• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

latest technology

Mi Home Security Camera 360 ఎందుకు బెస్ట్ కెమెరా అంటే.. – డీటైల్డ్ రివ్యూ!

by

Mi Home Security Camera 360 detailed review

ఇంటి సెక్యూరిటీ కోసం చాలామంది CC Cameraలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వీటికి కనీసం కంట్రోల్ బాక్స్ తో కలిపి 30 నుంచి 50 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టాల్సిన లేకుండా తక్కువ ధరలో మరిన్ని మెరుగైన సదుపాయాలు కలిగి ఉన్నాయి Mi Home Security Camera 360ని చాలా మంది ఇప్పటికే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో దీని పనితీరు, ఇతర ఫీచర్స్ గురించి చూద్దాం. 2,899 రూపాయలు అసలు ధర కలిగిన ఈ కెమెరా ప్రస్తుతం కేవలం2,599కే https://amzn.to/3lbO4cN లింక్‌లో లభిస్తోంది.

డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ

ఇది చూడటానికి ఒక బొమ్మ లాగా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. అవసరాన్ని బట్టి కెమెరా తన యాంగిల్ మార్చుకునే విధంగా దీన్ని రూపొందించారు. కెమెరా లెన్స్ కింద microSD slot అమర్చబడి ఉంటుంది. అలాగే కెమెరా వెనక భాగంలో గుండ్రంగా ఉండే స్పీకర్ గ్రిల్ లభిస్తుంది. Reset, Micro USB portలు కెమెరా వెనక భాగంలో లభిస్తాయి. పాలికార్బోనేట్‌తో రూపొందించబడిన డివైజ్ ఇది. అందువల్ల సుదీర్ఘకాలంపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. కేవలం 239 గ్రాముల బరువు మాత్రమే ఇది ఉంటుంది. షాక్ ప్రూఫ్ అవటం వలన పొరపాటున కింద పడినా కూడా పెద్దగా ప్రమాదం ఉండదు. ఏ మాత్రం శబ్దం చేయకుండా కెమెరా దానంతట అదే మూవ్ అవుతూ ఉంటుంది.

ఇన్‌స్టలేషన్, సెటప్ ఇలా!

దీన్ని ఎక్కడైనా సులభంగా అమర్చగలిగే విధంగా స్కూలను కూడా ఇచ్చారు. వాస్తవానికి టేబుల్ మీద, ఇతర ప్రదేశాల్లో కూడా స్క్రూలతో పనిలేకుండా నేరుగా అమర్చుకోవచ్చు. మొట్టమొదట కెమెరాను పవర్ కి కనెక్ట్ చేయాలి. కెమెరాతో పాటు 5 వాట్స్ అడాప్టర్ వస్తుంది. ఆ వెంటనే లెడ్ ఇండికేటర్ వెలుగుతుంది. ఆ కెమెరా నుండి వచ్చే లైవ్ వీడియో ఫీడ్ చూడడం కోసం Xiaomi Home Appని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. iOSకి కూడా ఇది లభిస్తుంది. వినియోగదారులు తమ వైఫై క్రెడెన్షియల్స్ ఈ అప్లికేషన్ లో ఎంటర్ చేయాలి. డివైజ్ పెయిర్ అయిన తర్వాత Mi Home అప్లికేషన్లో QR Code చూపించబడుతుంది. దానిని కెమెరా ద్వారా స్కాన్ చేయాలి. ఇదంతా కూడా చాలా సులభంగా పూర్తయ్యే ప్రక్రియ.

మిగతా 2వ పేజీలో..

Pages: Page 1 Page 2

Filed Under: Gadgets Tagged With: cc camera, gadgets, latest technology, mi camera, Mi Home Security Camera 360 detailed review, smartphone

ఈ లేటెస్ట్ టెక్నాలజీ Video చూస్తే కచ్చితంగా “వావ్” అంటారు!

by

ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. అనేక అద్భుతమైన ప్రాజెక్టులు వెలుగులోకి వస్తున్నాయి. సహజంగా ఒక ఫోటోలో ఏవైనా అవాంఛిత దృశ్యాలు ఉంటే వాటిని Photoshop వంటి వాటిల్లో సులభంగా తొలగించుకోవడానికి ఆప్షన్స్ లభిస్తుంటాయి.

ఒకవేళ ఏదైనా వీడియోలో మీకు అవసరం లేని వ్యక్తులను గానీ, వస్తువులను గానీ సులభంగా డిలీట్ చేయాలంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. Flow-edge Guided Video Completion పేరుతో పిలువబడే ఈ ఆల్గారిథమ్ ఏదైనా వీడియోలోని సెలెక్ట్ చేసిన భాగాన్ని పూర్తిగా తొలగించి, దాని స్థానంలో అప్పటికే చుట్టుపక్కల ఉన్న పిక్సెళ్లతో పూర్తి చేస్తుంది.

