సురేష్ ప్రభు – ఏంటీ మెయిల్స్? ఎందుకీ స్పామ్?

irctc-mail

ఈరోజు కోట్లాది మంది భారతీయులకు railway మినిస్టర్ సురేష్ ప్రభు నుండి email వచ్చే ఉంటుంది. గత రెండేళ్లలో రైల్వే రంగంలో భారత ప్రభుత్వం సాధించిన విజయాల గురించి సురేష్ ప్రభు నివేదిక ఇది. ప్రభుత్వం ఇలా ప్రతీ వ్యక్తికీ చేరువ కావడం హర్షించదగినదే. కానీ ఎంచుకున్న మాధ్యమమే అస్సలు బాలేదు.

యెస్.. ఈరోజు email spam ఎక్కువ అవుతోందని ప్రతీ ఒక్కళ్లం వాపోతున్నాం. పొద్దున్నే లేచి చూస్తే ప్రతీ ఒక్కరి mail inboxలో కనీసం 40-50 spam mails వచ్చి చేరుతున్నాయి. అవి ఎక్కడ నుండి వస్తున్నాయో తెలీదు. పొరబాటున ఓపెన్ చేస్తే చాలు tracking cookies ఆధారంగా మనం ఓపెన్ చేసిన విషయం గుర్తించి.. ఇకపై ఆగకుండా అవి వస్తూనే ఉంటాయి.

అలాగని unsubscribe చేశామే అనుకో.. ఆ unsubscriber లిస్ట్‌ని కూడా ఆ marketing mailsని పంపే వారు వేరే వాళ్లకి అమ్ముకుని మళ్లీ వేరే చోట నుండి మెయిల్స్ ప్రవాహం వస్తుంటుంది. మనకు గుర్తున్నంత వరకూ మనం ఎక్కడా mail newslettersకి subscribe చేసి లేకపోయినా ఎక్కడెక్కడి నుండో mails ఊడిపడుతుంటాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

స్పామ్ మెయిల్స్‌కీ Railway minister Suresh Prabhu మనకు పంపిన మెయిల్‌కి సంబంధం ఏమిటనే సందేహం కలుగుతోంది కదా! ఆ పాయింట్‌కే వస్తున్నాను. US, ఇతర యూరోపియన్ దేశాల్లో spam విషయంలో  చాలా కఠినతరమైన చట్టాలు ఉంటాయి. ఆ మధ్య నా Amazon Simple Email Service అకౌంట్‌ని ఓ ఫారినర్ హ్యాక్ చేసి.. 2 నిముషాల్లో లక్ష మందికి నా తరఫున మెయిల్స్ పంపించడం జరిగింది.  వెంటనే US పౌరుల నుండి చాలా ఘాటుగా నాకు మెయిల్స్ వచ్చాయి. “Spam పంపించారు.. ఈ పని ఆపకపోతే వెంటనే క్రిమినల్ కేస్ వేస్తాం” అంటూ హెచ్చరించారు. US పౌరులు అంత తీవ్రంగా స్పందించారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు.. అక్కడ spam ఎంత పెద్ద నేరమో!

కానీ మనకు రోజుకి కొన్ని వందల స్పామ్ మెసేజ్‌లు వస్తున్నా స్పందించం! అసలు ఎవరికి report చెయ్యాలో కూడా తెలీదు. Spam గురించి కఠినతరమైన చట్టాలూ లేవు. User privacy మీద బాధ్యత లేని ప్రభుత్వాలు మనవి. ఇప్పుడు అసలు పాయింట్‌కి వస్తాను.

సురేష్ ప్రభు సామాన్య పౌరులకి తమ శాఖ సాధించిన ప్రగతిని తెలియజేయడానికి మంచి ప్రయత్నమే చేశారు. కానీ సామాన్య పౌరుడి inboxలో ముఖ్యమైన మెయిల్స్ ఇలాంటి spamల మాటున ప్రాధాన్యత కోల్పోతున్న తరుణంలో, ప్రభుత్వాల కన్నా, ప్రభుత్వాల ప్రగతి కన్నా ఓ వ్యక్తి స్వేచ్ఛ, ప్రైవసీ ప్రధానమైనదన్న విషయం అందరం గుర్తించాలి.

ఏ IRCTC సైట్ ద్వారానో, ఇంకో మార్గం ద్వారానో సురేష్ ప్రభు, తమ టెక్నికల్ వింగ్ ద్వారా మోడీ ప్రభుత్వం ఇలా ప్రతీ ఒక్కరూ మనకు  spam పంపిస్తూ పోతే, దాన్ని ప్రజాస్వామ్యంగా గొప్పగా చెప్పుకుంటే ఎలా హర్షించాలి? అంతగా ప్రభుత్వాలు ప్రజలకు దగ్గరగా పాలన సాగించాలి అనుకుంటే.. తమ అధికారిక website‌లలోనే తమ విజయాలు పెట్టొచ్చు.. లేదా తమకు subscribe చేసిన వారికి మాత్రమే ఇలాంటి సమాచారం పంపాలి. అంతే తప్పించి దేశ జనాభా మొత్తాన్నీ spam mailsతో ముంచెత్తడం ఎంతవరకూ సమంజసం?  Email లాంటి శక్తివంతమైన మాధ్యమాన్ని ఇప్పటికే రకరకాల చోట్ల నుండి వస్తున్న spam మెయిల్స్ ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వాలూ ఇలా చేస్తే ఎలా?

-నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా మేగజైన్

Computer Era
Logo
Enable registration in settings - general