• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

android apps

ఈ Android Appsతో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ లొకేషన్ తెలుసుకోండి!

by

how to find family friends gps location

మీ స్నేహితులు గానీ, కుటుంబ సభ్యులు కానీ బయటకు వెళ్ళినప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే గనుక ఇప్పటికే చాలామంది Whatsappలో రియల్ టైం లొకేషన్ షేరింగ్ చేస్తూ ఉంటారు. పూర్తిగా వాట్సప్ మీద ఆధారపడాల్సిన పనిలేకుండా ఎప్పటికప్పుడు మీ ఆత్మీయుల లొకేషన్ తెలుసుకోవటానికి అనేక అద్భుతమైన Android Apps అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్ధాం.

Glympse

చాలా కాలం నుండి లభిస్తూ చాలా పాపులర్ అయిన అప్లికేషన్ ఇది. దీనిని మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. వారు కేవలం ఒకే ఒక లింక్ మీకు sms ద్వారా గానీ, Whatsapp ద్వారా గానీ షేర్ చేస్తే చాలు, వారి కదలికలను, ప్రస్తుతం ఉన్న లొకేషన్ ని మీరు నేరుగా బ్రౌజర్లో చూడగలుగుతారు. అలాగే ఒక నిర్దిష్టమైన సమయం తర్వాత లొకేషన్ షేరింగ్ ఆటోమేటిక్గా డిజేబుల్ అయ్యేవిధంగా దీంట్లో చేసుకోవచ్చు. దీనిని పూర్తి ఉచితంగా వాడుకోవచ్చు.

Sygic Family Locator

మీ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వారి లొకేషన్ తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది వాడే పాపులర్ అప్లికేషన్ ఇది. ఎమర్జెన్సీ సమయంలో పిల్లలు తమ పేరెంట్స్ ని అలర్ట్ చేసే విధంగా దీంట్లో SOS బటన్ కూడా ఉంటుంది. అలాగే పిల్లలు స్కూల్, ఇతర గమ్యస్థానాలకు చేరుకున్న వెంటనే పేరెంట్స్ కి ఆటోమేటిక్ గా అలర్ట్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మీ ఫోన్లో కూడా తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

Geo Tracker

కేవలం మామూలు లొకేషన్ డేటా మాత్రమే కాకుండా, ట్రెక్కింగ్ లాంటిది చేసే వారికి ఉపయోగపడే విధంగా ఆల్టిట్యూడ్, వెర్టికల్ డిస్టెన్స్, స్లోప్ ఇంక్లినేషన్ వంటి అనేక ఇతర సదుపాయాలను ఇది కలిగి ఉంటుంది. ట్రెక్కింగ్ చేసే వారు తమ యోగక్షేమాలను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ఈ అప్లికేషన్ ప్రయత్నించవచ్చు.

ఇవి మాత్రమే కాకుండా.. Google Mapsలో కూడా పూర్తి స్థాయిలో రియల్ టైం లొకేషన్ షేర్ చేసే అవకాశం ఉంది అన్న విషయం తెలిసిందే.

Filed Under: How-To Guide Tagged With: android apps, friends gps location, google play store, how to find family friends gps location

ఈ 21 appsలో ఏదైనా మీ phoneలో ఉంటే అర్జెంటుగా తొలగించండి!

