Paytmలో ఇప్పుడు మీ డబ్బులు fixed deposit కూడా చేసుకోవచ్చు!

paytm fixed deposits

కొన్నేళ్ల క్రితం కేవలం mobile rechargeల కోసం మొదలైన Paytm సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటీవల పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎంత ప్రాధాన్యతని సంతరించుకుందో తెలిసిందే.

ఇటీవలే Payments Bank హోదాని కూడా ఈ సంస్థ సంపాదించడం జరిగింది. దాదాపు ఓ మామూలు బ్యాంకు స్థాయి సదుపాయాలు ఈ payment bank ద్వారా అందించే అవకాశం ఉన్న నేపధ్యంలో తాజాగా వినియోగదారులు fixed depositలను కూడా మొదలు పెట్టుకోవడానికి Paytm వీలు కల్పిస్తోంది.

Paytm Payments Bankలో ఖాతాని కలిగి ఉండి.. అందులో లక్ష రూపాయలకు మించిన నగదు కలిగిన వారు ఎవరైనా Paytmలో ఇప్పుడు fixed depositలను చేసుకోవచ్చు.  సంవత్సరానికి 6.85 శాతం వడ్డీని ఈ బ్యాంక్ ఇవ్వబోతోంది.  Fixed deposit గడువు తీరే లోపు ఖాతాదారులు సీనియర్ సిటిజన్లుగా మారితే వారి ఖాతాలు ఆటోమేటిక్‌గా మరింత ఎక్కువ వడ్డీ వచ్చే విధంగా సీనియర్ సిటిజన్స్ స్కీమ్‌లోకి మార్చబడతాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

అలాగే fixed deposit ఎప్పుడు వద్దనుకున్నా ఎలాంటి నగదు నష్టపోవలసిన పనిలేకుండానే తమ డిపాజిట్ నగదుని వెనక్కి తీసుకోవచ్చు. IndusInd Bank సహకారంతో Paytm ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general