
Realme smartphone వాడేవారికి ఆండ్రాయిడ్ కస్టమైజేషన్ లో భాగంగా అనేక శక్తివంతమైన సదుపాయాలు లభిస్తుంటాయి. ముఖంలో ఎలాంటి థర్డ్-పార్టీ లాంఛర్ వాడాల్సిన పని లేకుండానే మీ phoneలో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్లలో కొన్ని అప్లికేషన్స్ ఇతరులకు కనిపించకుండా దాచి పెట్టుకోవచ్చు.
ఈ సదుపాయం కోసం Realme phoneలలో App Lock అనే ఫీచర్ పొందుపరచబడింది. మీ హోమ్ స్క్రీన్‌ని వీలైనంత శుభ్రంగా ఉంచడం కోసం అందించబడిన ఫీచర్ ఇది. దీని ద్వారా అవాంఛిత అప్లికేషన్స్, మీరు ప్రైవసీ కోరుకునే అప్లికేషన్స్ ఇతరులకు కనిపించకుండా దాచి పెట్టుకోవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా సింపుల్!
మీ దగ్గర ఉన్న Realme phoneలో Settingsలోకి వెళ్లండి. అందులో Security > App Lock అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు పాస్ కోడ్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత Hide Home screen ఐకాన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, స్క్రీన్ మీద చూపించబడే అప్లికేషన్స్ జాబితా నుండి ఏ అప్లికేషన్స్ అయితే హోమ్ స్క్రీన్ లో కనిపించకుండా దాచిపెట్టాలని అనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత phone screen మీద రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు దాచిపెట్టాలి అనుకుంటున్న అప్లికేషన్లని Recent tasks, Notifications విభాగం నుండి కూడా దాచి పెట్టే విధంగా ఇది అవకాశం కల్పిస్తుంది. మీ అవసరాన్ని బట్టి ఆ రెండు ఆప్షన్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. వీటిని సెలెక్ట్ చేస్తే గనుక ఆయా అప్లికేషన్స్ నోటిఫికేషన్స్ కూడా డిజేబుల్ చేయబడతాయి. ప్రైవసీ కారణాలవల్ల మీ ఫోన్ లో ఉన్న ఏమైనా అప్లికేషన్స్ స్క్రీన్ మీద కనిపించకుండా, ఎవరు పడితే వారు వాటిని ఓపెన్ చేయకుండా రక్షించుకోవడం కోసం Realme phoneలలో పొందు పరచబడిన ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది.