Samsung Galaxy Note 20 Ultra 5G డీటైల్డ్ రివ్యూ

samsung galaxy note 20 ultra 5G review

ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న Android phoneలలో అత్యంత ఖరీదైనదిగా పేర్కొనబడుతూ అనేక తాజా శక్తివంతమైన సదుపాయాలు కలిగి ఉన్న ఫోన్‌గా Samsung Galaxy Note 20 Ultraని పేర్కొనవచ్చు. భారీగా 108 MP camera కలిగి ఉండి, 5G సదుపాయాన్ని ఇది కలిగి ఉంటుంది. మిగతా అన్ని ఫోన్ల కంటే శాంసంగ్ నోట్ సిరీస్ ఫోన్లు 2011 నుండి ఎక్కువ స్క్రీన్ పరిమాణం కలిగి ఉంటాయి. అదే ఒరవడి కొనసాగిస్తూ Galaxy Note 20 Ultraలో కూడా 6.9 అంగుళాల భారీ స్క్రీన్ ఉపయోగించబడింది. అయితే అంచులు గుండ్రంగా ఉండటం వల్ల phone పట్టుకోవడం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

డిజైన్

208 grams బరువుని ఈ phone కలిగి ఉంటుంది. Phoneని వీలైనంత పలుచగా తయారుచేయటానికి Samsung విశ్వ ప్రయత్నం చేయటం వలన కేవలం 8.1mm మందాన్ని మాత్రమే ఇది కలిగి ఉంటుంది. అయితే phone వెనుక భాగంలో కెమెరాల అమరిక కొద్దిగా ఉబ్బెత్తుగా, ఇబ్బందికరంగా కనిపిస్తుంది. Phone అడ్డంగా పట్టుకున్నప్పుడు కూడా ఈ back cameraల వల్ల phone అసౌకర్యంగా ఉంటుంది. Corning సంస్థ ఇటీవల ప్రకటించిన అత్యంత శక్తివంతమైన screen రక్షణ ఏర్పాటు అయిన.. Gorilla Glass Victusని ఈ phoneలో ఉపయోగించారు. మరోవైపు phone వెనక భాగంలో ఉన్న camera lensలను Gorilla Glass 6 చేత రక్షించటం జరిగింది. Phone కొనుగోలు చేసినప్పుడే అతి పలుచని screen protector అమర్చబడి ఉంటుంది. Phone frame మొత్తం metalతో రూపొందించబడింది. Galaxy Note 20 Ultraకి నీటి నుండి, దుమ్ము నుండి రక్షణ కల్పించడం కోసం IP68 rating కల్పించబడింది. Power, volumn buttonలు ఎడమ చేతి వైపు, SIM tray phone పైభాగంలో, S-PENని phone క్రింది భాగంలో ఎడమ చేతి వైపు అందించారు.

స్పెసిఫికేషన్లు

Samsung Galaxy Note 20 Ultra మనదేశంలో 1,04,999 రూపాయలకు విక్రయించబడుతోంది. దీని ప్రాథమిక model అయిన Galaxy Note 20ని 79,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy S20లో వాడబడిన Exynos 990 processorనే ఈ Note 20 Ultra phoneలో కూడా ఉపయోగించబడింది. దీంట్లో అంతర్గతంగా Mali G77MP11 GPU ఉంటుంది. 12 GB RAM, 256 GB internal storage కలిగిన ఈ phoneలో రెండు మామూలు SIMలు గానీ, ఒక e-SIMని పొందడం ద్వారా అదనంగా memory cardని అమర్చుకోవడం గానీ చేయొచ్చు.

6.9 అంగుళాల dynamic AMOLED screen భారీగా Quad HD+ resolution కలిగి ఉంటుంది. అంటే 1440×3088 pixels resolution లభిస్తుంది అన్నమాట. HDR 10+ supportని కూడా ఈ screen కలిగి ఉంటుంది. ఈ phoneలో మొట్టమొదటిసారిగా varialble refresh rate అనే సదుపాయం కల్పించబడింది. మీరు ఉపయోగించుకునే సమాచారాన్ని బట్టి 120 Hz భారీ refresh rate నుండి 10 Hz refresh rate వరకూ దానంతట అదే మారుతూ phone batteryని పరోక్షంగా ఆదా చేస్తుంది. 4500 mAh capacity కలిగిన batteryతో USB-PD fast charging supportని ఈ phone కలిగి ఉంటుంది. WiFi 6, Bluetooth 5, NFC, MST వంటి ఇతర సదుపాయాలు లభిస్తాయి. Screen లోపలే ultrasonic fingerprint sensor అమర్చబడి ఉంటుంది. మెరుగైన శబ్ద నాణ్యత కోసం stereo speakers లభిస్తాయి. AKG సంస్థకు చెందిన headset phoneతో పాటు అందించబడుతుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

మిగతా 2వ పేజీలో

Computer Era
Logo
Enable registration in settings - general