• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

new smartphone

Redmi 9 Power రిలీజ్ అయింది.. Realme Narzo 20కి ఇది ఎంతవరకు పోటీ ఇస్తుంది?

by

Redmi 9 Power vs Realme Narzo 20

Xiaomi ఈ సంస్థ తాజాగా భారత మార్కెట్లో తన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ Redmi 9 Powerని విడుదల చేసింది. 10999 రూపాయల ధరకు Amazonలో 22వ తేదీ మధ్యాహ్నం మొట్టమొదటి సేల్ జరగబోతోంది. ఇప్పటికే 10,499 రూపాయలకు లభిస్తున్న Realme Narzo 20కి ఇది ఎంతవరకు పోటీ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.

Redmi 9 Power స్పెసిఫికేషన్స్ పరిశీలిస్తే 6000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ లభిస్తుంది. సరిగ్గా అదే సామర్థ్యం కలిగిన బ్యాటరీ Realme Narzo 20లో కూడా ఉంటుంది. స్క్రీన్ పరిమాణం విషయానికొస్తే Redmi 9 Powerలో 6.53 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంటే, మరోవైపు Realme Narzo 20లో 6.5 అంగుళాల కేవలం హెచ్ డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంది. అంటే పరోక్షంగా స్క్రీన్ రిజల్యూషన్ పరంగా చూస్తే Redmi 9 Power కచ్చితంగా అడ్వాంటేజ్ కలిగి ఉంది.

Redmi 9 Powerలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాస ఉపయోగించబడి ఉంటే, మరోవైపు Realme Narzo 20లో మీడియా టెక్ హీలియో G85 ప్రాసెసర్ లభిస్తుంది. కెమెరాల విషయానికొస్తే Redmi 9 Powerలో 48 megapixel ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ ultrawide సెన్సార్, 2 మెగా పిక్సల్ డెప్త్, 2 MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. Realme Narzo 20లో కేవలం వెనకభాగంలో మూడు కెమెరాలు మాత్రమే ఉన్నాయి. దీంట్లో కూడా 40 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సల్ కెమెరా యథాతథంగా ఉంటుంది.

బరువు విషయంలో కూడా Redmi 9 Power కేవలం 198 గ్రాముల బరువు ఉంటే, Realme Narzo 20 రెండు వందల ఎనిమిది గ్రాముల బరువు ఉంటుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇది అసౌకర్యంగా ఉంటుంది. రెండు ఫోన్లు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివున్నాయి.

ఈ అంశాలను పరిశీలిస్తే ప్రధానంగా ప్రాసెసర్, స్క్రీన్ రిజల్యూషన్, వెనక భాగంలో కెమెరాల విషయంలో Redmi 9 Power మరింత మెరుగ్గా ఉంది. అయితే ధర విషయంలో మాత్రం Realme phoneని ₹500 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Filed Under: Gadgets Tagged With: new smartphone, realme narzo 20, redmi 9 power, Redmi 9 Power vs Realme Narzo 20, xiaomi phone

భారతీయ కంపెనీ Micromax In ఫోన్లు ఈరోజు విడుదలవుతున్నాయి.. వివరాలు!

by

Micromax In phones india

OnePlus, Xiaomi, Oppo, Vivo, Realme వంటి చైనా ఫోన్ తయారీ కంపెనీల ధాటికి తట్టుకోలేక చాలా కాలం నుండి స్తబ్దుగా ఉన్న Micromax తిరిగి తన కార్యకలాపాలు మొదలు పెట్టింది. ఈరోజు భారతీయ మార్కెట్లో Micromax In అనే సిరీస్‌లో రెండు సరికొత్త ఫోన్స్ అందుబాటులో తీసుకొస్తోంది.

Micromax In 1A, Micromax In 1 పేరుతో ఇది ఉంటాయని తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఒక లైవ్ ఈవెంట్ ద్వారా ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు ఫోన్లు తక్కువ బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటి ధర ఏడు వేల రూపాయల నుండి 15 వేల రూపాయల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం Micromax In1ని 7,000 రూపాయలకి, Micromax In 1Aని 10 వేల రూపాయలకి విక్రయించే అవకాశాలున్నాయి.

