

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ ఉన్నట్లయితే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం వాడాల్సిన అవసరం లేకుండా చాలా సులభంగా అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
రెండు రకాలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సదుపాయం అందిస్తోంది. ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా గానీ, లేదా ఒక ప్రత్యేకమైన ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా గానీ మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవచ్చు. దీనికిగాను మొట్టమొదట మీరు ఆ సర్వీసులకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఈ క్రింది ఫార్మెట్ అనుసరించాలి.
REG >Account Number> అనే మెసేజ్ ని 09223488888 అనే నెంబర్ కి పంపించవలసి ఉంటుంది. దీనికి గాను మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వాడాలి. ఒకసారి ఇలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక మీదట చాలా సులభంగా మీ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అదెలాగంటే.. BAL అని మెసేజ్ కంపోజ్ చేసి 09223766666 అనే నెంబర్‌కి ఎస్ఎంఎస్ పంపిస్తే వెంటనే క్షణాల్లో మీ అకౌంట్ బ్యాలెన్స్ తెలిసిపోతుంది.
ఒకవేళ గత ఐదు లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్మెంట్ కావాలనుకుంటే గనుక, MSTMT అనే SMSని 09223866666 అనే నెంబర్ కి పంపించవలసి ఉంటుంది. అలాగే కొత్త చెక్‌బుక్ రిక్వెస్ట్ పంపించడం కోసం CHQREQ అనే ఎస్ఎంఎస్ కంపోజ్ చేసి 09223588888 అనే నెంబర్‌కి మెసేజ్ పంపించాలి. ఒకవేళ గత ఆరు నెలల కాలానికి సంబంధించిన స్టేట్మెంట్ కావాలి అనుకుంటే గనక ESTMT <Account Number> <Code> అనే ఫార్మేట్లో 09223588888 అనే నెంబర్‌కి ఎస్ఎంఎస్ పంపించాలి. ఇక్కడ కూడా అనే విషయంలో చాలా మందికి సందేహం ఉండొచ్చు. వాస్తవానికి ఇలా మెసేజ్ పంపించినప్పుడు, మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికీ పిడిఎఫ్ ఫైల్ రూపంలో గత ఆరు నెలల కాలానికి సంబంధించిన స్టేట్మెంట్ పంపించబడుతుంది. ఆ పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయడం కోసం ఒక పాస్ వర్డ్ కావలసి ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏమిటి అన్నది కోడ్ అనే ప్రదేశం వద్ద మీరు ఎంపిక చేసుకోవాలి. 4 digits తో కూడిన కోడ్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు 1234 వంటి కోడ్ మీరు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తే, మీకు పిడిఎఫ్ వచ్చిన తర్వాత అదే కోడ్ ఉపయోగించి ఆ ఫైల్ ఓపెన్ చేయవలసి ఉంటుంది.