by

dangerous Android app on Google Play Store

Android ఆపరేటింగ్ సిస్టం సంబందించిన గూగుల్ ప్లే స్టోర్ లో సెక్యూరిటీ విషయంలో గూగుల్ సంస్థ ఎప్పటికప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, గూగుల్ కళ్లుగప్పి అనేక ప్రమాదకరమైన అప్లికేషన్స్ వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ సెక్యూరిటీ సంస్థలు వీటి గురించి సమాచారం అందిస్తూ ఉంటాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ Anti-virus సంస్థ Avast గూగుల్ ప్లే స్టోర్ ఇంతకాలం అందుబాటులో ఉన్న 21 ప్రమాదకరమైన అప్లికేషన్స్ గురించి వినియోగదారులను హెచ్చరించింది. వాటిలో అంతర్గతంగా ట్రోజన్ నిక్షిప్తం చేయబడినట్లుగా ఆ సంస్థ అలర్ట్ చేసింది. వీటిలో 19 అప్లికేషన్లను ఇప్పటికే గూగుల్ సంస్థ నిషేధించే ఆలోచనలో ఉంది. అయినప్పటికీ ఒకవేళ ఇప్పటికే సంబంధిత అప్లికేషన్లు మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉన్నట్లయితే రెండో ఆలోచన లేకుండా తొలగించండి. అవేంటో ఇక్కడ చూద్ధాం.

Shoot Them, Crush Car, Rolling Scroll, Helicopter Attack – NEW, Assassin Legend – 2020 NEW, Helicopter Shoot, Regby Pass, Flying Skateboard, Iron it, Shooting Run, Plant Monster, Find Hidden, Find 5 Differences – 2020 NEW, Rotate Shape, Jump Jump, Find the Differences – Puzzle Game, Sway Man, Money Destroyer, Desert Against, Cream Trip – NEW, Props Rescue

వీటిలో అధిక భాగం ఆండ్రాయిడ్ గేమ్స్. కాబట్టి వీటిలో వేటినైనా మీరు గానీ మీ పిల్లలు గానీ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వాటిని తొలగించండి. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లో విధించబడిన ప్రైవసీ కంట్రోల్స్ అన్నిటిని బైపాస్ చేసి వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తూ ఉన్నాయి. ఆ సమాచారాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్తులు మీకు వల పన్నే ప్రమాదముంటుంది.

Filed Under: How-To Guide Tagged With: android apps, android phone, dangerous Android app on Google Play Store, phone apps, smartphone security

మీ Android phone కోసం కొన్ని వర్చువల్ రియాలిటీ అప్లికేషన్స్ ఇవి!

by

best Virtual Reality apps for your Android phone

ఇటీవలికాలంలో Virtual reality కంటెంట్ వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే Android phoneలను ఉపయోగించే వారి కోసం అందుబాటులో ఉన్న వివిధ రకాల Android Appsని ఇప్పుడు చూద్దాం.

Google Cardboard

వర్చ్యువల్ రియాలిటీ హెడ్సెట్ వాడుతున్న వారికి గూగుల్ అందిస్తున్న అది కాళికా అప్లికేషన్ ఇది. దీనిని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కార్డు బోర్డు ఆధారంగా పనిచేసే అనేక రకాల అప్లికేషన్స్ అంతర్గతంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వర్చువల్ రియాలిటీ వీడియోలు చూడొచ్చు, 3D డెమోస్ చూడొచ్చు.

Youtube VR

యూట్యూబ్ లో కేవలం మామూలుగా చూడడం కాకుండా అందులో లభించే కొన్ని వీడియోలను వర్చువల్ రియాలిటీ లో చూడడం కోసం ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లని సపోర్ట్ చేసే అన్ని రకాల వర్చువల్ రియాలిటీ హెడ్సెట్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది. మెరుగైన వీడియో ఎక్స్పీరియన్స్ కోసం దీనిని ప్రయత్నించవచ్చు.

Google Daydream

గూగుల్ సంస్థ అధికారికంగా విడుదల చేసిన మరో వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ ఇది. అయితే ప్రస్తుతం అది యాక్టివ్ గా సపోర్ట్ చేయకపోయినా అందులో భారీ మొత్తంలో కంటెంట్ లభిస్తుంది. ఈ అప్లికేషన్ వాడాలంటే తప్పనిసరిగా మీ దగ్గర DayDream సపోర్ట్ చేసే ఫోన్ ఉండాల్సి ఉంటుంది. VR videoలు, ఇతర అనేక రకాల కంటెంట్ దీంట్లో ఉంటుంది.

