Smartphoneల విషయంలో అతి పెద్ద సమస్య బ్యాటరీ. చీటికీ మాటికీ ఇది battery ఖాళీ అవుతుంటే ఛార్జింగ్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటాం. ఇటీవల 4,000, 5000 mAhల వంటి భారీ సామర్థ్యాల్లో బ్యాటరీలు వస్తున్నా అంతకంతకూ ఫోన్లలో అమర్చబడే processorలు, RAMల సామర్థ్యం కూడా పెరుగుతున్న నేపధ్యంలో బ్యాటరీ పెరిగినా పెద్దగా ఉపయోగం ఉండట్లేదు.
సుదీర్ఘకాలంగా అందర్నీ వేధిస్తున్న battery సమస్యని పరిష్కరించడానికి మన హైదరాబాద్‌కి చెందిన “మంజీరా డిజిటల్ సిస్టమ్స్” అనే సంస్థ నడుం బిగించింది.Universal Multifunction Accelerator (UMA) అనే పరికరం ద్వారా ఈ కంపెనీ బ్యాటరీ సమస్యని అధిగమించాలని ప్రయత్నిస్తోంది.
మిల్లీమీటర్ పరిమాణంలో నాలుగవ వంతు అంటే ఎంత ఉంటుందో తెలుసు కదా. ఆ సైజ్‌లో ఉండే అత్యంత వేగవంతంగా పనిచేసే కంప్యూటింగ్ సర్క్యూట్‌ని smartphones మొదలుకుని రకరకాల తాజా gadgetsలో సులభంగా నిక్షిప్తం చేయొచ్చు. ఇది ఓ పక్క తక్కువ మొత్తంలో ఫోన్ విద్యుత్‌ని వినియోగించుకునేలా జాగ్రత్త తీసుకుంటూనే శక్తివంతమైన ఆల్షారిథమ్స్‌ని రన్ చేస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కమర్షియల్ droneలు, ఇప్పుడిప్పుడే వెల్లువలా రకరకాల పనుల్ని చేసిపెట్టడానికి ముంచుకు వస్తున్న IoT (Internet Of Things) డివైజ్‌ల వంటి వాటిలో ఈ సర్క్యూట్‌ని అమర్చితే సరిపోతుంది.
మంజీరా డిజిటల్ సిస్టమ్స్ సంస్థ ఇటీవల ISRO (Indian Space Research Organisation) నుండి ఆర్డర్‌ని పొందింది. రాడార్ సిగ్నల్ ప్రాసెసింగ్‌లో భాగంగా ఈ Universal Multifunction Accelerator (UMA) టెక్నాలజీని వాడడానికి ఈ ఆర్డర్ ఉద్దేశించబడింది. శ్రీని చందుపట్ల, వేణు కందడై అనే ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్వహిస్తున్న సంస్థ ఇది.
Smartphoneలలో, ఇతర mobile chipలలో ఈ సర్క్యూట్‌ని అమర్చడం కోసం ఈ సంస్థ Qualcomm మరియు Intel సంస్థలతో చర్చల్లో ఉంది. ఇది గనుక ఆచరణరూపం దాల్చితే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందని చీటికీ మాటికీ ఇక భయపడాల్సిన పనిలేదు. నిశ్చింతగా మన smartphoneలను వాడుకోవచ్చు. త్వరలో ఇది అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.