Nokia కొత్తగా విడుదల చేసిన 65 అంగుళాల 4K టివి వివరాలివి!

Nokia 64 inch 4K Android TV

Nokia సంస్థ తాజాగా భారతీయ మార్కెట్లో 65 అంగుళాల పరిమాణం కలిగిన 4K రిసల్యూషన్ కలిగివుండే smart TVని విడుదల చేసింది.

ఇప్పటికే ఈ సంస్థ భారతీయ మార్కెట్లో 55 మరియు 43 అంగుళాల పరిమాణం కలిగిన రెండు టీవీలు విక్రయిస్తోంది. Android TV ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ సంస్థ విడుదల చేసిన టీవీలు పనిచేస్తాయి. డాల్బీ విజన్ సదుపాయం కలిగిన ఈ సరికొత్త 65 అంగుళాల టీవీలో JBL స్పీకర్లు పొందుపరచబడి వుంటాయి. 3840×2160 పిక్సెళ్ల రిజల్యూషన్ కలిగి ఉండటంతోపాటు హెచ్ డి ఆర్ సపోర్ట్ దీంట్లో ఉంటుంది. గరిష్టంగా 480 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది.

కనెక్టివిటీ విషయానికొస్తే ఈ అరవై ఐదు అంగుళాల టీవీలో మూడు హెచ్డిఎమ్ఐ పోర్టులు, 2 యు ఎస్ బి పోర్టులు ఉంటాయి. 2.4GHz ఫ్రీక్వెన్సీ ని సపోర్ట్ చేసే వైఫై సదుపాయం ఉంటుంది. అలాగే ఆప్టికల్ పోర్ట్ కూడా దీంట్లో అందించబడింది. 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. ఈ TVలో అంతర్గతంగా క్వాడ్ కోర్ ప్రాసెసర్ నిక్షిప్తం చేయబడింది. 2.25 GB RAM, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ దీంట్లో లభిస్తాయి. బ్లూటూత్ 5.0 సపోర్టు ఇది కలిగి ఉంటుంది.

ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన పనిలేకుండా దీంట్లో అంతర్గతంగా Google Chromecast ఉంటుంది. Netflix, Disney+Hotstar, Amazon Prime Videos వంటి వివిధ రకాల ఓటీటీ సర్వీసులను ఇది సపోర్ట్ చేస్తుంది. అంతే కాదు గూగుల్ ప్లే స్టోర్ నుండి భారీ మొత్తంలో అప్లికేషన్స్ ఈ టివిలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 24W సామర్ధ్యం కలిగిన స్పీకర్లు దీంట్లో ఉంటాయి. 64,999 రూపాయలకు ఈ 65 అంగుళాల 4K టివి లభిస్తుంది. ఆగస్ట్ ఆరో తేదీ నుండి దీని అమ్మకాలు మొదలవుతాయి. Flipkart ద్వారా ఈ మోడల్ కొనుగోలు చేయొచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
Computer Era
Logo