• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

amazon sale

OnePlus Buds Z డీటెయిల్డ్ రివ్యూ! కొనొచ్చా లేదా?

by

OnePlus Buds Z review

ఈ మధ్యకాలంలో Wireless earbuds వినియోగం బాగా పెరిగింది. Smartphone తయారీలో పేరెన్నికగన్న సంస్థ OnePlus కూడా ఇయిర్ బర్డ్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. Amazonలో రూ. 2,999కి ఈ లింక్‌లో వీటిని కొనుగోలు చేయొచ్చు.

డిజైన్

OnePlus Budsలో ఇయర్ టిప్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం జరిగింది. అవి చెవిలో మెరుగ్గా అమరడమే కాకుండా, పాసివ్ నాయిస్ ఐసోలేషన్ సమర్థవంతంగా చేయగలుగుతున్నాయి. ఇవి పూర్తిగా ప్లాస్టిక్తో తయారు చేయబడి గ్లాస్ మాదిరిగా కనిపించే కోటింగ్ వేయబడి ఉంటాయి. ఒక్కొక్కటి కేవలం ఐదు గ్రాముల బరువు మాత్రమే ఉండటం వల్ల ఎక్కువసేపు ధరించినా కూడా చెవుల పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అయితే ఒకే ఒక అసౌకర్యం ఏంటంటే ఇయర్ పీసెస్ స్వల్పంగా బయటకు వచ్చినట్లు ఉంటాయి. ఇయర్ బడ్స్ మాదిరిగానే కేస్ కూడా ప్లాస్టిక్ తో రూపొందించబడి ఉంటుంది. ఛార్జింగ్ కోసం usb type c port దానిమీద కల్పించబడి ఉంటుంది.

కేస్ మూత తీసిన క్షణంలోనే, మీరు ఏ ఫోన్ కైతే పెయిరింగ్ చేసి ఉంటారో దానికి ఇయర్ బడ్స్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. ఇది కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. అలాగే రెండు వైపులా ఇయర్ బడ్స్ మీద టచ్ ఆధారంగా పనిచేసే కంట్రోల్స్ అందించబడ్డాయి. వీటిని మనకు నచ్చినట్లుగా Hey Melody అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా కష్టమైజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లో built-in ఈక్వలైజర్ కూడా లభిస్తుంది.

ఒక ఇయర్ బడ్ చెవిలో నుండి బయటకు తీసిన వెంటనే అప్పటివరకు ప్లే అవుతున్న మ్యూజిక్ ఆగిపోతుంది. మళ్లీ చెవిలో పెట్టుకున్న తర్వాత మాత్రమే మ్యూజిక్ కంటిన్యూ అవుతుంది. IP 55 రేటింగ్ కలిగి ఉండటం వలన జిమ్ చేసేటప్పుడు గానీ, వాకింగ్ చేసేటప్పుడు గానీ చెమట వల్ల ఇయర్ బడ్స్ పాడవుతాయి అని ఆందోళన చెందాల్సిన పనిలేదు.

సౌండ్ క్వాలిటీ

సౌండ్ క్వాలిటీ బాగా లేకపోతే ఎంత మంచి కంపెనీ ఇయర్‌బడ్స్ అయినా నిరుపయోగమే. అయితే OnePlus Buds Z సౌండ్ క్వాలిటీ విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు అందిస్తాయి. 10mm డైనమిక్ డ్రైవర్లను ఇది కలిగి ఉంటాయి. బ్లూటూత్ 5 ఆధారంగా పనిచేసే ఈ ఇయర్ బడ్స్ SBC, AAC ఆడియో కొడెక్‌లను సపోర్ట్ చేస్తాయి. అధిక శాతం ఉంది యూజర్లను సంతృప్తిపరచడం కోసం ఈ ఇయర్‌బడ్స్‌ని రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఇవి బాస్ ఫార్వార్డ్ సౌండ్ సిగ్నేచర్ కలిగి ఉంటాయి. కొన్ని సందర్భాలలో బీట్స్ ఓకల్స్‌ని డామినేట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే కేవలం ఆడియో రంగంలో నిపుణులైన వారు మాత్రమే ఈ విషయాన్ని గమనించగలుగుతారు. మామూలు సందర్భాలలో ఏ మాత్రం ఇబ్బంది అనిపించదు. కచ్చితంగా ఈ ధరలో తగినంత శబ్ద నాణ్యత లభిస్తుంది.

