• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

android phone

ఈ 21 appsలో ఏదైనా మీ phoneలో ఉంటే అర్జెంటుగా తొలగించండి!

by

dangerous Android app on Google Play Store

Android ఆపరేటింగ్ సిస్టం సంబందించిన గూగుల్ ప్లే స్టోర్ లో సెక్యూరిటీ విషయంలో గూగుల్ సంస్థ ఎప్పటికప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, గూగుల్ కళ్లుగప్పి అనేక ప్రమాదకరమైన అప్లికేషన్స్ వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ సెక్యూరిటీ సంస్థలు వీటి గురించి సమాచారం అందిస్తూ ఉంటాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ Anti-virus సంస్థ Avast గూగుల్ ప్లే స్టోర్ ఇంతకాలం అందుబాటులో ఉన్న 21 ప్రమాదకరమైన అప్లికేషన్స్ గురించి వినియోగదారులను హెచ్చరించింది. వాటిలో అంతర్గతంగా ట్రోజన్ నిక్షిప్తం చేయబడినట్లుగా ఆ సంస్థ అలర్ట్ చేసింది. వీటిలో 19 అప్లికేషన్లను ఇప్పటికే గూగుల్ సంస్థ నిషేధించే ఆలోచనలో ఉంది. అయినప్పటికీ ఒకవేళ ఇప్పటికే సంబంధిత అప్లికేషన్లు మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉన్నట్లయితే రెండో ఆలోచన లేకుండా తొలగించండి. అవేంటో ఇక్కడ చూద్ధాం.

Shoot Them, Crush Car, Rolling Scroll, Helicopter Attack – NEW, Assassin Legend – 2020 NEW, Helicopter Shoot, Regby Pass, Flying Skateboard, Iron it, Shooting Run, Plant Monster, Find Hidden, Find 5 Differences – 2020 NEW, Rotate Shape, Jump Jump, Find the Differences – Puzzle Game, Sway Man, Money Destroyer, Desert Against, Cream Trip – NEW, Props Rescue

వీటిలో అధిక భాగం ఆండ్రాయిడ్ గేమ్స్. కాబట్టి వీటిలో వేటినైనా మీరు గానీ మీ పిల్లలు గానీ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వాటిని తొలగించండి. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లో విధించబడిన ప్రైవసీ కంట్రోల్స్ అన్నిటిని బైపాస్ చేసి వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తూ ఉన్నాయి. ఆ సమాచారాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్తులు మీకు వల పన్నే ప్రమాదముంటుంది.

Filed Under: How-To Guide Tagged With: android apps, android phone, dangerous Android app on Google Play Store, phone apps, smartphone security

ఈ Paid Android Apps ఈ రోజు FREEగా డౌన్లోడ్ చేసుకోవచ్చు!

by

Paid Android apps temporarly FREE on Google Play Store

ఎప్పటికప్పుడు అనేక విలువైన Paid Android Appsని FREEగా download చేసుకునే మార్గాలను ” కంప్యూటర్ ఎరా” మీకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ రోజు ఫ్రీగా లభిస్తున్న కొన్ని పెయిడ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.

Resize Me!Pro

100 రూపాయల విలువ కలిగిన ఈ యాప్ కొంత సమయం పాటు ఫ్రీగా లభిస్తుంది. దీని ద్వారా మీ ఫోన్లో ఉన్న ఫోటోలను కావలసిన పరిమాణంలో కి సులభంగా రీసైజ్ చేసుకోవచ్చు. అలాగే ఆయా ఫోటోల్లో అంతర్గతంగా ఉన్న EXIT డేటాని అలాగే ఉంచవచ్చు. పెద్దగా క్వాలిటీ నష్టపోకుండా మీకు నచ్చిన పరిమాణంలో ఫోటోలను పొందొచ్చు. అలాగే ఫోటోల మీద వాటర్ మార్క్ జత చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. Google Play Storeలో ఈ లింకు నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Sketch Me! Pro

95 రూపాయల విలువ కలిగిన అప్లికేషన్ కొంత సమయం పాటు ఉచితంగా లభిస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా మీ ఫోన్ లో ఉన్న ఫోటోలను డ్రాయింగ్, కార్టూన్, స్కెచ్ ఇమేజెస్‌గా పొందొచ్చు. అలా కన్వర్ట్ చేయబడిన ఇమేజ్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఇంట్లో భారీ మొత్తంలో ఎఫెక్ట్ లభిస్తున్నాయి. కాంట్రాక్ట్, బ్రైట్నెస్, శాట్యురేషన్ ఒంటి సెట్టింగ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. Google Play Storeలో ఈ లింకు నుండి దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TypeIt Pro

ఇది 70 రూపాయల విలువ కలిగిన అప్లికేషన్. ప్రస్తుతం దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోటోల మీద కావలసిన విధంగా టెక్స్ట్, వాటర్ మార్కులను జత చేసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఫాంట్, కలర్, ఒపాసిటీ వంటి పలురకాల సెట్టింగ్స్ దీంట్లో చేసుకోవచ్చు. ఒకేసారి భారీ మొత్తంలో ఇమేజ్లను బ్యాచ్ మోడ్లో ప్రాసెస్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ లింక్ నుండి ఈ అప్లికేషన్ ఉచితంగా లభిస్తుంది.

