Phone పక్కన నొక్కగలిగేలా Xiaomi కొత్త phone వస్తోంది!

xiaomi edge controls phone

ఒక smartphone డిజైన్‌లో ఎన్ని కొత్త మార్పులు సాధ్యపడితే అన్నింటిని ప్రవేశపెట్టడానికి కంపెనీలు నిరంతరం మార్గాలు అన్వేషిస్తుంటాయి. ఈ క్రమంలో Xiaomi కూడా phone రెండు వైపులా అంచులను నొక్కితే అనేక పనులు సాధ్యపడేలా Edge Controls అనే డిజైన్‌ని తీసుకు వస్తోంది.

ఈ ఏడాది ఆరంభంలో HTC U11లో ఇదే మాదిరిగా Edge Sense పేరుతో squezable frameని ప్రవేశపెట్టడం జరిగింది. వాస్తవానికి Xiaomi సంస్థ ఈ Edge controls గురించి ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే Mi 5 phoneలో Nova Launcher appని వాడుతున్న ఓ యూజర్‌కి activity shortcutsని పరిశీలించే సమయంలో ఈ Edge controls అనే మెనూ దృష్టికి వచ్చింది.

Mi5లో ఈ సదుపాయం లేదు. ఈ నేపధ్యంలో 2018లో రాబోతున్న Mi 7లో ఈ సదుపాయం వచ్చే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. ఇదే గనుక వస్తే phoneలో ప్రస్తుతం ఉన్న back బటన్‌కి బదులు.. ఏ app నుండి అయినా వెనక్కి వెళ్లాలంటే phone అంచులను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

అలాగే photoలను కూడా ఈ అంచులను నొక్కడం ద్వారా కేప్చర్ చేసుకోవచ్చు. Volume, fingerprint sensorలతో సెల్ఫీలు తీసుకోవడానికి కష్టపడాల్సిన పనిలేదు.

Tags:

Computer Era
Logo