ఇక మీ Facebook posts 44 భాషల్లో translate అవుతాయి

అవును ఇకపై మీరు రాసే Facebook posts ఏకంగా 44 world languages లోకి translate అవుతాయి. ఈ మార్పుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న Facebook యూజర్లు తమ updates తాము ఎంచుకున్న ఏ భాషలోకి అయినా translate చెయ్యబడే option పొందగలుగుతారు. ప్రస్తుతం ఈ సదుపాయం పరిమిత సంఖ్యలోని Facebook usersకి మాత్రమే అందుబాటులో ఉంటూ ప్రయోగదశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Facebook లెక్కల ప్రకారం 1.5 billion యూజర్లు worldwideగా ఫేస్‌బుక్‌ని వాడుతున్నారు. వారిలో కేవలం సగం మందికి మాత్రమే English వచ్చు. మిగతా వారు తమ స్థానిక భాషల్లో రాసిన వాటిని ప్రపంచానికి తెలియజేయాలన్నా.. లేదా ఇంగ్లీషులో రాసిన వారు వివిధ స్థానిక భాషల్లో తాము రాసిన informationని ఇతరులకు చూపించాలన్నా ఇప్పటివరకూ కష్టం అవుతుండేది. ఇప్పుడు Facebook అందుబాటులోకి తీసుకు వస్తున్న Multilingual composer వల్ల ఈ అసౌకర్యం తొలగిపోనుంది.

ఇప్పటికే business organizations, celebrities ఈ సదుపాయాన్ని Facebook Pages ద్వారా వాడుతూ వచ్చే వారు. Machine translation చాలా క్లిష్టతరమైనది. కానీ గతంలో పోలిస్తే ఇది మెరుగుపడుతూ వస్తోంది. ప్రస్తుతం Facebook translate చేస్తున్న 44 ప్రపంచ భాషలు భాషా గణాంకాలు (language statistics) ఆధారంగా.. ఏ పదం తర్వాత ఏ పదం సహజసిద్ధమైన భాషలో చోటు చేసుకునే అవకాశం ఉందన్న అంశాన్ని బట్టి translate చెయ్యగలుగుతుంది.

ఇటీవలి కాలంలో photos లోని face recognition, మనం మాట్లాడిన పదాలను గుర్తించడం వంటి ప్రక్రియల్లో deep neural networks కూడా కీలక భూమిక పోషిస్తున్నాయి. ఈ టెక్నాలజీలు మరింత మెరుగు పడే కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల మధ్య భాషాపరమైన అవరోధాలు తొలగిపోయే అవకాశముంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

We will be happy to hear your thoughts

Leave a reply

Computer Era
Logo
Enable registration in settings - general