Fulldive VR

వర్చువల్ రియాలిటీ ఆధారంగా అన్ని రకాల కంటెంట్ ఆస్వాదించడం కోసం ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీంట్లో వెబ్ బ్రౌజింగ్ మొదలుకొని ఫోటో స్టోరేజ్ వరకు లభిస్తుంటాయి. ఇందులో ఉండే VR Camera అనే సదుపాయం ద్వారా 360 డిగ్రీల ఫోటోలు మరియు వీడియోలు క్యాప్చర్ చేసుకోవచ్చు.

Titans of Space

అంతరిక్షాన్ని వర్చువల్ రియాలిటీ లో ఆస్వాదించాలి అనుకునే వారి కోసం ఈ అద్భుతమైన అప్లికేషన్. మొత్తం ఎనిమిది ప్లానెట్స్, చంద్రుడు, దానికి దగ్గరగా ఉండే నక్షత్రాలు వంటివన్నీ కూడా అతి సమీపంగా చూసిన అనుభూతి వీటి ద్వారా పొందొచ్చు.

Filed Under: How-To Guide Tagged With: android apps, android best apps, best Virtual Reality apps for your Android phone, smartphone apps, virtual reality

ఈ Paid Android Apps ఈ రోజు FREEగా డౌన్లోడ్ చేసుకోవచ్చు!

by

Paid Android apps temporarly FREE on Google Play Store

ఎప్పటికప్పుడు అనేక విలువైన Paid Android Appsని FREEగా download చేసుకునే మార్గాలను ” కంప్యూటర్ ఎరా” మీకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ రోజు ఫ్రీగా లభిస్తున్న కొన్ని పెయిడ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.

Resize Me!Pro

100 రూపాయల విలువ కలిగిన ఈ యాప్ కొంత సమయం పాటు ఫ్రీగా లభిస్తుంది. దీని ద్వారా మీ ఫోన్లో ఉన్న ఫోటోలను కావలసిన పరిమాణంలో కి సులభంగా రీసైజ్ చేసుకోవచ్చు. అలాగే ఆయా ఫోటోల్లో అంతర్గతంగా ఉన్న EXIT డేటాని అలాగే ఉంచవచ్చు. పెద్దగా క్వాలిటీ నష్టపోకుండా మీకు నచ్చిన పరిమాణంలో ఫోటోలను పొందొచ్చు. అలాగే ఫోటోల మీద వాటర్ మార్క్ జత చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. Google Play Storeలో ఈ లింకు నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Sketch Me! Pro

95 రూపాయల విలువ కలిగిన అప్లికేషన్ కొంత సమయం పాటు ఉచితంగా లభిస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా మీ ఫోన్ లో ఉన్న ఫోటోలను డ్రాయింగ్, కార్టూన్, స్కెచ్ ఇమేజెస్‌గా పొందొచ్చు. అలా కన్వర్ట్ చేయబడిన ఇమేజ్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఇంట్లో భారీ మొత్తంలో ఎఫెక్ట్ లభిస్తున్నాయి. కాంట్రాక్ట్, బ్రైట్నెస్, శాట్యురేషన్ ఒంటి సెట్టింగ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. Google Play Storeలో ఈ లింకు నుండి దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TypeIt Pro

ఇది 70 రూపాయల విలువ కలిగిన అప్లికేషన్. ప్రస్తుతం దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోటోల మీద కావలసిన విధంగా టెక్స్ట్, వాటర్ మార్కులను జత చేసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఫాంట్, కలర్, ఒపాసిటీ వంటి పలురకాల సెట్టింగ్స్ దీంట్లో చేసుకోవచ్చు. ఒకేసారి భారీ మొత్తంలో ఇమేజ్లను బ్యాచ్ మోడ్లో ప్రాసెస్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ లింక్ నుండి ఈ అప్లికేషన్ ఉచితంగా లభిస్తుంది.

Gif Me!

