• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

gadgets

Mi Home Security Camera 360 ఎందుకు బెస్ట్ కెమెరా అంటే.. – డీటైల్డ్ రివ్యూ!

by

Mi Home Security Camera 360 detailed review

ఇంటి సెక్యూరిటీ కోసం చాలామంది CC Cameraలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వీటికి కనీసం కంట్రోల్ బాక్స్ తో కలిపి 30 నుంచి 50 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టాల్సిన లేకుండా తక్కువ ధరలో మరిన్ని మెరుగైన సదుపాయాలు కలిగి ఉన్నాయి Mi Home Security Camera 360ని చాలా మంది ఇప్పటికే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో దీని పనితీరు, ఇతర ఫీచర్స్ గురించి చూద్దాం. 2,899 రూపాయలు అసలు ధర కలిగిన ఈ కెమెరా ప్రస్తుతం కేవలం2,599కే https://amzn.to/3lbO4cN లింక్‌లో లభిస్తోంది.

డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ

ఇది చూడటానికి ఒక బొమ్మ లాగా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. అవసరాన్ని బట్టి కెమెరా తన యాంగిల్ మార్చుకునే విధంగా దీన్ని రూపొందించారు. కెమెరా లెన్స్ కింద microSD slot అమర్చబడి ఉంటుంది. అలాగే కెమెరా వెనక భాగంలో గుండ్రంగా ఉండే స్పీకర్ గ్రిల్ లభిస్తుంది. Reset, Micro USB portలు కెమెరా వెనక భాగంలో లభిస్తాయి. పాలికార్బోనేట్‌తో రూపొందించబడిన డివైజ్ ఇది. అందువల్ల సుదీర్ఘకాలంపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. కేవలం 239 గ్రాముల బరువు మాత్రమే ఇది ఉంటుంది. షాక్ ప్రూఫ్ అవటం వలన పొరపాటున కింద పడినా కూడా పెద్దగా ప్రమాదం ఉండదు. ఏ మాత్రం శబ్దం చేయకుండా కెమెరా దానంతట అదే మూవ్ అవుతూ ఉంటుంది.

ఇన్‌స్టలేషన్, సెటప్ ఇలా!

దీన్ని ఎక్కడైనా సులభంగా అమర్చగలిగే విధంగా స్కూలను కూడా ఇచ్చారు. వాస్తవానికి టేబుల్ మీద, ఇతర ప్రదేశాల్లో కూడా స్క్రూలతో పనిలేకుండా నేరుగా అమర్చుకోవచ్చు. మొట్టమొదట కెమెరాను పవర్ కి కనెక్ట్ చేయాలి. కెమెరాతో పాటు 5 వాట్స్ అడాప్టర్ వస్తుంది. ఆ వెంటనే లెడ్ ఇండికేటర్ వెలుగుతుంది. ఆ కెమెరా నుండి వచ్చే లైవ్ వీడియో ఫీడ్ చూడడం కోసం Xiaomi Home Appని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. iOSకి కూడా ఇది లభిస్తుంది. వినియోగదారులు తమ వైఫై క్రెడెన్షియల్స్ ఈ అప్లికేషన్ లో ఎంటర్ చేయాలి. డివైజ్ పెయిర్ అయిన తర్వాత Mi Home అప్లికేషన్లో QR Code చూపించబడుతుంది. దానిని కెమెరా ద్వారా స్కాన్ చేయాలి. ఇదంతా కూడా చాలా సులభంగా పూర్తయ్యే ప్రక్రియ.

మిగతా 2వ పేజీలో..

Pages: Page 1 Page 2

Filed Under: Gadgets Tagged With: cc camera, gadgets, latest technology, mi camera, Mi Home Security Camera 360 detailed review, smartphone

Vivo V20 SE విడుదల కాబోతోంది.. దాని స్పెసిఫికేషన్స్ ఇక్కడ!

by

Vivo V20 SE price and specifications in India

ప్రముఖ smartphone తయారీ సంస్థ Vivo తన లేటెస్ట్ మోడల్ Vivo V20 SEని భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి.

భారతీయ మార్కెట్లో 20,999 రూపాయలకు Vivo V20 SE విక్రయించబడుతుంది. 8gb ram, 128gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగివుండే మోడల్ ధర ఇది. వాస్తవానికి ప్రస్తుతం లభిస్తున్న Vivo V20 కన్నా ఈ ధర తక్కువగా ఉండటం గమనార్హం. Vivo V20 SEలో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ అమోల్డ్ డిస్ప్లే, ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం waterdrop notch లభిస్తుంటాయి. అలాగే స్క్రీన్ లోపలే అంతర్భాగంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

Vivo V20 SEలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెస్ ఉపయోగించబడి ఉంటుంది. మెమరీ కార్డు ద్వారా అదనపు స్టోరేజ్ పొందే అవకాశం లభిస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే FunTouch OS ఈ ఫోన్లో ఉపయోగించబడింది. 4100 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

