ఎవరైనా phone ఎందుకు మాట్లాడతారు? మనుషులతో రిలేషన్లు పటిష్టం చేసుకోవడానికే కదా? అయితే Consumer mobility మీద తాజా రిపోర్ట్ ప్రకారం.. 2000వ సంవత్సరం తర్వాత యౌవ్వన దశలోకి ప్రవేశించిన “మిల్లీనియల్స్” ఎదురుగా కన్పిస్తున్న వారిని తప్పించుకోవడానికే ఎక్కువగా ఫోన్ మాట్లాడుతున్నట్లు ఫోజు కొడుతుంటారట.
పెద్దలు సోది చెప్తారనీ, వాళ్లతో మాట్లాడలేమనీ చాలామంది యువత ఇప్పటికే భావిస్తున్న సంగతి తెలిసిందే. “ఏం చదువుతున్నావు… బాగా చదువుతున్నావా” అంటూ పెద్దవాళ్లు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం లేక.. పలకరిస్తారని భావించిన వాళ్లు కన్పించగానే ఎవరికో డయల్ చేసి.. ఫోన్లో బిజీగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చి, ఓ చిరునవ్వుతో విష్ చేసి బాధ్యత ముగిసిపోయిందని భావించే వారు రానురానూ ఎక్కువవుతున్నారు.
మనుషుల్ని నేరుగా ఫేస్ చెయ్యకుండా తప్పించుకోవడానికి smartphone లు బాగా ఉపయోగపడుతున్నాయి. మనుషుల్ని పలకరించకుండా తప్పింంచుకోవడం ఓ గిల్టీ ఫీలింగ్‌కి సృష్టిస్తుంది. దాన్ని అధిగమించడానికే ఏదో phone call వచ్చినట్లు బిల్డప్‌లు ఇస్తున్నారు. Facebook, Whatsapp ఛాటింగ్ ద్వారా పూర్తిగా బయటి ప్రపంచపు పరిచయాలను వదిలేసి మనుషులతో కలవకుండా ఎప్పుడూ వర్చ్యువల్ ప్రపంచంలో విహరించడం వల్ల ఎదురవుతున్న సమస్యగా దీన్ని భావించవచ్చు.
ఉన్న ఫళంగా ఎవరైనా వ్యక్తి ఎదురైతే ఏం పలకరించాలో, ఎలా మాట్లాడాలో తెలీని శూన్యత. కళ్లల్లోకి కళ్లు పెట్టి మాట్లాడడం, ఆ చూపుల్ని తట్టుకోవడం కూడా చేతకానితనం. దీంతో ఏమీ ఎరగనట్లు, ఎవరితోనూ మనకు సంబంధం లేనట్లు ఫంక్షన్ల వంటి వాటిలో కూడాఓ మూలన కూర్చుని ఎవరి లోకంలో వాళ్లు గడపడం పరిపాటైపోయింది.