా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. అవసరాన్ని బట్టి కెమెరా తన యాంగిల్ మార్చుకునే విధంగా దీన్ని రూపొందించారు. కెమెరా లెన్స్ కింద microSD slot అమర్చబడి ఉంటుంది. అలాగే కెమెరా వెనక భాగంలో గుండ్రంగా ఉండే స్పీకర్ గ్రిల్ లభిస్తుంది. Reset, Micro USB portలు కెమెరా వెనక భాగంలో లభిస్తాయి. పాలికార్బోనేట్‌తో రూపొందించబడిన డివైజ్ ఇది. అందువల్ల సుదీర్ఘకాలంపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. కేవలం 239 గ్రాముల బరువు మాత్రమే ఇది ఉంటుంది. షాక్ ప్రూఫ్ అవటం వలన పొరపాటున కింద పడినా కూడా పెద్దగా ప్రమాదం ఉండదు. ఏ మాత్రం శబ్దం చేయకుండా కెమెరా దానంతట అదే మూవ్ అవుతూ ఉంటుంది.
ఇన్‌స్టలేషన్, సెటప్ ఇలా!
దీన్ని ఎక్కడైనా సులభంగా అమర్చగలిగే విధంగా స్కూలను కూడా ఇచ్చారు. వాస్తవానికి టేబుల్ మీద, ఇతర ప్రదేశాల్లో కూడా స్క్రూలతో పనిలేకుండా నేరుగా అమర్చుకోవచ్చు. మొట్టమొదట కెమెరాను పవర్ కి కనెక్ట్ చేయాలి. కెమెరాతో పాటు 5 వాట్స్ అడాప్టర్ వస్తుంది. ఆ వెంటనే లెడ్ ఇండికేటర్ వెలుగుతుంది. ఆ కెమెరా నుండి వచ్చే లైవ్ వీడియో ఫీడ్ చూడడం కోసం Xiaomi Home Appని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. iOSకి కూడా ఇది లభిస్తుంది. వినియోగదారులు తమ వైఫై క్రెడెన్షియల్స్ ఈ అప్లికేషన్ లో ఎంటర్ చేయాలి. డివైజ్ పెయిర్ అయిన తర్వాత Mi Home అప్లికేషన్లో QR Code చూపించబడుతుంది. దానిని కెమెరా ద్వారా స్కాన్ చేయాలి. ఇదంతా కూడా చాలా సులభంగా పూర్తయ్యే ప్రక్రియ.
మిగతా 2వ పేజీలో..