• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

android tips

మీ Android phoneలో డిలీట్ అయిన డేటా తిరిగి పొందటానికి మెథడ్స్

by

How to recover deleted android photos and videos

Android phone వాడుతున్నారా? పొరపాటున ముఖ్యమైన ఫోటో లేదా వీడియో డిలీట్ అయిందా? అయితే దాన్ని సులభంగా రికవర్ చేయడానికి అందుబాటులో ఉన్న వివిధ పద్ధతులు ఇక్కడ చూద్దాం.

రీసైకిల్ బిన్ పరిశీలించండి

ఇటీవలికాలంలో Samsung, ఇతర సంస్థలకు చెందిన కొన్ని smartphoneలలో అంతర్గతంగా ఉండే గ్యాలరీ అప్లికేషన్లో Recycle Bin అనే ఆప్షన్ కల్పించబడి ఉంటోంది. ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసినప్పుడు అవి శాశ్వతంగా డిలీట్ అవ్వకుండా, ఈ రీసైకిల్ బిన్‌లోకి వెళతాయి. కాబట్టి ఇతర డేటా రికవరీ పద్ధతులు ప్రయత్నించ బోయే ముందు Recycle Binలో మీరు డిలీట్ చేసిన ఫైల్స్ కనిపిస్తున్నాయేమో పరిశీలించి వాటిని తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. అయితే ఒకవేళ మీరు రీసైకిల్ బిన్ డిజేబుల్ చేసినట్లయితే చేయగలిగిందేమీ లేదు.

Cloud backup

Google Photos వంటి అప్లికేషన్ ఏదైనా మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉన్నట్లయితే, కొన్ని సందర్భాలలో ముఖ్యమైన ఫోటోలు మరియు వీడియోలు ఆటోమేటిక్ గా దాంట్లోకి బ్యాకప్ అవుతాయి కాబట్టి, అదృష్టవశాత్తూ అవి అక్కడ ఉంటే వాటిని రికవర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే మీరు అక్కడ కూడా వాటిని డిలీట్ చేసినట్టయితే చేయగలిగిందేమీ లేదు.

వాట్సప్ ఫోటోల విషయంలో

మీ స్నేహితులు ఎవరైనా కొద్ది రోజుల క్రితం పంపించిన ముఖ్యమైన వాట్స్అప్ ఫోటో లేదా వీడియో పొరబాటున డిలీట్ చేసినట్లైతే, ఒక చిన్న టెక్నిక్ ద్వారా దాన్ని రికవర్ చేసుకునే అవకాశం ఉంది. మీ ఫోన్లో లోకల్ గా గానీ, గూగుల్ డ్రైవ్ లో గానీ వాట్సప్ బ్యాకప్ ప్రతీరోజూ అవుతున్నట్లు అయితే, మీ ఫోన్లో వాట్స్అప్ అప్లికేషన్ తొలగించి, మళ్లీ ఇన్స్టాల్ చేసే సమయంలో chat backup restore చేయడం ద్వారా ఇంతకుముందు పోయిన ముఖ్యమైన ఫోటో లేదా వీడియోని తిరిగి పొందవచ్చు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాలలో బ్యాక్అప్ ఇంటిగ్రిటీ దెబ్బతిని ఉండటం వల్ల ఈ ప్రయత్నం వైఫల్యం చెందవచ్చు.

ఆండ్రాయిడ్ డేటా రికవరీ ఆప్స్

అన్నిటికంటే సమర్ధవంతంగా పని చేసే టెక్నిక్ Windows కంప్యూటర్ల కోసం అందుబాటులో ఉన్న వివిధ డేటా రికవరీ అప్లికేషన్ లను సంబంధిత కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి, డేటా కేబుల్ ద్వారా మీ ఫోన్‌ని ఆ పిసికి కనెక్ట్ చేసి డేటా రికవరీ ప్రయత్నించవచ్చు. అయితే ఇలాంటి డేటా రికవరీ అప్లికేషన్లు ప్రధానంగా మెమరీ కార్డు లో డేటాని సమర్థవంతంగా రికవర్ చేయగలుగుతాయి. ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉండే డేటాని ఫోన్ రూట్ చేస్తే తప్పించి రికవర్ చెయ్యలేవు. అయినా కూడా కొన్ని సార్లు డేటా వెనక్కి రాదు. ముఖ్యమైన డేటా ఉంటే అన్ని రకాలుగా ప్రయత్నించడమే. Recuva, Android Data Recocvery వంటి టూల్స్‌ని దీని కోసం ఉపయోగించవచ్చు.