బ్యాటరీ లైఫ్, కనెక్టివిటీ

ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఐదు గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని OnePlus సంస్థ చెబుతున్నప్పటికీ, నాలుగు గంటల పాటు నిక్షేపంగా బ్యాటరీ బ్యాకప్ లభిస్తోంది. అలాగే ఛార్జింగ్ కేస్ ద్వారా మొత్తం 20 గంటల బ్యాటరీ బ్యాకప్ పొందగలుగుతాం. కేవలం పది నిమిషాలు ఛార్జింగ్ చేస్తే చాలు, మూడు గంటల పాటు పాటలు వినగలిగేటంత బ్యాకప్ లభిస్తుంది. ఒక్కో ఇయర్‌బడ్‌లో రెండు మైక్రోఫోన్స్ పొందుపరచబడ్డాయి. ఈ కారణం చేత మీరు మాట్లాడే ఫోన్ కాల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి.

కొనచ్చా లేదా?

OnePlus Buds Z రెండో ఆలోచన లేకుండా తీసుకోవచ్చు. వీటి కంటే మరింత మెరుగైన ఆప్షన్ కావాలంటే Oppo Enco W31ని ఎంపిక చేసుకోవచ్చు.

OnePlus Buds Z రూ. 2,999 – https://amzn.to/2HM3Nkn

Oppo Enco W31 రూ. 2,999 – https://amzn.to/33odxJq

Filed Under: Gadgets Tagged With: amazon sale, oneplus buds, OnePlus Buds Z review, wireless Earbuds

Amazon Great Indian Festival Saleలో ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద భారీగా డిస్కౌంట్స్!

by

Amazon Great Indian Festival Sale

ఒకపక్క Flipkart రేపటి నుండి మరో దశ సేల్‌కి సన్నద్ధమవుతుంటే మరోపక్క Amazon Great Indian Festival Sale కొనసాగుతోంది. ఈ సేల్‌లో ప్రస్తుతం వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల మీద భారీగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ.

గేమింగ్ మరియు గ్రాఫిక్స్ అవసరాల కోసం శక్తివంతమైన laptop కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ లింకు లో అనేక మోడల్స్ మీద డిస్కౌంట్ లభిస్తోంది. వివిధ రకాల వైర్లెస్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి డిస్కౌంట్ కింద ఈ లింకు లో అనేక మోడల్స్ లభిస్తున్నాయి. ఆన్లైన్ క్లాస్ రూమ్, ఇతర అవసరాల కోసం టాబ్లెట్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింకు లో వివిధ మోడల్స్ మీద ప్రత్యేకమైన డిస్కౌంట్ పొందొచ్చు.

34,994 రూపాయల విలువ కలిగిన Canon EOS 1500D డి ఎస్ ఎల్ ఆర్ కెమెరాను కేవలం 24,990 రూపాయలకు సొంతం చేసుకోవటానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది. ఆడియో దిగ్గజం సోనీ సంస్థకు చెందిన హెడ్ ఫోన్ ల మీద భారీగా డిస్కౌంట్స్ ఈ లింకులో లభిస్తాయి. ఆ సంస్థకు చెందిన వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా ఇందులో ఉంటాయి. మంచి హోమ్ థియేటర్ అనుభూతి పొందటం కోసం సౌండ్ బార్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ లింక్‌లో మీకు కావలసిన డిస్కౌంటెడ్ సౌండ్‌బార్లు లభిస్తాయి. భారీ మొత్తంలో స్టోరేజ్ అవసరాల కోసం ఒక మంచి పోర్టబుల్ హార్డ్ డిస్క్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ లింక్ లో డిస్కౌంట్ కింద హార్డ్ డిస్కులు లభిస్తాయి.

Work from Home, Online Classes కోసం మంచి లాప్టాప్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ లింకులో డిస్కౌంట్ కింద అనేక మోడల్స్ ఉన్నాయి. తక్కువ బరువు ఉండి, అద్భుతమైన ఫోటోలు వీడియోలు తీసే మిర్రర్‌లెస్ కెమెరా కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్‌లో పలు మోడల్స్ లభిస్తున్నాయి. శక్తివంతమైన వైర్లెస్ రౌటర్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ మీకు కావలసిన మోడల్స్ డిస్కౌంట్ కింద లభిస్తున్నాయి.

