• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

google android

Androidలో ఈ కొత్త ఫీచర్ తో బ్యాటరీ చాలా ఆదా అవుతుంది!

by

Android 11 new feature to save battery

Android phoneలలో ఇటీవలికాలంలో 6 జిబి నుండి గరిష్టంగా 16 జీబీ వరకు RAM కలిగిన ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా smartphoneలు మరింత శక్తివంతంగా మారేకొద్దీ మల్టీటాస్కింగ్ మెరుగుపడుతుంది గానీ మరోపక్క బ్యాటరీ కూడా వేడెక్కుతూ ఉంటుంది. తద్వారా బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది.

ఒక ఆపరేటింగ్ సిస్టం కి వివిధ ప్రోగ్రాముల పనితీరు మెరుగ్గా ఉండేలా చూడటం తో పాటు, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా వచ్చేలా చూడడం అతి కీలకమైన అంశం. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న Google ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ మెరుగ్గా వచ్చేలా చాలాకాలం నుండి అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. గతంలో అందుబాటులోకి వచ్చిన Doze mode అలాంటి వాటిలో ఒకటి.

అయితే దానికి అదనంగా తాజాగా Android 11 ఆపరేటింగ్ సిస్టంలో గూగుల్ సంస్థ ఒక శక్తివంతమైన సదుపాయాన్ని తీసుకొచ్చింది. అదే క్యాఛే దశలో ఉన్న అప్లికేషన్లను ఫ్రీజ్ చేయడం! ఎప్పుడైతే వాటిని మళ్ళీ వినియోగదారుడు వాడడం మొదలు పెడతాడో అప్పుడు అన్‌ఫ్రీజ్ చెయ్యడం ఈ ప్రక్రియలో ఒక భాగం. సహజంగా మనం ఫోన్లలో ఒకేసారి పలు అప్లికేషన్లు ఓపెన్ చేసి పని చేసేటప్పుడు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్న అప్లికేషన్ మాత్రమే యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. మిగిలిన అప్లికేషన్స్ అన్ని మెమరీలో క్యాఛే చేయబడతాయి. రీసెంట్ అప్లికేషన్స్ ద్వారా గానీ, మనకు కావలసిన అప్లికేషన్ ఐకాన్ మళ్లీ టాప్ చేయడం ద్వారా గానీ మనం సంబంధిత అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అప్పటివరకు cacheలో ఉన్న యాప్ తిరిగి వెనక్కి తీసుకు రాబడుతుంది.

సరిగ్గా ఇలా cache చేయబడి ఉన్న అప్లికేషన్స్‌ని తాత్కాలికంగా ఫ్రీజ్ చేయడం ద్వారా అవి cpu సైకిల్స్ మరియు, ఇతర సిస్టం వనరులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం ద్వారా పరోక్షంగా బ్యాటరీ ఆదా అయ్యే విధంగా చేయటం Android 11లో కొత్తగా వచ్చిన సదుపాయం. వాస్తవానికి Android 11 ఆపరేటింగ్ సిస్టం కొంతకాలం క్రితం అందుబాటులోకి వచ్చినా కూడా తనకి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా కూడా అధికారికంగా లేదు. కానీ అంతర్గతంగా Android 11కి సంబంధించిన కోడ్ పరిశీలించినపుడు Google సంస్థ ఈ కొత్త సదుపాయాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లు అర్థమవుతోంది.

Filed Under: How-To Guide Tagged With: android 11, android 11 feature, google android, phone battery save

Android Phone వాడుతున్నారా? ఒక సూపర్ ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్

by

Google sound notifications android

Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లు వాడే వినియోగదారుల కోసం Google ఈ సంస్థ తాజాగా ఒక అద్భుతమైన సదుపాయం తీసుకొచ్చింది.

మీ Android phoneని పక్కనబెట్టి మీరు పని చేసుకునే సమయంలో మీ పరిసరాల్లో వినిపించే రకరకాల శబ్దాలను ఇది మీకు తెలియకుండా క్యాప్చర్ చేసి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వినిపిస్తుంది. Google సంస్థ చాలా కాలం నుండి అందిస్తున్న Live Transcribe అనే అప్లికేషన్ ద్వారా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. ఉదాహరణకు మీ ఇంటి డోర్ బెల్ మోగినా, మీ ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నా, లేదా బయట కుక్క అరుస్తున్నా, బాత్రూమ్‌లో నీరు లీక్ అవుతున్నా ఆ శబ్దాలను ఈ సదుపాయం పసిగడుతుంది.

వాటికి సంబంధించిన సమాచారాన్ని మీకు మీ ఫోన్ మీద నోటిఫికేషన్ల రూపంలో చూపిస్తుంది. ప్రస్తుతానికి Google Pixel phoneలలోని Live Transcribe సదుపాయం ద్వారా లభిస్తున్న ఈ ఫీచర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు వాడుతున్న ఫోన్ లోకి కూడా Live Transcribe అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా పొందొచ్చు. అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా దశలవారీగా అందించబడుతుంది. ఇప్పటికే Live Transcribe వాడుతున్న వారికి కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

మెషిన్ లెర్నింగ్ ఆధారంగా ఈ సౌండ్ నోటిఫికేషన్ సదుపాయం పనిచేస్తుంది. మీ ఫోన్ లో ఉండే మైక్రోఫోన్ ద్వారా రిసీవ్ చేసుకునే పది విభిన్నమైన శబ్దాలను ఇది గుర్తిస్తుంది. కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే కాదు ఒకవేళ మీరు Android Wear ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ వాచ్ లాంటిది ఏదైనా వాడుతున్నా కూడా దాని మీద కూడా మీకు నోటిఫికేషన్ చూపించబడుతుంది.

పని ఒత్తిడిలో ఉండి గానీ, ఇతర కారణాల వల్ల గానీ మీ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి పరిశీలించడం సాధ్యం కాని సందర్భాలలో ఈ సరికొత్త సదుపాయం

Filed Under: Tech News Tagged With: android new feature, android phone, google android, google live transcribe, Google sound notifications android

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in