Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ

డిస్‌ప్లే, పనితీరు..

Galaxy S20 FEలో 4.5 అంగుళాల Full HD+ Super AMOLED display లభిస్తుంది. Time, notification countని చూపించడం కోసం always-on-display సౌకర్యం కూడా ఉంటుంది. గరిష్టంగా 120 Hz refresh rate వరకూ ఈ phone ద్వారా మనం పొందవచ్చు. Battery ఆదా చేయడం కోసం నాలుగు రకాల power saving modes లభిస్తుంటాయి. అవసరాన్ని బట్టి వీటిని enable చేసుకోవచ్చు. Battery బాగా తక్కువగా ఉన్నప్పుడు కేవలం కొన్ని apps మాత్రమే open అయ్యేవిధంగా పరిమితి విధించడంతో పాటు, పూర్తిగా dark mode enable చేయబడుతుంది. Android 10 operating system ఆధారంగా పనిచేసే One UI 2.5 ఈ phoneలో అందించబడింది. అన్నిటికంటే ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సదుపాయం మీ దగ్గర Samsung accountతో link చేయబడిన ఇతర phoneలు ఉంటే, ఇప్పుడు మీరు వాడుతున్న Galaxy S20 FEలోని SIMని ఇతర phoneల నుండి కూడా అదే numberతో calls, sms పంపించుకోవడానికి ఉపయోగించవచ్చు. Phoneతో పాటు కొన్ని అనవసరమైన Samsung apps కూడా install చేయబడి ఉంటాయి. వాటిని వద్దనుకుంటే తొలగించుకోవచ్చు. Samsung Galaxy S20FE పనితీరు విషయానికొస్తే పెద్ద మొత్తంలో apps open చేసి multi-tasking చేసే సందర్భంగా కూడా phone ఏ మాత్రం slow అవదు. మరీ ముఖ్యంగా 120 Hz refresh rate ఉండటం వల్ల menuలు, scrolling కూడా మెరుగ్గా ఉంటుంది. In-display fingerprint sensor, face recognition సదుపాయాలు వేగంగా phoneని unlock చేయగలుగుతున్నాయి.

ఆడియో క్వాలిటీ..

Galaxy S20 FE screen కూడా స్పష్టమైన దృశ్యాలు చూపిస్తుంది. ముఖ్యంగా videoలు చూసేటప్పుడు, games ఆడేటప్పుడు ఖచ్చితంగా ఈ phoneని పూర్తిస్థాయిలో ఆస్వాదించవచ్చు. మరోవైపు audio పరంగా కూడా stereo speakerలు లభిస్తూ ఉండటం వల్ల videoలను చూసేటప్పుడు మంచి అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అయితే కొద్దిగా bass లోపిస్తుంది. అన్ని రకాల శక్తి వంతమైన games ఎలాంటి ఇబ్బంది లేకుండా play అవుతుంటాయి. ఒకసారి charging చేస్తే మామూలు మామూలు అవసరాలకు ఒక రోజుకు సరిపడా battery backup లభిస్తుంది. Charging ద్వారా charging చేసేటప్పుడు 17 నిమిషాలకు 15 శాతం, గంటకు 61 శాతం charging అవుతుంది.

కెమెరా క్వాలిటీ..

Galaxy S20 FE cameraల విషయానికొస్తే phone వెనక భాగంలో 12 MP primary camera, 12 MP ultra wide angle camera, 8 MP telephoto camera లభిస్తాయి. Selfieల కోసం 32 MP camera అందించబడింది. ఈ phoneలో focus వేగంగా lock అవటం చాలా మంచి విషయం. Cameraలు కూడా రంగులను సహజసిద్ధంగా అందిస్తున్నాయి. పగటి సమయంలో తీసిన photoల్లో పూర్తి detail లభిస్తోంది. Camera appలో Single Take modeతో పాటు food mode, pro mode, night mode వంటి విభిన్న రకాల modeలు అందించబడ్డాయి. రాత్రి సమయంలో కొద్దిగా focus విషయంలో ఇబ్బంది అయినప్పటికీ night mode ద్వారా మెరుగైన photoలను పొందవచ్చు. 4K resolution వరకూ videoలను record చేసే సౌకర్యం ఉంటుంది.

కచ్చితంగా 40,998 రూపాయల ధరకి ఈ Samsung Galaxy S20 FE న్యాయం చేకూరుస్తుంది అనడంలో సందేహం లేదు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Samsung Galaxy S20FE (Fan Edition) 8 GB RAM, 128 GB స్టోరేజ్ మోడల్ రూ. 40,998కి – https://amzn.to/2Jk5Mxi

Samsung Galaxy S20FE (Fan Edition) 8 GB RAM, 256 GB స్టోరేజ్ మోడల్ రూ. 44,998కి – https://amzn.to/2WG41xq

Computer Era
Logo
Enable registration in settings - general