Filed Under: Tech News Tagged With: Amazon great indian festival sale discounts, amazon sale, deals of the day, discount sale, electronics offers, laptops on discount, tablets on discount

1500 తగ్గింపు ధరకు Nokia 5.3 లభిస్తోంది.. స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు ఇవి!

by

Nokia 5.3 discount on Amazon Great India Festival Sale

Amazon India పండగ సీజన్ కొనసాగిస్తోంది. Great Indian Festival Sale మరి కొంత కాలం పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో Nokia 5.3 ఫోన్ మీద 1500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.

తక్కువ ధరలో అందర్నీ ఆకట్టుకుంటున్న ఫోన్ గా Nokia 5.3ని భావించవచ్చు. దీనిలో 4GB RAM కలిగిన మోడల్ ని ప్రస్తుతం 1500 రూపాయల డిస్కౌంట్ పోను కేవలం 12499 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. అలాగే 6GB RAM కలిగిన మోడల్ ని డిస్కౌంట్ పోయిన తర్వాత కేవలం 13999 రూపాయలకు కొనుగోలు చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారు అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అయితే గరిష్ఠంగా 1500 రూపాయల వరకు మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది.

అంటే సంబంధిత క్రెడిట్ కార్డులు వాడేవారు 4జిబి ర్యామ్ మొబైల్ ని కేవలం 11250 రూపాయలకు, 6gb ram మోడల్ని కేవలం 12,600 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాలు కలిగి ఉండి, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో 6.55 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది.

4000 mAh కెపాసిటీ బ్యాటరీ కలిగి ఉండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే అడాప్టివ్ బ్యాటరీ టెక్నాలజీతో పని చేస్తూ ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులపాటు బ్యాక్ అప్ వచ్చే విధంగా ఇది పనిచేస్తుంది. డిస్కౌంట్ కింద 6GB మోడల్‌ని 13,999 రూపాయలకు ఈ లింకు లో కొనుగోలు చేయవచ్చు. అలాగే 4GB మోడల్ని 12,499 రూపాయలకు ఇక్కడ కొనుగోలు చేయొచ్చు.

ఇదిలా ఉంటే మరోవైపు Nokia C3 ఫోన్ మీద కూడా డిస్కౌంట్ లభిస్తోంది. 7999 రూపాయల విలువ కలిగిన ఈ ఫోన్ ప్రస్తుతం కేవలం 6999 రూపాయలకు లభిస్తుంది. 10% discount కూడా జతచేయబడిన తర్వాత 6,201 రూపాయలకు దీన్ని సొంతం చేసుకోవచ్చు. 2GB RAM కలిగి ఉండే మోడల్ ఇది. ఈ లింక్‌లో ఈ Nokia C3ని కొనుగోలు చేయవచ్చు.

Filed Under: Tech News Tagged With: amazon sale, nokia 5.3, Nokia 5.3 discount on Amazon Great India Festival Sale, smartphone discount sale

Samsung Galaxy M31 Prime ధర, ఇతర వివరాలు వెల్లడయ్యాయి!

by

Samsung Galaxy M31 Prime

Samsung సంస్థ అతి త్వరలో Galaxy M31 Primeని భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ వారంలో ప్రారంభం కాబోతున్న Amazon Great Indian Festival saleలో ఈ ఫోన్ రిలీజ్ అవుతుంది.

Galaxy M31 Primeకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తాజాగా లీక్ అయ్యాయి. 6 జి బి రామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ మోడల్ 16,499 రూపాయలకు లభిస్తుంది. 6 జి బి రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ ధర వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి మూడు నెలలపాటు Amazon Prime సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

Galaxy M31 Prime Editionలో 6.4 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది అద్భుతమైన దృశ్య నాణ్యత అందిస్తుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో 4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా లభిస్తుంది. దాంతోపాటు 8 మెగా పిక్సల్ ultrawide కెమెరా, 5 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్, మరో 5 MP మాక్రో కెమెరా లభిస్తుంటాయి. సెల్ఫీల కోసం 32 megapixel కెమెరా అందించబడింది. 30 fps ఫ్రేమ్‌రేట్‌లో 4K క్వాలిటీ కలిగిన వీడియోలను ఈ ఫోన్ రికార్డ్ చేయగలుగుతుంది.