Vivo V20 SE ఫోన్ వెనుక భాగంలో మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి. 41 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా తో పాటు, 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సల్ portrait lens లభిస్తాయి. సెల్ కోసం ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సల్ రిసల్యూషన్ కలిగిన కెమెరా ఉంటుంది. 4G LTE, dual-band Wi-Fi, బ్లూటూత్ 5.0, వంటి టెక్నాలజీల తో, usb type c portని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. 171 గ్రాముల బరువు తో ఇది ఉంటుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నవంబర్ చివరి నాటికి Vivo V20 Proతో కలిసి ఈ Vivo V20 SE మార్కెట్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Filed Under: Gadgets Tagged With: gadgets, new smartphone, vivo latest smartphone, Vivo V20 SE price and specifications in India, vivo V20SE

500 నుండి 5000 వేల లోపు ఉన్న ఈ gadgets ఉంటే మీ ఇల్లు Smart Home అయిపోతుంది!

by

smart home gadgets on Amazon and Flipkart

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా Smart Home gadgets వినియోగం బాగా పెరిగింది. కేవలం 500 నుండి 5000 రూపాయల మధ్య ఖర్చు పెట్టటం ద్వారా అనేక రకాల Smart Home gadgetsని మీరు సొంతం చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్ధాం.

Mi Motion Activated Night Light 2 ధర కేవలం 599 రూపాయలు. ఇది తనకు సమీపంగా 120 డిగ్రీల రేంజ్‌లో మనుషుల కదలికను గుర్తించినట్లయితే దానంతట అదే వెలుగుతుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. మెట్లు, కారిడార్ వంటి ప్రదేశాల్లో అమర్చుకోవడానికి ఇది అనుకూలం. Flipkartలో ఈ లింక్ నుండి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

TP-Link HS100 WiFi- Smart Plugని 1,599 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లగ్‌కి కనెక్ట్ చేయబడిన డివైజ్లను అమెజాన్ అలెక్స వాయిస్ అసిస్టెంట్ అధారంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఒక నిర్దిష్టమైన సమయంలో ఆయా డివైజ్ను ఆన్ ఆఫ్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఈ లింకులో ఈ స్మార్ట్ ప్లగ్ కొనుగోలు చేయవచ్చు.

Helea 10A Wi-Fi Smart Plusని కేవలం 890 రూపాయలకు Amazonలో ఈ లింక్‌లో కొనుగోలు చేయొచ్చు. దీనికి కనెక్ట్ చేయబడి ఉన్న డివైజ్లని ప్రపంచంలో ఎక్కడి నుండైనా కంట్రోల్ చేసుకోవచ్చు. అమెజాన్ అలెక్స, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ దీంట్లో ఉంటుంది. ఒక నిర్దిష్టమైన సమయంలో కనెక్ట్ చేయబడిన డివైజ్‌లు ఆటోమేటిక్గా ఆన్ లేదా ఆఫ్ చేయబడే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు.

Gadget Bite ఆటోమేటిక్ సోప్ డిస్‌పెన్సర్‌ని 1,499 రూపాయలకు కొనుగోలు చేయొచ్చు. స్మార్ట్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తూ చేతిని పెట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా సోప్‌ని బయటకు అందించే డివైజ్ ఇది. Amazonలో ఈ లింక్ లో దీన్ని కొనుగోలు చేయొచ్చు.

మీ ఇంటి సెక్యూరిటీ కోసం ఖరీదైన సీసీ కెమెరాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా వైఫై ఆధారంగా పనిచేసే CP Plus హోమ్ సెక్యూరిటీ కెమెరాను 2,163 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది 360 డిగ్రీల కోణంలో ఉన్న దృశ్యాలను క్యాప్చర్ చేస్తూ, Full HD వీడియో క్వాలిటీ అందిస్తుంది. గరిష్ఠంగా 64gb మెమరీ కార్డు సపోర్ట్ దీంట్లో ఉంటుంది. Amazonలో ఈ లింక్ లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Smarteefi 8 module square smart switch board స్విచ్ బోర్డు ద్వారా మొత్తం ఆరు స్మార్ట్ స్విచ్‌లు, రెండు స్మార్ట్ ప్లగ్‌లు లభిస్తాయి. మామూలుగా వాడే స్విచ్ బోర్డు కి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడొచ్చు. ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ ద్వారా దీనిని వైఫై ఆధారంగా కంట్రోల్ చేసుకోవచ్చు. Amazonలో దీన్ని 4,799 రూపాయలకు ఈ లింక్ లో కొనుగోలు చేయవచ్చు.