Gif Me!

పూర్తిస్థాయిలో వీడియో కాకుండా కేవలం ఒక ఇంపార్టెంట్ దృశ్యాన్ని GIF యానిమేషన్ రూపంలో రికార్డు చేసుకొని దానిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం కోసం ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. 95 రూపాయలు విలువ కలిగిన ఈ అప్లికేషన్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ఈ లింకులో ఉచితంగా లభిస్తుంది. యానిమేషన్ లకు టెక్స్ట్, బోర్డర్ లు, స్టిక్కర్లు కూడా జత చేయవచ్చు.

Filed Under: Tech News Tagged With: android apps, android phone, paid android apps, Paid android apps free on Google Play Store, Paid Android apps temporarly FREE on Google Play Store, photo editing apps

Android Phone వాడుతున్నారా? ఒక సూపర్ ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్

by

Google sound notifications android

Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లు వాడే వినియోగదారుల కోసం Google ఈ సంస్థ తాజాగా ఒక అద్భుతమైన సదుపాయం తీసుకొచ్చింది.

మీ Android phoneని పక్కనబెట్టి మీరు పని చేసుకునే సమయంలో మీ పరిసరాల్లో వినిపించే రకరకాల శబ్దాలను ఇది మీకు తెలియకుండా క్యాప్చర్ చేసి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వినిపిస్తుంది. Google సంస్థ చాలా కాలం నుండి అందిస్తున్న Live Transcribe అనే అప్లికేషన్ ద్వారా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. ఉదాహరణకు మీ ఇంటి డోర్ బెల్ మోగినా, మీ ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నా, లేదా బయట కుక్క అరుస్తున్నా, బాత్రూమ్‌లో నీరు లీక్ అవుతున్నా ఆ శబ్దాలను ఈ సదుపాయం పసిగడుతుంది.

వాటికి సంబంధించిన సమాచారాన్ని మీకు మీ ఫోన్ మీద నోటిఫికేషన్ల రూపంలో చూపిస్తుంది. ప్రస్తుతానికి Google Pixel phoneలలోని Live Transcribe సదుపాయం ద్వారా లభిస్తున్న ఈ ఫీచర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు వాడుతున్న ఫోన్ లోకి కూడా Live Transcribe అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా పొందొచ్చు. అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా దశలవారీగా అందించబడుతుంది. ఇప్పటికే Live Transcribe వాడుతున్న వారికి కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

మెషిన్ లెర్నింగ్ ఆధారంగా ఈ సౌండ్ నోటిఫికేషన్ సదుపాయం పనిచేస్తుంది. మీ ఫోన్ లో ఉండే మైక్రోఫోన్ ద్వారా రిసీవ్ చేసుకునే పది విభిన్నమైన శబ్దాలను ఇది గుర్తిస్తుంది. కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే కాదు ఒకవేళ మీరు Android Wear ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ వాచ్ లాంటిది ఏదైనా వాడుతున్నా కూడా దాని మీద కూడా మీకు నోటిఫికేషన్ చూపించబడుతుంది.

పని ఒత్తిడిలో ఉండి గానీ, ఇతర కారణాల వల్ల గానీ మీ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి పరిశీలించడం సాధ్యం కాని సందర్భాలలో ఈ సరికొత్త సదుపాయం

Filed Under: Tech News Tagged With: android new feature, android phone, google android, google live transcribe, Google sound notifications android

ఈ పెయిడ్ Android Apps ఈరోజు కొన్ని గంటల పాటు FREEగా డౌన్లోడ్ చేసుకోండి!

by

download paid android apps temporarly free

Google Play Storeలో శక్తివంతమైన సదుపాయాలు కలిగిన ఎన్నో paid Android Apps ఉంటాయి. అయితే వాటిలో కొన్ని అప్పుడప్పుడు FREEగా కూడా డౌన్ లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. అలాంటి కొన్ని అప్లికేషన్స్ ఇక్కడ చూద్దాం. వీటిని వీలైనంత త్వరగా డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మళ్లీ అమౌంట్ పే చేయాలి.

