
Xiaomi ఈ సంస్థ తాజాగా భారత మార్కెట్లో తన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ Redmi 9 Powerని విడుదల చేసింది. 10999 రూపాయల ధరకు Amazonలో 22వ తేదీ మధ్యాహ్నం మొట్టమొదటి సేల్ జరగబోతోంది. ఇప్పటికే 10,499 రూపాయలకు లభిస్తున్న Realme Narzo 20కి ఇది ఎంతవరకు పోటీ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.
Redmi 9 Power స్పెసిఫికేషన్స్ పరిశీలిస్తే 6000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ లభిస్తుంది. సరిగ్గా అదే సామర్థ్యం కలిగిన బ్యాటరీ Realme Narzo 20లో కూడా ఉంటుంది. స్క్రీన్ పరిమాణం విషయానికొస్తే Redmi 9 Powerలో 6.53 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంటే, మరోవైపు Realme Narzo 20లో 6.5 అంగుళాల కేవలం హెచ్ డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంది. అంటే పరోక్షంగా స్క్రీన్ రిజల్యూషన్ పరంగా చూస్తే Redmi 9 Power కచ్చితంగా అడ్వాంటేజ్ కలిగి ఉంది.