
ఈ మధ్యకాలంలో Wireless earbuds వినియోగం బాగా పెరిగింది. Smartphone తయారీలో పేరెన్నికగన్న సంస్థ OnePlus కూడా ఇయిర్ బర్డ్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. Amazonలో రూ. 2,999కి ఈ లింక్‌లో వీటిని కొనుగోలు చేయొచ్చు.
డిజైన్
OnePlus Budsలో ఇయర్ టిప్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం జరిగింది. అవి చెవిలో మెరుగ్గా అమరడమే కాకుండా, పాసివ్ నాయిస్ ఐసోలేషన్ సమర్థవంతంగా చేయగలుగుతున్నాయి. ఇవి పూర్తిగా ప్లాస్టిక్తో తయారు చేయబడి గ్లాస్ మాదిరిగా కనిపించే కోటింగ్ వేయబడి ఉంటాయి. ఒక్కొక్కటి కేవలం ఐదు గ్రాముల బరువు మాత్రమే ఉండటం వల్ల ఎక్కువసేపు ధరించినా కూడా చెవుల పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అయితే ఒకే ఒక అసౌకర్యం ఏంటంటే ఇయర్ పీసెస్ స్వల్పంగా బయటకు వచ్చినట్లు ఉంటాయి. ఇయర్ బడ్స్ మాదిరిగానే కేస్ కూడా ప్లాస్టిక్ తో రూపొందించబడి ఉంటుంది. ఛార్జింగ్ కోసం usb type c port దానిమీద కల్పించబడి ఉంటుంది.