

బ్యాంకింగ్ వ్యవస్థను దాటిపోయి దేశంలో అతి కీలక పాత్ర పోషిస్తాయని ఆశపడిన Payments Bankలు ఇప్పుడు దాదాపు చతికిలబడ్డాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో అనేక సంస్థలకు పేమెంట్ బ్యాంక్ హోదా అందించినప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అవి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. దేశంలో బ్యాంకు ఖాతాలు లేని వారికి, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఎంతోకొంత బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆగస్టు 2015 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11 సంస్థలకు Payments Bank లైసెన్సులు ఇచ్చింది.
టెక్ మహీంద్రా, చోళమండలం ఫైనాన్స్, IDFC-Telenor సంస్థలు తమకు వచ్చిన లైసెన్స్ ఆసక్తి లేక వదులుకున్నాయి. Paytm, Fino, Idea, Airtel వంటి సంస్థలు మొత్తానికి కార్యకలాపాలు మొదలు పెట్టాయి. అలాగే రాబోయే కొద్ది రోజుల్లో India Post పేమెంట్ బ్యాంకు కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇదంతా ఒక ఎత్తయితే పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు అయితే మొదలుపెట్టగానే పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు.
గత ఏడాది వినియోగదారుల్ని దొడ్డిదారిన పెంచుకునే ప్రయత్నంలో భాగంగా తమ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో లింకు చేసుకోవడం కోసం వచ్చిన వినియోగదారుల చేత వారికి తెలియకుండానే రహస్యంగా Airtel సంస్థ Airtel Payments Bank ఖాతాలను ఓపెన్ చేయించింది. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు చెందిన దాదాపు 390 కోట్ల గ్యాస్ సబ్సిడీ Airtel Payments Bank ఖాతాల్లోకి జమచేయబడింది కూడా! అప్పట్లో అటు పార్లమెంట్ లో ఉన్న ఈ విషయంపై చాలా గొడవ జరిగింది. డాక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాలను ఉల్లంఘించినందుకు గాను కొత్త కస్టమర్లకు KYC చేసే ప్రక్రియను Airtel Payments Bankకి చాలాకాలంపాటు నిలిపివేసింది.