
నిన్న భారతీయ మార్కెట్లో Xiaomi సంస్థ Redmi 8A ఫోన్ విడుదల చేసింది. 6,499 రూపాయలకు విక్రయించబడుతున్న ఈ ఫోన్ గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం.
డిజైన్
బడ్జెట్ వినియోగదారుల కోసం రూపొందించబడిన Redmi 8Aలో USB Type-C పోర్ట్, 5000 ఎమ్ఏహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ లభిస్తున్నాయి. డిజైన్ పరంగా చూస్తే ఈ ఫోన్ నిశితంగా చూసినప్పుడు ఇది బడ్జెట్ ఫోన్ అని భావించడం కష్టం. Xiaomi సంస్థ డిజైన్ పరంగా మంచి వర్క్ చేసిందనే చెప్పుకోవాలి. 6.22 అంగుళాల డిస్ప్లేతో, స్క్రీన్ పై భాగంలో waterdrop notchని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇయర్ పీస్ ఫోన్ అంచుల వద్ద మార్చబడింది.