Mi Watch Revolve డీటైల్డ్ రివ్యూ.. దీంట్లో ప్రత్యేకతలేంటి?

Mi Watch Revolve detailed review

Xiaomi సంస్థ నుండి మొట్టమొదటి smart watchగా వచ్చిన Mi Watch Revolve రూ. 10,999 రూపాయలకి Amazonలో ఇక్కడ లభిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.

డిజైన్

Mi Watch Revolveలో 46 అంగుళాల స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ ఉపయోగించబడింది. దీన్ని చేతి ధరించినప్పుడు ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వాచ్ ఆపరేట్ చేయడానికి సంబంధించిన బటన్స్ వాచ్ పక్కన లభిస్తాయి. కేవలం 40 గ్రాములు మాత్రమే బరువు ఉండటం వల్ల ఎక్కువ సమయం పాటు ధరించినా కూడా ఎలాంటి ఇబ్బంది అనిపించదు. 1.39 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే దీంట్లో అందించబడింది. ఇది 454×454 పిక్సెల్ రెజల్యూషన్ కలిగి ఉంటుంది. వాచ్ స్క్రీన్ పెద్దగా ఉండటం మాత్రమే కాదు, చూడడానికి చాలా షార్ప్ గా ఉంటుంది. అలాగే వాచ్‌లో రంగులు సహజ సిద్ధంగా ఉండటంతో పాటు, అక్షరాలు స్పష్టంగా కనిపించేటంత బ్రైట్నెస్ లభిస్తుంది.

Mi Watch Revolve detailed review

అలాగే టచ్ రెస్పాన్సివ్‌నెస్ కూడా మెరుగ్గా ఉంది. Mi Watch Revolve వెనుక భాగంలో హార్ట్ రేట్ సెన్సార్, గైరోస్కోప్, acceleration sensor, జియో మ్యాగ్నెటిక్ సెన్సార్, నైట్ సెన్సార్ పొందుపరచబడి ఉంటాయి. అంతర్గతంగా జిపిఎస్, బ్లూటూత్ 5 LE టెక్నాలజీ అందించబడ్డాయి. 420 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఆధారంగా ఈ వాచ్ పనిచేస్తుంది. 50 మీటర్ల లోతు వరకు వాటర్ రెసిస్టెన్స్ ఇది కలిగి ఉంటుంది.

స్పోర్ట్స్ మోడ్స్

Mi Watch Revolveలో మొత్తం పది విభిన్న రకాల స్పోర్ట్స్ మోడ్స్ లభిస్తున్నాయి. దాంతోపాటు స్టెప్ కౌంటింగ్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ మోనిటర్, ఎనర్జీ మోనిటర్, VO2 Max, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వంటి ఇతర సదుపాయాలు కూడా లభిస్తాయి. నేరుగా వాచ్ ద్వారా మ్యూజిక్ కంట్రోల్ చేసుకునే సదుపాయం, అలారమ్, స్టాప్ వాచ్, టైమర్ వాతావరణ వివరాలు వంటి సదుపాయాలు కూడా ఇది కలిగి ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ కి వివిధ అప్లికేషన్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కూడా వాచ్ మీద చూడొచ్చు. మీ వాచ్ ఆకారాన్ని నచ్చిన విధంగా మార్చుకోవడం కోసం భారీ మొత్తంలో వాచ్ ఫేసెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు వాచ్ కొత్తగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటన్నిటిని నియంత్రించుకోవడానికి Android, iOS ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేసే Xiaomi Wear అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇప్పటి వరకు మీరు చేసిన యాక్టివిటీ హిస్టరీ మొత్తం చూడొచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

బ్యాటరీ లైఫ్

Mi Watch Revolve అత్యంత ఆకర్షణీయమైన అంశం, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 14 రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ లభించటం! అయితే మీ వినియోగాన్ని బట్టి కొంత తక్కువ బ్యాటరీ బ్యాకప్ లభించవచ్చు. 0 నుండి 100% చార్జింగ్ అవటానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. 10,999 రూపాయల దళంలో కచ్చితంగా మెరుగైన స్మార్ట్ వాచ్‌గా Mi Watch Revolveని పరిగణించవచ్చు. Mi Watch Revolve రూ. 10,999 రూపాయలకి Amazonలో ఇక్కడ లభిస్తోంది.

Computer Era
Logo
Enable registration in settings - general