Mi Home Security Camera 360 ఎందుకు బెస్ట్ కెమెరా అంటే.. – డీటైల్డ్ రివ్యూ!

నాణ్యత మరియు ఇతర సదుపాయాలు

Mi Home Security Camera 360°లో 2 మెగా పిక్సెల్ రెజల్యూషన్ కలిగిన కెమెరా ఉంటుంది. అయినప్పటికీ దానిద్వారా క్యాప్చర్ చేయబడిన వీడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. తగినంత లైటింగ్ ఉన్నప్పుడు రికార్డ్ చేయబడిన వీడియో లో రంగులు సహజ సిద్ధంగా ఉంటాయి. వీడియో షార్ప్‌నెస్ కూడా మెరుగ్గా ఉంది. WDR అనే సదుపాయాన్ని ఎనేబుల్ చేయడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఇది 360 డిగ్రీల కోణంలో అడ్డంగానూ, 90 డిగ్రీల కోణంలో నిలువుగానూ పనిచేస్తుంది. అంటే దాదాపు అన్ని కోణాల్లో కదలికలను రికార్డు చేయగలుగుతుంది.

చీకట్లో కూడా!

కేవలం వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే కాదు Mi Home Security Camera 360° ద్వారా చీకట్లో కూడా వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. 940nm IR LEDs దీంట్లో ఎనిమిది అమర్చబడ్డాయి. చిమ్మచీకట్లో కూడా వీడియో రికార్డు చేయటానికి ఇవి ఉపయోగపడతాయి. అలా చీకట్లో రికార్డ్ చేసిన వీడియో డీటెయిల్ కూడా మెల్లగా ఉంటుంది. అవసరాన్ని బట్టి డే మోడ్, నైట్ మోడ్ ఆప్షన్లకి మధ్య ఈ అప్లికేషన్ మారుతూ ఉంటుంది. అలాగే 24 గంటలు రికార్డ్ చేయాలా, 12 గంటలు మాత్రమే నిఘా పెట్టాలా, కేవలం రాత్రి సమయం మాత్రమే రికార్డు చేయాలా వంటి సెట్టింగ్స్ మీ అవసరాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. రికార్డు చేయబడిన ఫుటేజ్ అంతా మెమరీ కార్డు లో సేవ్ అవుతుంది.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే మోషన్ డిటెక్షన్ సదుపాయం అద్భుతంగా పనిచేస్తుంది. చివరకు దానికి సమీపంగా కదలాడే ఒక చిన్న బొద్దింక వంటివి కదిలినప్పుడు కూడా ఈ కెమెరా గుర్తిస్తుంది. ఈ కెమెరా లో అన్నిటికంటే గొప్ప సదుపాయం.. దీంట్లో అందించబడిన Talk Back అనే ఫీచర్ ద్వారా, మీరు ఆఫీసు నుండి ఇంట్లో అమర్చబడిన కెమెరా ద్వారా ఇంట్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడవచ్చు. వీడియోలను Full HD క్వాలిటీలో రికార్డు చేసుకోవచ్చు. గరిష్టంగా 64GB కెపాసిటీ కలిగిన మెమరీ కార్డు సపోర్ట్ చేస్తుంది.

తక్కువ ధరలో అద్భుతమైన సదుపాయాలు కలిగిన సెక్యూరిటీ కెమెరాగా దీన్ని భావించవచ్చు, ముఖ్యంగా ఎవరి సహాయం లేకుండా దీనిని సులభంగా వాడుకోవచ్చు. 2,899 రూపాయలు అసలు ధర కలిగిన ఈ కెమెరా ప్రస్తుతం కేవలం2,599కే https://amzn.to/3lbO4cN లింక్‌లో లభిస్తోంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
      Computer Era
      Logo