Google Play Storeలో నేరుగా ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకో కలిగే కొన్ని డేటా రికవరీ టూల్స్ ఉన్నప్పటికీ, అవి పెద్దగా ఫలితం ఇవ్వవు.

Filed Under: How-To Guide Tagged With: android data recovery, android tips, How to recover deleted android photos and videos, phone data recovery, recover deleted photos

Realme phone వాడుతున్నారా? మీ phoneలో కొన్ని యాప్స్ కనిపించకుండా దాచుకోవడం ఇలా!

by

how to hide apps on realme phone

Realme smartphone వాడేవారికి ఆండ్రాయిడ్ కస్టమైజేషన్ లో భాగంగా అనేక శక్తివంతమైన సదుపాయాలు లభిస్తుంటాయి. ముఖంలో ఎలాంటి థర్డ్-పార్టీ లాంఛర్ వాడాల్సిన పని లేకుండానే మీ phoneలో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్లలో కొన్ని అప్లికేషన్స్ ఇతరులకు కనిపించకుండా దాచి పెట్టుకోవచ్చు.

ఈ సదుపాయం కోసం Realme phoneలలో App Lock అనే ఫీచర్ పొందుపరచబడింది. మీ హోమ్ స్క్రీన్‌ని వీలైనంత శుభ్రంగా ఉంచడం కోసం అందించబడిన ఫీచర్ ఇది. దీని ద్వారా అవాంఛిత అప్లికేషన్స్, మీరు ప్రైవసీ కోరుకునే అప్లికేషన్స్ ఇతరులకు కనిపించకుండా దాచి పెట్టుకోవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా సింపుల్!

మీ దగ్గర ఉన్న Realme phoneలో Settingsలోకి వెళ్లండి. అందులో Security > App Lock అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు పాస్ కోడ్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత Hide Home screen ఐకాన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, స్క్రీన్ మీద చూపించబడే అప్లికేషన్స్ జాబితా నుండి ఏ అప్లికేషన్స్ అయితే హోమ్ స్క్రీన్ లో కనిపించకుండా దాచిపెట్టాలని అనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత phone screen మీద రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు దాచిపెట్టాలి అనుకుంటున్న అప్లికేషన్లని Recent tasks, Notifications విభాగం నుండి కూడా దాచి పెట్టే విధంగా ఇది అవకాశం కల్పిస్తుంది. మీ అవసరాన్ని బట్టి ఆ రెండు ఆప్షన్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. వీటిని సెలెక్ట్ చేస్తే గనుక ఆయా అప్లికేషన్స్ నోటిఫికేషన్స్ కూడా డిజేబుల్ చేయబడతాయి. ప్రైవసీ కారణాలవల్ల మీ ఫోన్ లో ఉన్న ఏమైనా అప్లికేషన్స్ స్క్రీన్ మీద కనిపించకుండా, ఎవరు పడితే వారు వాటిని ఓపెన్ చేయకుండా రక్షించుకోవడం కోసం Realme phoneలలో పొందు పరచబడిన ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది.

Filed Under: How-To Guide Tagged With: android tips, hide apps on phone, how to hide apps on realme phone, realme phone, smartphone apps

మీ phoneలో నోట్స్ రాసుకోవడానికి 5 సూపర్ యాప్స్!

by

5 powerful note taking apps for Android

రకరకాల సందర్భాల్లో ముఖ్యమైన నోట్స్ రాసుకోవడానికి Android యూజర్ల కోసం అనేక శక్తివంతమైన అప్లికేషన్స్ లభిస్తున్నాయి. వాటి వివరాలు ఇక్కడ చూద్దాం.