ఫైనల్ గా లభించే వీడియో మాడిఫై చేయబడింది అనే సందేహం ఏమాత్రం రాకుండా ఉంటుంది. వాస్తవానికి ఇప్పటికే అనేక రకాల ఫ్లో కంప్లీషన్ పద్ధతులు వినియోగంలో ఉన్నప్పటికీ వాటి అన్నిటికంటే చాలా సహజసిద్ధంగా ఔట్పుట్ లభించే విధంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఈ క్రింద వీడియోని మీరు చూస్తే గనుక కచ్చితంగా ఆ విషయం ఒప్పుకుంటారు. ఒక ప్లే గ్రౌండ్ లో ఆట ఆడుతున్న ఆట గాడిని, అతని నీడతో సహా తొలగించడంతో పాటు రకాల సందర్భాలలో రకరకాల అవాంఛిత దృశ్యాలను ఎంపిక చేసుకుని వాటిని డిలీట్ చేసి ఫైనల్ అవుట్ పుట్ సాధించడానికి సాధ్యపడుతుంది.

ఈ ఆల్గారిధమ్ ఆధారంగా మున్ముందు మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కోడ్ కూడా Githubలో లభిస్తోంది. లైనక్స్ ఎన్విరాన్‌మెంట్‌లో పైథాన్ ద్వారా దీనిని ప్రాక్టికల్గా ప్రయత్నించవచ్చు. అయితే ఒక మామూలు యూజర్ దీనిని నేరుగా వాడాలంటే మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మున్ముందు ఈ టెక్నాలజీని మరింత సరళీకృతం చేసి అందరూ వాడుకోగలిగే విధంగా అప్లికేషన్స్ రావచ్చు.

Filed Under: How-To Guide Tagged With: artificial intelligence, latest technology, latest technology artificial intelligence

మీ phone screenలను రక్షించటానికి శక్తివంతమైన కొత్త టెక్నాలజీ వచ్చింది!

by

కొన్నేళ్ల క్రితం వరకు smartphone కింద పడితే స్క్రీన్ మీద ఆశలు వదిలేసుకోవలసి వచ్చేది. అయితే ఈ మధ్యకాలంలో మార్కెట్లో లభిస్తున్న దాదాపు అన్ని ఫోన్స్ గొరిల్లా గ్లాస్ అనే టెక్నాలజీ చేత రక్షించబడుతున్నాయి.

ఈ టెక్నాలజీని అభివృద్ధి పరిచిన Corning సంస్థ ఎప్పటికప్పుడు దాన్ని మరింత మెరుగుపరుస్తూ వస్తోంది. ఇప్పటివరకు గొరిల్లా గ్లాస్ 6 వినియోగంలో ఉన్న నేపథ్యంలో తాజాగా, ఆ సంస్థ దాని తరువాత వెర్షన్ ప్రకటించింది. ఈ కొత్త వెర్షన్ ని Gorilla Glass Victus అని పిలుస్తారు. గొరిల్లా గ్లాస్ 6 1.5 మీటర్ల ఎత్తు నుండి కింద పడిన కూడా తట్టుకోగలిగితే, కొత్తగా అందుబాటులోకి వచ్చిన Gorilla Glass Victus, ఏకంగా రెండు మీటర్ల పై నుండి ఫోన్ కింద పడినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తట్టుకోగలుగుతుంది. అంతేకాదు గొరిల్లా గ్లాస్ పాత వెర్షన్ లతో పోలిస్తే పోలిస్తే, స్క్రీన్ మీద గీతలు పడకుండా రెండింతలు రక్షణ కల్పించగలుగుతుంది ఈ కొత్త టెక్నాలజీ.

Samsung సంస్థ అతి త్వరలో Galaxy Note 20ని విడుదల చేయబోతున్న నేపధ్యంలో అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీ కచ్చితంగా ఆ ఫోన్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గొరిల్లా గ్లాస్ కి ప్రత్యామ్నాయంగా ఇతర కంపెనీలు కూడా టెక్నాలజీలు అందిస్తున్నప్పటికీ అధిక శాతం స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలు తమ శక్తివంతమైన ఫోన్ మోడల్స్ కి ఈ టెక్నాలజీ మాత్రమే వినియోగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, ఇతర టెక్నాలజీలు కేవలం తక్కువ రెసిస్టెన్స్ మాత్రమే కలిగి ఉంటున్నాయి.

సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 తర్వాత, ఈ ఏడాది రాబోయే శక్తివంతమైన స్మార్ట్ ఫోన్స్ అన్నీ కొత్తగా వచ్చిన ఈ గొరిల్లా గ్లాస్ Victus టెక్నాలజీ ద్వారా రక్షణ కల్పించే పడతాయి అనడంలో సందేహమే లేదు.

దానికి సంబంధించిన డెమో వీడియో కింద చూడవచ్చు.

Filed Under: Tech News Tagged With: Corning Gorilla Glass Victus new technology, latest technology, phone screen protection, smartphone

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in