Micromax In 1 ఫోన్ల వెనక భాగంలో ఆకర్షణీయమైన ప్యాట్రన్ కలిగిన డిజైన్ ఉంటుంది. బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు ఫోన్ లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ఎడమ చేతి వైపు కెమెరా మాడ్యూల్స్, LED flash లభిస్తాయి. Micromax In phoneల డిస్ప్లే విషయానికొస్తే 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, సెల్ఫీ కెమెరా కోసం punch – hole cutout ఉంటుందని తెలుస్తోంది. అన్నిటికంటే అతి ముఖ్యమైన అసలు విషయానికి వస్తే ఒక ఫోన్లో మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్, మరో దానిలో మీడియా టెక్ హీలియో G35 ప్రాసెసర్ అందించబడే అవకాశం ఉంది.

కెమెరాల గురించి చూస్తే.. వీటిలో ఒక మోడల్ 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా కలిగిన నాలుగు కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. మరో మోడల్ 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా కలిగిన రెండు కెమెరాలు మాత్రమే కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ఒక మోడల్ లో 16 మెగా పిక్సల్, మరో మోడల్ లో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. 5000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో, Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఏ ఫోన్లు పనిచేస్తాయి.

Filed Under: Tech News Tagged With: Micromax In 1, Micromax In 1A, Micromax In phones india, micromax phones, new smartphone

ఈరోజు ఇండియా లో రిలీజ్ అవుతున్న Vivo V20 SE స్పెసిఫికేషన్స్ ఇవి!

by

Vivo V20 SE specifications price

ఇటీవల Vivo సంస్థ విడుదల చేసిన Vivo V20 మోడల్‌కి కొనసాగింపుగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు Vivo V20 SEని ఆ సంస్థ భారతీయ మార్కెట్లో విడుదల చేసే సన్నాహాలు చేస్తుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటికే ఆ ఫోన్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల దగ్గర ప్రీ-బుకింగ్ కూడా మొదలైంది. 20,990 రూపాయలకు ఈ ఫోన్ విడుదలవుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 6.44 ఫుల్ హెచ్డి ప్లస్ amoled displayతో, 60 Hz రిఫ్రెష్ రేట్‌ని ఈ Vivo V20 SE కలిగి ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం waterdrop notch లభిస్తుంది. ఈ ఫోన్ లో లభించే ఇతర హార్డ్వేర్ విషయానికొస్తే.. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెస్ అధారంగా పనిచేస్తూ, Adreno 610 గ్రాఫిక్స్ ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. 8gb ram, 128gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండే ఈ ఫోన్‌లో అదనపు స్టోరేజ్ కోసం మెమరీ కార్డు సపోర్ట్ ఉంటుంది.

Vivo V20 SE ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా తో పాటు, 8 మెగా పిక్సల్ మాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ లభిస్తాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్లో 4100 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఫోన్ వేగంగా ఛార్జింగ్ అవ్వడం కోసం 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

పైన చెప్పబడిన స్పెసిఫికేషన్స్ ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా Vivo V20 SE రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించబడతాయి. ఏ తేదీ నుండి ఈ ఫోన్ మార్కెట్లో లభిస్తుంది అన్నది కూడా కొద్దిసేపట్లో జరిగే ఈవెంట్ ద్వారా తెలుస్తుంది.

Filed Under: Gadgets Tagged With: new smartphone, vivo smartphone, vivo V20SE, vivo v20se price and specifications

మీరు ఫోన్ కొనడానికి Airtel లోన్ ఇస్తోంది!

by

Airtel is providing loan to buy a smartphone

Airtel వినియోగదారులను ఆకట్టుకోవడానికి కోసం కొత్తగా ఒక ప్లాన్ తీసుకొచ్చింది. కొత్త smartphone కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని వారి కోసం రుణాన్ని మంజూరు చేసే ప్రయత్నాన్ని మొదలు పెట్టింది.