Google Keep

గూగుల్ సంస్థకు చెందిన ఉచిత అప్లికేషన్ ఇది. ఎప్పటికప్పుడు మీరు రాసుకున్న నోట్స్ క్లౌడ్ బ్యాకప్ తీయబడుతుంది. చాలా సులభమైన యూజర్ ఇంటర్ఫేస్ కలిగి ఉండి చేయాల్సిన పనుల కోసం to do listలను తయారు చేసుకోవడం, ఫోటోలు సేవ్ చేసుకోవడం, వాయిస్ మెమోలు రికార్డ్ చేసుకోవడం వంటి ఎన్నో రకాల ఆప్షన్స్ ఇది అందిస్తుంది. Google Play Storeలో ఈ లింకు నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Color Note

ఇది కూడా ఉచితంగా లభించే అప్లికేషన్. రకరకాల నోట్స్ కి రకరకాల రంగులు అప్లై చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎల్లప్పుడు అందుబాటులో ఉండే విధంగా చిన్న sticky notes మీ హోమ్స్క్రీన్ లో అమర్చుకోవచ్చు. మీరు రాసుకున్న నోట్స్ ఇతరులు చూడకుండా పాస్వర్డ్ లాక్ చేసుకోవచ్చు. ఈ లింక్ నుండి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Evernote

ఇది ఉచిత మరియు పెయిడ్ వెర్షన్‌గా లభిస్తుంది. దీంట్లో అజెండాలు క్రియేట్ చేసుకోవచ్చు, బిజినెస్ ప్లాన్స్, జర్నల్స్, నోట్స్, మెమోస్ వంటి అన్ని రకాల కంటెంట్ సేవ్ చేసుకోవచ్చు. అలా సేవ్ చేసుకున్న నోట్స్ మీ టీం తో షేర్ చేసుకోవచ్చు. నోట్స్‌తో పాటు డాక్యుమెంట్స్, పిడిఎఫ్‌లు, ఫోటోలు, ఆడియో ఫైల్స్ వంటి అన్నిటినీ జత చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ లింక్ నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Microsoft OneNote

మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన అనేక సర్వీసులతో ఇది అంతర్గతంగా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకొని కూడా ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. నోట్స్ రాసుకోవడం, ఏమైనా డ్రాయింగ్స్ చేసుకోవటం, ముఖ్యమైన సమాచారాన్ని క్లిప్ చేసుకోవడం, అలాగే డాక్యుమెంట్లు మరియు బిజినెస్ కార్డులను నేరుగా వన్ డ్రైవ్ లోకి స్కాన్ చేసుకోవడం, నోట్స్‌కి ఫోటోలు జత చేసుకోవడం వంటి అనేక రకాల పనులను ఈ అప్లికేషన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఈ లింకు నుండి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Sticky Notes

ఇది కూడా ఫ్రీ మరియు పెయిడ్ వెర్షన్ లభిస్తూ ఉంటుంది. ముఖ్యమైన నోట్స్ మొత్తాన్ని sticky notes రూపంలో ఇది సేవ్ చేసి పెడుతుంది. sticky notes వాడటం బాగా అలవాటు ఉన్నవారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి కొద్దిగా అలవాటు పడటానికి సమయం పడుతుంది. ముఖ్యమైన నోట్స్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఇది కల్పిస్తుంది. ఈ లింకు నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Filed Under: How-To Guide Tagged With: 5 powerful note taking apps for Android, android apps, android phone, android tips, note taking apps

ఈ 5 టిప్స్ ఫాలో అయితే మీ phone సూపర్ ఫాస్ట్ పనిచేస్తుంది!

by

5 tips to speedup your android smartphone

Android phone వాడుతున్నారా? ఇప్పుడు పని చేస్తున్న దాని కంటే మీ ఫోన్ మరింత వేగంగా పని చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. కచ్చితంగా మీ ఫోన్ మునుపటి కంటే వేగంగా ఉన్నట్లు మీరే గుర్తించగలుగుతారు.