ప్రాసెసర్ విషయానికొస్తే Samsung సంస్థ అన్ని బడ్జెట్ ఫోన్లలో ఉపయోగిస్తున్న Exynos 9611 ప్రాసెసర్ ఈ ఫోన్లో కూడా అందించబడింది. మెమరీ కార్డు ద్వారా అదనంగా స్టోరేజ్ పొందొచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించబడింది. LTE, WiFi 5, usb type c port, హెడ్ఫోన్ జాక్ కలిగిన Samsung Galaxy M31 Primeలో 6000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

Filed Under: Tech News Tagged With: Amazon great indian festival sale discounts, amazon sale, samsung galaxy m31 prime, Samsung Galaxy M31 prime specifications, samsung new phone

Amazonలో 900లకు పైగా కొత్త ప్రోడక్టులు రిలీజ్ కాబోతున్నాయి!

by

Amazon Great Indian Festival Sale

Amazon Great Indian Festival Sale ఈనెల 17వ తేదీ నుండి రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు ఈ సేల్ కొనసాగించబడుతుంది. దీనికి సంబంధించి అమెజాన్ పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

6.5 లక్షల మంది అమ్మకందారులు ఈ సేల్‌లో తమ వస్తువులను విక్రయిస్తున్నారు. అన్ని విభాగాల్లో కలిపి నాలుగు కోట్ల ఉత్పత్తుల వరకు ఇందులో లభిస్తాయి. అలాగే దేశవ్యాప్తంగా వంద నగరాల్లో 20 వేలకు పైగా స్థానిక షాపులు ఈ ప్రత్యేకమైన సేల్‌లో పాలు పంచుకుంటున్నాయి. కేవలం పెద్దపెద్ద వస్తువులు మాత్రమే కాకుండా పండుగ సమయంలో నిత్యావసర వస్తువులు కూడా వేగంగా ఇంటికి అందజేసే విధంగా దేశవ్యాప్తంగా ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

ఇదిలా ఉంటే మరోవైపు smartphones, televisions, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, kitchen appliances, యాక్సెసరీస్ వంటి అన్ని విభాగాల్లో కలిపి 900 పైగా కొత్త ఉత్పత్తులను Amazon Great Indian Festival Saleలో రిలీజ్ చేస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు Amazon India సైట్లో ఉన్న వస్తువుల గురించి వారి సొంత భాషలో తెలుసుకునే విధంగా స్థానిక భాషా సపోర్ట్ కూడా ఇటీవల తీసుకురాబడింది. ఈ పండుగ సీజన్లో నవరాత్రి, దుర్గా పూజ, దంతేరస్, రాబోతున్న పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల ఉత్పత్తులతో Amazon అలరించబోతోంది. వాటికి సంబంధించి ప్రత్యేకమైన సేల్ పేజీలు ఆయా సమయాల్లో దర్శనమిస్తాయి.

వినియోగదారులు ఆర్డర్ చేసిన ఉత్పత్తులను ఎప్పటికప్పుడు వేగంగా డెలివరీ చేయడం కోసం దేశవ్యాప్తంగా 200 వరకు డెలివరీ స్టేషన్స్, వేలాది మంది డెలివరీ పార్టనర్‌‌ని ఆ సంస్థ నియమించుకుంది. అక్టోబర్ 17 వ తేదీన మొదలయ్యే ఈ Amazon Great Indian Festival Saleని Amazon Prime సబ్స్క్రిప్షన్ కలిగి ఉన్న వినియోగదారులు ఒకరోజు ముందే, అంటే అక్టోబర్ 16 వ తేదీ నుండి వినియోగించుకోవచ్చు. “కంప్యూటర్ ఎరా” ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన deals గురించి మీకు సమాచారం అందిస్తుంది.

Filed Under: Uncategorized Tagged With: amazon discount sale, Amazon great indian festival sale discounts, amazon sale, smart tv, smartphones

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in