
ఇటీవల Xiaomi సంస్థ ఇండియాలో Redmi Note 7 Pro ఫోన్ల ధరను శాశ్వతంగా తగ్గించిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం Redmi Note 8 Pro మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రావడం!
అవును.. ఈరోజు భారతీయ మార్కెట్లో 7999 రూపాయల ధరకు Redmi 8 ఫోన్ విడుదల చేసిన తర్వాత Xiaomi సంస్థ మరో కీలక ప్రకటన కూడా చేసింది. అక్టోబర్ 16 వ తేదీన Redmi Note 8 Pro మోడల్ భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. వాస్తవానికి దీపావళి తర్వాత ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయాలని భావించినప్పటికీ దాన్ని కొద్దిగా ముందుకు జరిపినట్లుగా అర్థమవుతోంది.