పూర్తిస్థాయిలో వీడియో కాకుండా కేవలం ఒక ఇంపార్టెంట్ దృశ్యాన్ని GIF యానిమేషన్ రూపంలో రికార్డు చేసుకొని దానిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం కోసం ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. 95 రూపాయలు విలువ కలిగిన ఈ అప్లికేషన్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ఈ లింకులో ఉచితంగా లభిస్తుంది. యానిమేషన్ లకు టెక్స్ట్, బోర్డర్ లు, స్టిక్కర్లు కూడా జత చేయవచ్చు.

Filed Under: Tech News Tagged With: android apps, android phone, paid android apps, Paid android apps free on Google Play Store, Paid Android apps temporarly FREE on Google Play Store, photo editing apps

మీ Android phone కోసం బెస్ట్ స్క్రీన్ షాట్ అప్లికేషన్స్ ఇవి!

by

best screenshot apps for android phone

Android phoneలలో స్క్రీన్ షాట్ తీసి సదుపాయం అంతర్గతగానే ఉంటుంది. అయితే అందులో పరిమితమైన సదుపాయాలు మాత్రమే లభిస్తాయి. ఈ నేపథ్యంలో screenshotలకు మరిన్ని ఫీచర్స్ పొందటం కోసం అందుబాటులో ఉన్న వివిధ రకాల అప్లికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Screenshot Touch

స్క్రీన్ షాట్ ల కోసం ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దబడిన అప్లికేషన్ ఇది. ఎల్లప్పుడు అందుబాటులో ఉండే విధంగా కూడా దీన్ని అమర్చుకోవచ్చు. తీయబడిన ఫోటోని క్రాప్ చేయడం, పొడవాటి స్క్రీన్ షాట్ లు తీయడం కోసం స్క్రోలింగ్ సదుపాయం, వెబ్ పేజి మొత్తాన్ని క్యాప్చర్ చేసుకునే సదుపాయం, స్క్రీన్ రికార్డింగ్ వంటి అనేక ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. ఫోన్ షేక్ చేయటం ద్వారా స్క్రీన్ షాట్ తీయబడే విధంగా చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ లింక్ నుండి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Screen Master

ఇది కూడా అనేక శక్తివంతమైన స్క్రీన్షాట్ సదుపాయాలు కలిగి ఉంటుంది. స్క్రీన్ షాట్ మీద మీకు నచ్చిన విధంగా రాసుకునే వెసులుబాటు, వెబ్ పేజీ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకునే అవకాశం, వేగంగా ఉపయోగించడం కోసం ఫ్లోటింగ్ బటన్, ఫోన్ షేక్ చేసి వెంటనే స్క్రీన్షాట్ పొందే సదుపాయం దీంట్లో లభిస్తుంటాయి. ఈ లింకు నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Firefox Screenshot Go Beta

Firefoxని తయారు చేసిన మొజిల్లా సంస్థ విడుదల చేసిన స్క్రీన్షాట్ అప్లికేషన్ ఇది. కేవలం స్క్రీన్ షాట్ తీయడం మాత్రమే కాకుండా, ఆల్రెడీ తీసిన వాటిని ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా సమర్థవంతంగా ఆర్గనైజ్ చేయడం కోసం ఇది పనికి వస్తుంది. అలాగే తీయబడిన స్క్రీన్షాట్ నుండి టెక్స్ట్ వెలికితీసే సదుపాయం కూడా దీంట్లో లభిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ లింకు నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పైన చెప్పబడిన అప్లికేషన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఫోన్ లోను ఆధారంగా ఉండే Google Assistant గానీ, Samsung ఫోన్లలో ఉండే Bixby సదుపాయం ద్వారా గానీ చాలా సులభంగా స్క్రీన్షాట్స్ తీయొచ్చు. అలాగే వాటికి సంబంధించిన అనేక అదనపు సదుపాయాలు కూడా లభిస్తుంటాయి.

Filed Under: How-To Guide Tagged With: android apps, best screenshot apps for android phone, interesting apps, screenshot app

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 21
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in