దేశ వ్యాప్తంగా అధికశాతం మంది ఖాతాదారులను కలిగిన జాతీయ బ్యాంక్ SBI ప్రైవేట్ బ్యాంకులతో పోటీ పడడానికి శత విధాలా ప్రయత్నాలు చేస్తోంది.
SBI నుండి shopping discountలతో కూడిన ఓ స్పెషల్ యాప్!
ఆ క్రమంలో తాజాగా YONO (You Only Need One) పేరుతో ఓ యాప్‌ని తీసుకు వస్తోంది. తరచూ online shopping చేసే వారికి ఉపయోగపడుతుంది ఈ యాప్. Amazon, jabong వంటి 60కి పైగా షాపింగ్ సైట్ల నుండి ఇది offersని అందిస్తుంది. ఈ app ద్వారా bus, train టికెట్లని బుక్ చేసుకోవచ్చు, Ola, Uberలో cabs బుక్ చేసుకోవచ్చు, సినిమా టికెట్లు, Swiggy ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
థర్డ్-పార్టీ సైట్లకి వెళ్లాల్సిన పనిలేకుండానే insurance policyలను కొనుగోలు చేయొచ్చు. Amazon, Uber, Ola వంటి సంస్థలతో పాటు Myntra, Jabong, Shoppers Stop, Yatra, Swiggy, Byjus వంటి 40 వరకూ ప్రముఖ online shopping సర్వీసులతో SBI కలిసి పనిచేస్తోంది.
YONO app ద్వారా రోజువారీ బ్యాంకింగ్ పనులను కూడా నిర్వర్తించుకోవచ్చు. Artificial Intelligence, ప్రిడిక్టివ్ అనలటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి తాజా టెక్నాలజీలను ఈ appలో నిక్షిప్తం చెయ్యడం జరిగింది. కేవలం ఒకటే యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌తో అన్ని రకాల సేవలు యాక్సెస్ చెయ్యడానికి వీలవుతుంది.