
ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అవుతున్న చైనా phone తయారీ కంపెనీ Gionee అనైతిక కార్యకలాపాలకు పాల్పడింది. మంచి వ్యాప్తంగా డిసెంబర్ 2018 నుంచి అక్టోబర్ 2019 మధ్యకాలంలో అమ్మిన 20 మిలియన్ స్మార్ట్ఫోన్లలో malwareని నిక్షిప్తం చేసినట్లుగా నిరూపితమైంది. దీనికి సంబంధించి కోర్టు లో కేసు కూడా వేయబడింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, Gionee సంస్థ అమ్మిన భారీ మొత్తంలో ఫోన్లలో ఒక అప్లికేషన్ రూపంలో ట్రోజన్ హార్స్ నిక్షిప్తం చేయబడింది. అసాంఘిక మార్గాల్లో వినియోగదారుల ఫోన్ల నుండి ప్రయోజనం పొందటానికి ఆ సంస్థ ఈ పన్నాగం పన్నింది. Gionee phoneలలో లభిస్తున్న Story Lock Screen appకి ఒక అప్డేట్ రూపంలో, Dark horse platform అనే ప్లగ్‌ఇన్ ద్వారా ఈ ట్రోజన్ హార్స్ యూజర్ల ఫోన్లలోకి ప్రవేశపెట్టబడింది.
వినియోగదారులకు ఏమాత్రం తెలియకుండానే వారి ఫోన్ లోకి ఈ అప్డేట్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో ఆ సంస్థకు భారతీయ కరెన్సీ ప్రకారం 22 లక్షల 57 వేల రూపాయలు జరిమానా విధించబడుతుంది.
అధిక శాతం తయారీ కంపెనీలు ఈ మధ్యకాలంలో తాము విడుదల చేసే ఫోన్లను తక్కువ ధరకు విక్రయిస్తూ, అందులో వినియోగదారులకు తెలియకుండా వివిధ రకాల ఫ్రేమ్‌వర్క్‌లను ఇన్స్టాల్ చేయటం, డయాగ్నస్టిక్ ప్రోగ్రామ్స్ ద్వారా యూజర్లకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించి వాటిని మార్కెటింగ్ అవసరాలకోసం ఉపయోగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి.
వీటన్నిటిని సమర్థవంతంగా అడ్డుకోవాలంటే గనక కచ్చితంగా యూజర్ల ప్రైవసీని మరియు సెక్యూరిటీని కాపాడకపోతే భారీ మొత్తంలో జరిమానా విధించే విధంగా చట్టాలు పటిష్టం కావాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి ప్రయత్నాలు ముందు ముందు కూడా కొనసాగే ప్రమాదం ఉంది.