Filed Under: How-To Guide Tagged With: gadgets, security camera, smart bulb, smart camera, smart home, smart home gadgets on Amazon and Flipkart

5200 mAh బ్యాటరీతో Infinix Hot 10 ఈ రోజు రిలీజ్ అయింది.. వివరాలివి!

by

Infinix Hot 10 specifications

5200 mAh భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీతో Infinix Hot 10 ఫోన్ ఈరోజు భారతీయ మార్కెట్లో విడుదల చేయబడింది. ₹9999 కు దీనిని కొనుగోలు చేయవచ్చు.

Infinix Hot 10 ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం punch-hole ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే నాలుగు కెమెరాలు ఫోన్ వెనుక భాగంలో ఉంటాయి. 6 జి బి రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న ఫోన్ ఇది. అక్టోబర్ 16 వ తేదీ నుండి Flipkartలో ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి.

Infinix Hot 10 స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే 6.78 అంగుళాల HD+ డిస్ప్లే‌ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. 20.5:9 aspect ratioతో దీని డిజైన్ ఉంటుంది. మీడియా టెక్ హీలియో G70 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. గేమింగ్ కోసం ఉపయోగపడే విధంగా దీంట్లో హైపర్ ఇంజిన్ గేమ్ టెక్నాలజీ లభిస్తుంది.

Infinix Hot 10 కెమెరాల విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో కెమెరాల కోసం ప్రత్యేకంగా అమరిక ఉంటుంది. దీంట్లో మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి. ఇంత తక్కువ ధర కలిగిన ఫోన్ లో నాలుగు కెమెరాలు ఉండటం చాలా అరుదు! వీటిలో ప్రైమరీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే 16 మెగా పిక్సల్ సెన్సార్. ఇది f/1.85 apertureని అందిస్తుంది. మాక్రో కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు కూడా ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా f/2.0 apertureతో అందించబడింది. 5200 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ, డిటిఎస్ ఆడియో సపోర్ట్, సూపర్ నైట్ మోడ్ వంటి ఇతర సదుపాయాలు దీంట్లో ఉంటాయి.

Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే XOS 7.0 ఈ ఫోన్లో ఉపయోగించబడింది.

Filed Under: Gadgets Tagged With: flipkart sale, gadgets, Infinix Hot 10 specifications, infinix phone, new phone release, new smartphone

Reliance Jio తీసుకు రాబోతున్న చవక Android Phoneల వివరాలివి!

by

reliance jio android phone

Reliance Jio సంస్థ JioPhoneని విడుదల చేసిన సమయంలో స్మార్ట్ఫోన్ యుగంలో ఫీచర్ ఫోన్ ఎవరు వాడతారు అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమయ్యాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ JioPhone అనూహ్యంగా విజయవంతమైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో Reliance Jio సంస్థ మరోసారి సంచలనాలకు శ్రీకారం చుట్టబోతోంది. ఏకంగా 10 కోట్ల చవక Android phoneలను రూపొందించడం కోసం ఆ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పెద్దగా ఆర్థిక స్తోమత లేని వినియోగదారులకు వీటిని అందుబాటులో ఉంచబోతున్నారు. కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా, JioPhoneలో ఎలాగైతే డేటా సేవలు కూడా అందించబడ్డాయో అదేవిధంగా మొబైల్ డేటా కూడా కలిపి ఈ ఫోన్లని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వస్తారు.

తక్కువ ధర కలిగిన Android phoneల విషయంలో ప్రస్తుతం భారతీయ మార్కెట్లో చైనాకు చెందిన Xiaomi, Realme, Oppo, Vivo వంటి సంస్థలు భారీ మొత్తంలో మార్కెట్ షేర్ కలిగి ఉన్నాయి. వాటికి పోటాపోటీగా Reliance Jio కొత్త బడ్జెట్ ఫోన్ తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది వేల రూపాయల ధర లో Android Go ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా Jio తీసుకు వచ్చే Android phone ఉండే అవకాశం ఉంది.

కొత్తగా ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో వెచ్చించలేని గ్రామీణ ప్రాంత వినియోగదారులకు, పేద వర్గాలకు ఇది అనుకూలంగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఈ కొత్త ఫోన్ లో Whatsapp, Youtube, Facebook వంటి అన్ని ముఖ్యమైన అప్లికేషన్స్ తో పాటు Google Play Store నుండి కావలసిన అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇప్పటివరకు JioPhoneలో KaiOS ఉపయోగించబడి ఉంటే, ఇటీవల గూగుల్ సంస్థ జియో లో కొంత వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇక మీదట ఏకంగా Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా phoneలను తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 2020లో ఇది అధికారికంగా ప్రకటించబడుతుందని తెలుస్తోంది.

Filed Under: Tech News Tagged With: gadgets, jio cheap android phone, reliance jio android phone, reliance jio phone

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 10
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in