ఈ యాప్ వాడండి

Google సంస్థ స్వయంగా తయారు చేసిన Files by Google అప్లికేషన్ ఉపయోగించడం ద్వారా మీ ఫోన్ లో వివిధ అప్లికేషన్స్ క్రియేట్ చేసిన cacheని క్లియర్ చెయ్యడంతోపాటు, అనవసరంగా పేరుకుపోయిన ఫైళ్లు మరియు ఫోల్డర్లను తొలగించి తగినంత ఖాళీ స్థలం ఎప్పటికప్పుడు ఉండే విధంగా చేయండి. కచ్చితంగా ఫోన్ పని తీరులో చాలా మార్పు వస్తుంది.

చాలాకాలంగా వాడనివి!

ప్రతీ ఒక్కరూ తమ phoneలో భారీ మొత్తంలో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకొని, చాలా రోజుల తరబడి వాటి జోలికి వెళ్లరు. ఇలా మీ ఫోన్లో అనవసరంగా ఏమైనా అప్లికేషన్స్ ఉన్నట్లయితే కనీసం నెల రోజులకు ఒకసారి గుర్తించి వాటిని వెంటనే ఫోన్ నుండి తొలగించండి. దీనివలన మీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న అనేక ప్రాసెస్‌లు నిలిచిపోయి పరోక్షంగా ఫోన్ వేగవంతమవుతుంది.

లైట్ వెయిట్ వెర్షన్లు

Facebook, Twitter, Gmail వంటి దాదాపు ప్రతి అప్లికేషన్‌కి ఓ లైట్ వెయిట్ వెర్షన్ Google Play Storeలో లభిస్తూ ఉంటుంది. అలాంటి వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కచ్చితంగా మెమరీ వినియోగం బాగా తగ్గి, ఫోన్ మునుపటి కంటే వేగంగా రెస్పాండ్ అవుతుంది. ఇలా లైట్ వెయిట్ వెర్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీరు పెద్దగా కోల్పోయేది కూడా ఏమీ ఉండదు. దాదాపు అన్ని ఆప్షన్స్ పూర్తిస్థాయి వెర్షన్‌లో ఎలా ఉంటాయో అదేవిధంగా లైట్ వెయిట్ వెర్షన్‌లోనూ లభిస్తుంటాయి.

లేటెస్ట్ అప్డేట్స్

మీ ఫోన్ కి ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అశ్రద్ధ చేయకుండా ఇంస్టాల్ చేసుకోండి. దీనివల్ల ఆపరేటింగ్ సిస్టం లో, మరియు వివిధ అప్లికేషన్స్‌లో ఉన్న లోపాలు సరి చేయబడి ఫోన్ పని తీరులో మరింత మెరుగుదల కనిపిస్తుంది.

హోమ్ స్క్రీన్‌లో!

చాలామంది తమ phoneలో Home screenలో కల్పి కనిపించిన అన్ని షార్ట్ కట్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొత్తగా ఫోన్లో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్లు కూడా మన అనుమతి లేకుండానే వాటి షార్ట్కట్స్ ఫోన్ హోమ్ స్క్రీన్ లో అమర్చుతూ ఉంటాయి. హోమ్ స్క్రీన్ ఇలా పూర్తిగా నిండిపోయి గందరగోళంగా ఉండటం వల్ల దాని ప్రభావం ఫోన్ రెస్పాన్స్ మీద కూడా పడుతుంది. కాబట్టి అతి ముఖ్యమైన షార్ట్కట్స్ మాత్రమే హోమ్ స్క్రీన్ లో ఉండే విధంగా అమర్చుకోండి.

Filed Under: How-To Guide Tagged With: 5 tips to speedup your android smartphone, android phone, android tips, speedup phone

Android Phoneలో మర్చిపోయిన PIN, Pattern తొలగించడం ఇలా!

by

how to reset Android PIN and pattern

Android Phoneలను వాడేటప్పుడు ఇతరులు ఫోన్లోకి ప్రవేశించకుండా PIN, Patternలతో పాస్వర్డ్ పెట్టుకుంటారు. ఇటీవల కాలంలో ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్ లాంటివి వచ్చినా కూడా వాటి కంటే ముందు తప్పనిసరిగా PIN సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ మీరు PIN గానీ, pattern గానీ మర్చిపోతే దాన్ని రీసెట్ చేయటం ఇలా!