Fast VPN

290 రూపాయల విలువ కలిగిన ఈ అప్లికేషన్ మీకు మరింత సెక్యూరిటీ కల్పించడంతోపాటు, బ్లాక్ చేయబడిన సైట్లను యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంట్రీలను దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ లింకు నుండి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Meeting Notes

199 రూపాయల విలువ కలిగిన ఈ అప్లికేషన్ తాత్కాలికంగా ఫ్రీగా లభిస్తుంది. అనేకరకాల మీటింగ్స్ లో పాల్గొన్నప్పుడు దీని ద్వారా ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మీటింగ్ సమయంలో మెమోలు కూడా రాసుకోవచ్చు. నోట్ చేసుకున్న నోట్స్ ని ఇతరులతో సులభంగా షేర్ చేసుకోవచ్చు. పైకి కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అయ్యే వాయిస్ రికార్డర్, నాయిస్ రిడక్షన్ ఫిల్టర్ వంటి వివిధ రకాల సదుపాయాలు దీంట్లో ఉంటాయి. Google Play Storeలో ఈ లింకు నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Cuticon Squircle – Icon Pack

మీ ఫోన్ లో Nova Launcher గానీ, ఇతర థర్డ్-పార్టీ లాంఛర్లని గాని ఉపయోగిస్తూ ఉన్నట్లయితే, వివిధ అప్లికేషన్ల కు సంబంధించిన ఐకాన్లని ఆకర్షణీయంగా తయారు చేసుకోవడానికి ఉపయోగపడే ఐకాన్ ప్యాక్ ఇది. 120 రూపాయల విలువ కలిగిన ఈ ఐకాన్ ప్యాక్‌ని తాత్కాలికంగా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ లింకులో లభిస్తుంది ఇది.

Subnet Calculator

180 రూపాయల విలువ కలిగిన ఈ అప్లికేషన్ తాత్కాలికంగా ఉచితంగా లభిస్తుంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ లకు ఉపయోగపడే అద్భుతమైన అప్లికేషన్ ఇది. IP Subnet, FLSM కాలిక్యులేటర్ ఇది. వివిధ రకాల నెట్వర్క్ సర్టిఫికేషన్లు చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ లింకు నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Filed Under: Tech News Tagged With: android phone, download paid android apps temporarly free, free android Apps, paid android apps, temporarly free android paid apps google play store

Google Play Storeకి పోటీగా ప్రత్యేకమైన అప్లికేషన్ స్టోర్ తీసుకొచ్చిన Paytm

by

Paytm mini app store google play store

ఇటీవల IPL ఆధారంగా తమ యాంటీ-గ్యాంబ్లింగ్ విధానాలకు విరుద్ధంగా స్కీమ్ రన్ చేస్తోంది అంటూ కొంత సమయం పాటు Paytm అప్లికేషన్ ని Google Play Store నుండి తొలగించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో Google సంస్థ మీద రగిలిపోతున్న Paytm సంస్థ వేగంగా పావులు కలిపి ఇటీవల భారతీయ అప్లికేషన్ల కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ స్టోర్ ఉండాలి అంటూ, అనేక స్టార్టప్‌తో ఓ ఆన్లైన్ మీటింగ్ కూడా నిర్వహించింది. కొద్దిరోజులు తిరక్కుండానే తాజాగా అనేక భారతీయ అప్లికేషన్ లతో కూడిన ఒక మినీ అప్లికేషన్ స్టోర్‌ని ఆ సంస్థ ప్రారంభించింది. తమ ఉత్పత్తులను కష్టమర్ దగ్గరకు చేర్చడం కోసం ఈ మినీ-యాప్ స్టోర్ స్టార్టప్ కంపెనీలకు ఉపయుక్తంగా ఉంటుందని Paytm చెబుతోంది.

Decathlon, Ola Rapido, Netmeds, 1MG, Domino’s Pizza, FreshMenu, NoBroker వంటి మొత్తం 300 అప్లికేషన్లకు పైగా ఈ మినీ అప్లికేషన్ స్టోర్ లో చేరటం జరిగిందని Paytm చెబుతోంది. గూగుల్ సంస్థ వచ్చే సంవత్సరం నుండి గూగుల్ ప్లే స్టోర్ లో విక్రయించబడే అన్ని డిజిటల్ గూడ్స్ అమ్మకాల మీద 30 శాతం పన్నుని డెవలపర్లు తప్పనిసరిగా చెల్లించాలని నియమం పెట్టడం కూడా ఈ తాజా పరిణామానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం Mobile Seva App store పేరుతో అన్ని రకాల ప్రభుత్వ అప్లికేషన్లు తప్పనిసరిగా ప్రతీ Anroid, iOS ఫోన్లోనూ ఉండేవిధంగా సన్నాహాలు చేస్తోంది. Android 12 ఆపరేటింగ్ సిస్టం నుండి థర్డ్-పార్టీ యాప్ స్టోర్లని Android phoneలలో ఉపయోగించుకునే వెసలుబాటు మరింత సులభతరం చేస్తామని గూగుల్ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ఇలా కొత్త కొత్త app storeలకు శ్రీకారం చుట్టబడడం ఆండ్రాయిడ్ యూజర్లు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే థర్డ్-పార్టీ యాప్ స్టోర్లని నిర్వహించడం పెద్ద కష్టమైన విషయం కాదు గానీ, అందులో హోస్ట్ చెయ్యబడే apps, games యూజర్ల సెక్యూరిటీ మరియు ప్రైవసీ కాపాడే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం.

Filed Under: Tech News Tagged With: android apps, android games, android phone, google play store, indan apps, paytm app store, Paytm mini app store google play store

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 19
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in