OnePlus 8, OnePlus 8 Pro వచ్చేవారం రాబోతున్నాయి.. పూర్తి వివరాలు ఇక్కడ!

oneplus 8 pro specifications

OnePlus ఫోన్లకు సుదీర్ఘకాలంగా ఆదరణ ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఏప్రిల్ 14 వ తేదీన లేటెస్ట్ ఫోన్స్ విడుదల చేసే సన్నాహాల్లో చేస్తోంది.

OnePlus 8, OnePlus 8 Pro అనే రెండు మోడల్స్ గా ఈ ఫోన్స్ లభిస్తాయి. వాటికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ తాజాగా లీక్ అయ్యాయి. మొదట్లో అందరికి అందుబాటు ధరలో ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా OnePlus సంస్థ తాను తయారు చేసే ఫోన్ల ధరలను క్రమేపీ పెంచుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం OnePlus 8 బేస్ మోడల్ అయిన 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ సుమారు 60 వేల రూపాయలకు లభిస్తుంది. 12GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ 68 వేల రూపాయలకు లభించే అవకాశం ఉంది.

మరోవైపు OnePlus 8 Pro ఫోన్ 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ 75 వేల రూపాయలకు, 12 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ 83 వేల రూపాయలకు లభించవచ్చు. మిగిలిన స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే 6.55 అంగుళాల Full HD+ అమోల్డ్ డిస్ప్లే కలిగి ఉండి, 90Hz రిఫ్రెష్ రేట్‌ని OnePlus 8 ఫోన్ కలిగి ఉంటుంది. 402 ppi పిక్సల్ డెన్సిటీ ఈ ఫోన్ ద్వారా అందించబడుతుంది. మరోవైపు Oneplus 8 pro విషయానికొస్తే, 6.78 అంగుళాల QHD+ డిస్ ప్లే తో పాటు, 120 Hz రిఫ్రెష్ రేట్‌ని ఇది అందిస్తుంది. 513 ppi పిక్సల్ డెన్సిటీ దీని ద్వారా లభిస్తుంది.

కెమెరా పరంగా చూస్తే ఫోన్ వెనుక భాగంలో 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా పాటు, 16 మెగా పిక్సల్, 2 మెగా పిక్సల్ కలిగిన మరో రెండు కెమెరాలు ఉంటాయి. OnePlus 8 Proలో మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి. త్రీడీ ఆడియో జూమ్ అనే టెక్నాలజీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం, WiFi 6, NFC, బ్లూటూత్ 5.1, usb type c కనెక్టివిటీ వంటి ఇతర సదుపాయాలు ఈ ఫోన్లలో ఉంటాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general