Android SDK ద్వారా!

how to reset Android PIN and pattern

ఈ టెక్నిక్ పనిచేయాలంటే మొట్టమొదట మీ ఫోన్ లో Developer Options గతంలో ఎనేబుల్ చేయబడి ఉండి, అందులో USB Debugging కూడా ఎనేబుల్ చేయబడి ఉండాలి. ఆ తర్వాత మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్‌లోకి Android SDKని ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు డేటా కేబుల్ సాయంతో మీ phoneని PCకి కనెక్ట్ చేయండి. ఆ తర్వాత Android SDK ఇన్స్టాల్ అయి ఉన్న ఫోల్డర్‌లోకి వెళ్లి Tools అనే ఫోల్డర్‌లోకి వెళ్లండి. అందులో ఉండగా కీబోర్డు మీద Shift కీ ప్రెస్ చేసి, మౌస్‌తో ఖాళీ ప్రదేశంలో రైట్ క్లిక్ చేసి, Open command window here అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీంతో ఒక కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఇప్పుడు అక్కడ..

ADB shell rm /data/system/gesture.key అనే కమాండ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొత్తం విజయవంతంగా పూర్తయితే, ఆ తర్వాత డేటా కేబుల్ తొలగించి మీ ఫోన్ రీస్టార్ట్ చేస్తే పిన్ ఏమి అడగకుండానే లోపలికి వెళ్ళి పోతుంది.

రికవరీ మెనూ ద్వారా!

how to reset Android PIN and pattern

మనం వాడే ప్రతి Android phoneకి రికవరీ మోడ్ అని ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. మీరు వాడే ఫోన్ మోడల్ ని బట్టి దాంట్లో ఎలా వెళ్లాలో Googleలో వెదికి పట్టుకోండి. ఉదాహరణకు కొన్ని ఫోన్లలో, ఫోన్ ఆఫ్ చేయబడి ఉన్నప్పుడు Power, Volume Up బటన్లని 10 సెకన్లపాటు పట్టుకుంటే ఈ రికవరీ మోడ్ వస్తుంది. ఇప్పుడు దాంట్లో కి వెళ్లి అక్కడ స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్లను Volume Up, Volume Down కీలను అవసరాన్ని బట్టి నొక్కడం ద్వారా ఎంపిక చేసుకోవాలి. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్.. Wipe data/factory reset అనేది. Volume buttonలతో దాన్ని సెలెక్ట్ చేసుకొని, చివరిగా Power బటన్ ప్రెస్ చేస్తే ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయబడుతుంది. దాంతోపాటు పిన్ కూడా పోతుంది. అయితే ఈ పద్ధతి ద్వారా ఫోన్ లో అప్పటికే ఉన్న డేటా మొత్తం పోతుంది, మెమరీ కార్డు లో డేటా మాత్రం అలాగే ఉంటుంది.

Android Device Manager ద్వారా

how to reset Android PIN and pattern

ఈ లింకు నుండి మీ కంప్యూటర్ లో గానీ, లాప్టాప్ లో గానీ, వేరే ఫోన్ లో గానీ Android Device Managerలోకి వెళ్లండి. అక్కడ మీ గూగుల్ అకౌంట్ తో రిజిస్టర్ చేయబడి ఉన్న వివిధ రకాల డివైజ్ల వివరాలు కనిపిస్తాయి. మీరు PIN reset చేయాలనుకుంటున్న మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసుకొని Lock అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని రీసెట్ చేయొచ్చు. ఇక్కడే Erase అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంపిక చేసుకోకండి. దానివల్ల మీ ఫోన్లో డేటా మొత్తం పోతుంది.

Filed Under: How-To Guide Tagged With: android tips, phone reset, reset pattern, reset pin

  • Go to page 1
  • Go to page 2
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!
  • మీ Android phoneలో డిలీట్ అయిన డేటా తిరిగి పొందటానికి మెథడ్స్

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in