2G మొబైల్ ఉపయోగిస్తూ, 4G సదుపాయం కలిగిన మొబైల్ కొనుగోలు చేయడానికి ఆర్థిక స్థోమత సరిపోని వారి కోసం Zero Extra Cost లోన్ ఆఫర్‌ని మొదలు పెట్టింది. 6,800 రూపాయల విలువైన 4G ఫోన్‌ని మొత్తం డబ్బులు పెట్టి కొనుగోలు చేయడం కుదరకపోతే, 3,259 రూపాయల డౌన్ పేమెంట్ చేసి ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత పది నెలల పాటు నెలకు 603 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

అలా పది నెలల పాటు నెలకు 249 రూపాయల విలువైన మొబైల్ రీఛార్జ్ కూడా ఉచితంగా లభిస్తుంది. అంటే 249 రూపాయలు మొబైల్ రీఛార్జ్ కోసం, హ్యాండ్ సెట్ కోసం EMI లెక్క వేసుకుంటే.. మొత్తం 9,735 రూపాయలు అవుతుంది. కానీ ఈ ఆఫర్ ద్వారా మీరు చెల్లించేది కేవలం 9,289 రూపాయలు మాత్రమే. 60 రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మీకు లోన్ సౌకర్యం కల్పించడం కోసం Airtel సంస్థ IDFCతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదిలా ఉంటే మరోవైపు.. Airtel సంస్థ ఇప్పటివరకు అందిస్తున్న డివైస్‌లకి కాకుండా మరో 200 విభిన్నమైన డివైజ్లకు వాయిస్ ఓవర్ వై-ఫై సదుపాయాన్ని విస్తరించింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశంలో మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోయినా కూడా, మీ వై-ఫై నెట్వర్క్ ఆధారంగా వాయిస్ కాల్ కనెక్ట్ అయి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్కాల్స్ మాట్లాడుకోవచ్చు.

ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి దశల వారీగా అనేక డివైజ్లకు Airtel దీనిని విస్తరిస్తూ వస్తోంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన అనేక రకాల smartphoneలకు కూడా తాజాగా సపోర్ట్ వచ్చింది.

Filed Under: Tech News Tagged With: Airtel is providing loan to buy a smartphone, airtel plans, airtel prepaid plans, new smartphone, smartphone loan

Vivo V20 SE విడుదల కాబోతోంది.. దాని స్పెసిఫికేషన్స్ ఇక్కడ!

by

Vivo V20 SE price and specifications in India

ప్రముఖ smartphone తయారీ సంస్థ Vivo తన లేటెస్ట్ మోడల్ Vivo V20 SEని భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి.

భారతీయ మార్కెట్లో 20,999 రూపాయలకు Vivo V20 SE విక్రయించబడుతుంది. 8gb ram, 128gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగివుండే మోడల్ ధర ఇది. వాస్తవానికి ప్రస్తుతం లభిస్తున్న Vivo V20 కన్నా ఈ ధర తక్కువగా ఉండటం గమనార్హం. Vivo V20 SEలో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ అమోల్డ్ డిస్ప్లే, ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం waterdrop notch లభిస్తుంటాయి. అలాగే స్క్రీన్ లోపలే అంతర్భాగంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

Vivo V20 SEలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెస్ ఉపయోగించబడి ఉంటుంది. మెమరీ కార్డు ద్వారా అదనపు స్టోరేజ్ పొందే అవకాశం లభిస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే FunTouch OS ఈ ఫోన్లో ఉపయోగించబడింది. 4100 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

Vivo V20 SE ఫోన్ వెనుక భాగంలో మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి. 41 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా తో పాటు, 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సల్ portrait lens లభిస్తాయి. సెల్ కోసం ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సల్ రిసల్యూషన్ కలిగిన కెమెరా ఉంటుంది. 4G LTE, dual-band Wi-Fi, బ్లూటూత్ 5.0, వంటి టెక్నాలజీల తో, usb type c portని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. 171 గ్రాముల బరువు తో ఇది ఉంటుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నవంబర్ చివరి నాటికి Vivo V20 Proతో కలిసి ఈ Vivo V20 SE మార్కెట్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Filed Under: Gadgets Tagged With: gadgets, new smartphone, vivo latest smartphone, Vivo V20 SE price and specifications in India, vivo V20SE

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 5
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in