

ఎప్పుడైనా ఆకలేసినప్పుడు Swiggy, Foodpanda, Uber EATS వంటి యాప్స్ ఓపెన్ చేసి కావాల్సిన రెస్టారెంట్ ఎంపిక చేసుకొని ఫుడ్ ఆర్డర్ చేయడం మాత్రమే చాలా మందికి తెలిసిన విషయం.
వాస్తవానికి ఇప్పటివరకు Swiggy వంటి యాప్స్ అన్నీ మనం నివసిస్తున్న ప్రదేశంలో వివిధ రెస్టారెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకొని, వారి నుండి 15 నుండి 30 శాతం కమీషన్ తీసుకుంటూ, ఆహారాన్ని మనకు చేరవేస్తూ ఉన్నాయి. అయితే టెక్నాలజీ సపోర్ట్ తో పాటు, పెద్ద మొత్తంలో నిర్వహణ వ్యయాలు పెరిగిపోవటం వలన ఇది పెద్దగా లాభదాయకంగా లేదని భావించిన ఫుడ్ డెలివరీ సంస్థలు ఇప్పుడు సరికొత్త ప్రణాళికలు వచ్చేస్తున్నాయి.
ఇందులో భాగంగా వివిధ నగరాల్లో ప్రత్యేకంగా క్లౌడ్ కిచెన్ నెలకొల్పుతూ.. అందులో తమ సొంత బ్రాండ్లకు చెందిన రెస్టారెంట్లతో పాటు, వివిధ పాపులర్ రెస్టారెంట్లకు సంబంధించిన కిచెన్ సెటప్కిి కూడా అవకాశం కల్పిస్తున్నాయి.
ఎలా పనిచేస్తుంది?
ఇప్పటికే Swiggy Access పేరిట ఓ క్లౌడ్ కిచెన్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూర్, పూణే, కోల్కత్తా, చెన్నై నగరాల్లో మొదలైంది. ఇందులో 80 వేర్వేరు రెస్టారెంట్లకు చెందిన కిచెన్ సెటప్‌లు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అలాంటివి ఇప్పుడు వరకు 130 క్లౌడ్ కిచెన్లని Swiggy Access నెలకొల్పింది.